కవిత్వానువాదాలు - మన కవులు
3
శిలాలోలిత
శిలాలోలిత గారి “చలన సూత్రాలు “ కవిత “
ఆమె ఒక నిశ్శబ్ద ఒరవడి. కవియత్రి శిలాలోలిత గారు ఈ కవిత కు “చలన సూత్రాలు “ అని పేరు పెట్టడం నాకు మొదట ఆశ్చర్య మేసింది. చదివాను లోతుగా...ఆ కవిత కు ఇంకే పేరు పెట్టినా అది పొసగదు. సమాజ చలన సూత్రాలు society motive forces చుట్టూ మార్క్స్ అనేక సైద్దాంతిక విషయాలను బయట పెడతారు. ఆ నిర్దిష్ట చలన సూత్రాల మేరకే, సమాజం దిశలు నిర్ణయించుకొని కదులుతుంటుంది. మలుపులు తిరుగుతుంటు౦ది.
ఆ క్రమం లోనే ఈ కవిత కు కూడా ఆ టైటిల్ అద్బుతంగా ఎలా అమరిందంటే, . అనేక మంది అద్బుత కవులు రచించిన ఆ అక్షర కుసుమాలను (motive forces) నేటి తరం ఊత కర్ర గా భావించి, వాటిని పట్టుకొని మన ప్రయాణం సాగించాలనడ౦ తో, ఆ టైటిల్ కు జీవం పోశారు.
ఇక్కడ ఇంకో ఆశ్చర్య కర విషయమేమంటే, అదే కవిత లోనే, ఆ అద్బుత కవులు వెళ్లి పోవడం పై, నివాళు లర్పిస్తూనే, వాళ్ళు మార్గాదర్సకులనే ఆలోచన చెపుతూనే, వాళ్ళ బాట లోనే పయనించాలని బోధిస్తూనే, ఈ మరణాలూ, ఈ జీవి౦చడాలూ వాటి మధ్య ఒన్న అనుబంధాల పై ఒక తాత్విక ధోరణి తో కవిత మొదలు పెట్టడం ఒక విశేష కళ.
ఇక అనువాదానికి వస్తే, కవిత లో, చాల సరళమనుకొనే వాఖ్యాలు మన పరాయి భాష లోకి అనువదించడానికి, ఇబ్బంది పడాల్సి వచ్చింది.... “ నేడున్నారనుకొంటే లేరు” “చెమర్చుతున్న కన్నీళ్లను అధిమి పడుతూ” “ఆర్ద్రత పొలమారు తు౦టే” ఇలాంటి idiomatic సోగసుగల వాక్యాల ను అనువదించడం లో పూర్తి స్వేఛ్చ ను తీసుకోవాల్సి వచ్చింది. కవిత లో కవి అంతరంగాన్ని పక్కకు పోనివ్వ కుండా, విషయాన్ని అవగతం చేసుకొని, పూర్తిగా పరాయి బాష లోకి కవిత మూలార్థ౦ కానీ, ఆ “టోన్” ను గానీ, మిస్ అవ్వకుండా అన్వదించడం తోనే, అనువాదం యొక్క ఫలితం అనువదించిన బాష లోని పాటకులకు చేరుతుంది.
“To maintain the original flavor and beauty of the text of the Source Language, the translator explores a similar kind of figure of speech, idiom and phrase which can express the meaning of a translated text in an equal manner in the Target Language. దాన్ని equivalence అంటారు .
చాల సందర్భాలలో తెలుగు బాష లో మెదిలే “figure of speech”, “idiom or phrases” లకు సమాన౦గా ఆంగ్లం లో లభ్యమయ్యే అవకాశాలు ఉండవు. సాధ్యమైనంత చేరువలో అనువదించిన బాషలో అభివ్యక్తి, figure అఫ్ స్పీచ్, టోన్ ఉండేలా చేయగలడమే అనువాదకుని ప్రతిభ..
అదే విధంగా ఆంగ్లం లో ఉన్న idioms, idiomatic బాష కు కూడా తెలుగు లో దొరకవు. .”sixes and sevens” అంటే అస్తవ్యస్థ౦గా కట్టడం, raining dogs and cats అంటే, కుండపోతగా వర్షం కురిస్తోందని, “see him off in the bus“ ఎవరైనా bus లో ప్రయాణం చేసే వారిని, బస్ దాకా విడిచి పెట్టి రావడం” ఇలా ఎవరి బాష లో వారికి అవి సులభమైనా, పరాయి బాష లోకి వాటిని అనువదించడానికి కానీ, అర్థం చేసుకోవడానికి కానీ, సరి కోత్హగాఅనిపిస్తుంది. ...
అనువాదాల విషయం లో సాధ్యమైనంత శ్రమ అయితే పడ్డాను.
శిలా లోలిత || చలన సూత్రాలు ||
అనుసృజన : సి.వి.సురేష్ || Motive Forces ||
why the humans are passing away alike?
They were present..
Day before yesterday…
Even yesterday too
But, today, they are no more… !
what is the ambit..
in between the mortality and immortality?
..
…
They are the futuristic sparkles
They are the optimistic visions
They are the ideological visuals
In the row of humans..
They are studded beads…
They are simper assurances
..
Names may differ
One and the only soul.
Routs and aims may vary
still Their …hearts quest for humanism !
..
...
Smiloo, Jwalaamukhe,
Maddasaani Ram reddy,
Sahavaasi, Adoori Sathyavathee devi,
Bbhargavee rao,
Haripurushothham, Roudhree,
Unnava vijayalakshmi Bharathi,
Kothhapalli Sreemannaayarana,
K.S. Ramana, C.. Dharmaa rao,
..
They sprayed syllabary
Their letters are like fallen flowers
By, hoarding those memories …
And, swallow the bitter pills..
As, the body is mortal…
And the flowers of syllabary are immortal!
By, controlling the moistening tears, and
Their invisible memories….
As, the mercy struck in the wind pipe..
We will move n’ move ahead….
With their syllabary crutch!!
శిలా లోలిత || చలన సూత్రాలు ||
మనుషులంతా ఇలా వేల్లిపోతున్నారేమిటి?
మొన్నున్నారు
నిన్నన్నారు
నేడున్నారనుకుంటే లేరు
ఉ౦డటానికీ లేకపోవడానికి
మధ్య నున్న దూరమెంతః?
..
భావిష్యత్కా౦తులు వాళ్ళు
ఆశావాహ దృక్కోణాలు వాళ్ళు
సైద్దాంతిక చలన చిత్రాలు వాళ్ళు ‘
మానవహారంలో మణిపూసలు వాళ్ళు
చిరునవ్వుల భారోసాలిచ్చిన వాళ్ళు
..
పేర్లు రకరకాలు కానీ,
మానవదేహమొక్కటే
మార్గాలు, గమ్యాలు వేరైనా
మనిషితనపు ఆనవాళ్ళను
వెతికిన హృదయాలే వాళ్ళు
..
స్మైలూ, జ్వాలాముఖి, మద్దసాని రాం రెడ్డి
సహవాసి, ఆదూరి సత్యవతీదేవి, భార్గవీరావు,
హరిపురుషోత్హము, రౌద్రీ, ఉన్నవా
విజయలక్ష్మిభారతి,కొత్తపల్లి సత్యశ్రీ మన్నారాయణ ,
కే.యస్.రమణ, సి.ధర్మా రావు
..
వాళ్ళంతా దేహాలు విదిల్చారు
రాలిపడ్డ పువూల్లా వాళ్ళ అక్షరాలు
ఆ జ్ఞాపకాలను సమీకరించుకుంటూ
దేహమశాశ్వతమనీ ..
అక్షరాల పూలే శాశ్వతమనే
చెడు గుళికలను మింగుతూ
రూప రహితమైన వారి జ్ఞాపకాలను
చెమర్చుతున్న కన్నీళ్లను అదిమపడ్తూ
ఆర్ద్రత పోలమారుతుంటే,
వారి అక్షరాల ఊతకర్రతో
ముందుకు మున్ముందుకు సాగిపోదాం !!!


No comments:
Post a Comment