కవిత్వానువాదాలు - మన కవులు
14
అరుణ గోగుల మంద
అరుణ గోగుల మంద గారి కవిత celestial confluence ను తెలుగు లోకి అనుసృజన చేయాలన్న ఆలోచనే ఓ
సాహసం. చాల లోతైన భావాలతో...ఒక సరిక్రోత్హ ఫిలాసఫీ ని తన కవితల్లో జొప్పించడం ఆమె సహజ
కవిత లక్షణం. అనువాదం చేసే ఆలోచనతో వాహిద్ గారిని అడిగి ఆమె సెల్ ఫోన్ నెంబర్ ను
తీసుకొన్నాను.
ఫోన్ చేసిన
మొదటి సందర్భం లోనే,
తన అనుమతి ని
అందచేసారు. చాల బిజి గా ఉన్నట్లు అనిపించింది. తర్వాత కాల్ లో వివరాల కోసం
రెండుమూడు సార్లు
ప్రయత్నించాను.
కానీ ఆమె అందుబాటు లో లేరు.
తెలుగు ఆంగ్లం
లో అద్బుతంగా
కవితలు రాయడం
ఆమె ఘనత.
ఈ కవిత భిన్న
మైనది.
ఆంగ్లం లో చాల ఉన్నత విలువలు కలిగిన పోయెమ్. తెలుగు ప్రపంచం గర్వించదగ్గ కవియత్రి.
అనువాదం లో చాల పదాలను అనుసృజన లోకి మార్చే సమయం లో పూర్తి స్వేఛ్చ ను తీసుకొన్నాను.
అరుణ గోగులమంద || Celestial Confluence
||
అనుసృజన : సి.వి. సురేష్
|| దివ్య సమాగమం||
..
అనంత ఆకాశం
ఒంటరిగా నడుస్తుంది
చీకటి సువిశాల
సాగర తీరం
పైకేగిసే అలల
అంతుచిక్కని రహస్య ఘోష
జీవితమనే ఓ నాటకాన్ని చిత్రీకరిస్తాయి
ఒక రోజంతా
సుదీర్ఘ మూకాభినయం తో...!
.......
కాలి గుర్తులు
..
కొన్ని జతలుగా
..
కొన్ని ఎకా౦తంగా..
తీరపు అంచున గుసగుస లాడే రెల్లుపువ్వులు
అంతం లేని హృదయ
ఘోష ల
అనావిష్క్రుత
చరిత్ర లెన్నో
అందిస్తాయి
...
ఒక పొగమంచు..
ఒక చిక్కుముడని
పిలచే జీవితం..
ఆ గజిబిజి గమ్యాలు..
సిద్దపడిన
ఆట౦కపు అపనమ్మక౦..
ఒక చిక్కు ను
విప్పే౦దుకు
ఇంకో అలోచాన శక్తిని విడుస్తూ వెళ్ళడం..!
..
హటాత్తుగా ....
ఎదురయ్యే
విభ్రమాలను స్మరిస్తూ...
హృదయం మంత్ర ముగ్దులను చూసే ఆ చూపుల్లో...
చివరి ముగింపు ఊహించినప్పటికీ...
..
ఆ చికిలించే
కళ్ళు
సుతారమైన హృదయ
స్పందనలు
మెరిసే భౌతిక
రూపాలు
ఆ తడి పెదవులపై
...
ప్రకాశించే
నవ్వులు
హృదయ కవాటాల్లో
...తడిసి ముద్దయ్యే స్వప్నాలు ..
పెనవేసుకొన్న ఆ
యవ్వన ప్రేమ
జీవితం లోకి
చేరుకొన్న ఆ సోలమన్ సంగీతం
ఆ శీతల రసరమ్య
వెన్నెల పరచుకొన్న రాత్రులు
ఆ నులివెచ్చటి
కౌగిలింతల్లో శాశ్వతమవుతాయి...!
...
కనురెప్పల
తడబాటు ..
చెట్టు కొమ్మలపై
కిల కిల రావాలు చేస్తూ పక్షులు ...
దైవత్వ
బృందగానంగా తమ ప్రేమ ను ఆలపిస్తుంటే..
ఆ ఉద్వేగాల జలపాతం
...
అసంబద్ద
సమావేశాలపై
అలల్లాగా వచ్చే
ఆలోచనలు
నాలుగు రోడ్ల
కూడల్లలో నిలిచే ఒక్కో ఏకాంతం
క్రూరమైన గమ్యాల యొక్క విధి నాటకం !!!
..
ఫలితం లేని
ప్రమాణాలు
హృదయానికి
తాకకుండా అవిర్భరించడ౦
పగిలిన
భావిష్యత్తు పై
గుట్టలు
గుట్టలుగా దృశ్యాలు
ఒక సుదీర్ఘ
నడక....
అతని జీవిత
గమ్యం పై ... అతని తో....
కానీ,
ఒక అపరిచిత శాపం
మధ్యలో ఆవిష్కృతమవ్వడం.
..
ఆ మృత హృదయం
యొక్క
సమాధి పై
మొలిచిన అక్షరాలు
నా చెలియకు
మాత్రమే అర్థమయ్యే ఓ విభిన్న శైలి!
అతని భూజమ పై
తలవాల్చి
తన అసాదారణ
కోరిక ను వివరించే విఫల యత్నం...!
..
ప్రపంచమంతా
ఘనీభవించినట్లు...
ఆమె..అతడు
..సర్వస్వం అందులో ఇమిడి పోయారు....
పరిస్థితులు
ఇప్పుడు వేరుపడ్డాయి.
ఆమె
కోల్పోయింది.
అతని మగ దాసత్వం
కోసం జీవితం కోల్పోయింది.
కానీ.
ఇప్పుడింకా,ఆమె ఆ గాలుల్లోనే ..
వగచిన గతపు
జ్ఞాపకాల పరిమళ౦ లో ఉండిపోయింది..!!!
Original
poem :
Aruna
Gogulamanda || celestial Confluence ||
Unending
sky walks alone
The
dark banks of the enormous sea..
Mysterious
uproar of the high rising tides..
Presents
the drama called life
in
a day long mime.
...
Foot
prints..
Some
in pairs
others..lonesome.
Whispering
reeds on the edges of the banks
convey
the hidden histories
of
endless heartaches.
..
A
haze.
A
labyrinth called life.
Confused
destinations.
Willing
suspension of disbelief
Dazed..
To
solve the maze.
..
Enchanting
sudden surprizes.
Heart
pines for more to lose in his eyes
of
magical gazes,
even
after presuming the dead end.b
..
Twinkling
eyes.
Tinkling
heartbeats.
Glowing
physical selves,
Radiant
smiles on moist lips.
Dreams
get drenched in twin hearts..
entwined
in youthful love.
Song
of Solomon..comes to life,
in
romantic, chilled moonlit nights.
Eternalized
in warm hugs.
...
Fluttering
eye lashes..
Twittering
birds on the branches of trees
sing
their love in divine chorus.
A
cascade of emotions flow in a series of sensuous unions.
Celestial
confluence.
...
of
Ripples of thoughts..
Of
unplanned meetings.
on
the cross roads individual solitudes.
Fatal
play of cruel destiny.
..
Unfruitful
promises.
Hearts
ripped apart.
Heaps
of images of broken future,
A
long walk on the path of life with him
but
an unknown curse landed in division.
..
Inscription
on the tomb of a dead heart
In
an enigmatic form known just to its lover.
She
longed to elaborate
leaning
on to his shoulder, but in vain.
..
Frozen
seems the world..!
She..
him and everything in it.
Things
fall apart.
She
is lost..
lost
for life..to his manly thrall.
But
she remains still in the air
a
fragrance of memories of tragic past
.* * *


No comments:
Post a Comment