కవిత్వానువాదాలు - మనకవులు
18
సుపర్ణ మహి
మూడు పదుల ప్రాయం ఇప్పుడిప్పుడే
నింపుకొని, తత్వాన్ని, కవిత్వాన్ని మిళితం
చేస్తూ, కవితా
ప్రియులకు మంచి కవిత్వాన్ని అందిస్తున్న సుపర్ణ మహి ఈ నాటి కవిత్వానువాద శీర్షిక
కు అతిధి.
ఊరు ఒంగోలు. చదివిందీ, పెరిగిందీ అక్కడే. ఇంటర్ వరకే చదివి, తర్వాత పారిశ్రామిక విద్యుత్ రంగం లో పని చేస్తూ, ఉండే మహీ, ఒక జింక పిల్ల. ఇప్పటికే ఐదారు సార్లు మహీ తో మాట్లాడిన అనుభవం తో చెప్తున్నాను, ఎప్పుడూ హుషారుగా, గమ్మత్తుగా, తాత్వికంగా, కవిత్వంగా కనిపిస్తాడు. ఆ కవి కవిత్వ ప్రయాణాన్ని ఆయన మాటల్లోనే విందాం.

రెండు
తెలుగు రాష్ట్రాల్లో, ఇవాళ కవులు ఎవరైనా కవిత్వం
రాయగలగడమో, చదవగలగడమో జరుగుతోందటే, వారిలో
సగం మందికి పైగా “కవిసంగమం” గ్రూప్
ను చూడని వారు ఉండరు.
బాగా
చదవగాలిగినవారే రాయగాలుగు తారు. సమకాలీన కవిత్వం ఒకటే కాదు. వెనక తరాల కవిత్వాన్ని
కూడా చదవాలి.
.
కవిత్వాభినివేశ౦:
మా నాయనమ్మ మంచి రీడర్. వారపత్రికలు, పురాణాలు అన్నీ ఆమె దగ్గర ఉండేవి. ఆమె వాటినన్నిటిని చదివేది. అప్పుడు నేను ఒక పోయెమ్ చదివాను. చనిపోయిన తన తమ్ముడిని తలచుకొంటూ ఒక అమ్మాయి రాసిన పోయెమ్. ఆ కవిత లో ఒక పదం నన్ను వెంటాడింది. ఒక వ్యక్తి చనిపొతే ఇలా రాస్తారా/ అని ఆ అమ్మాయి ఎలా రాసింది అని అనుకొన్న.. ఆ అమ్మాయి పేరు దేవిప్రియ. మొన్నటి వరకు దేవి ప్రియ అమ్మాయి అనుకొనే వాడిని. కానీ, ఇటీవలే తెలిసింది దేవిప్రియ అమ్మాయి కాదు. గొప్ప కవి అని . తర్వాత శ్రీ శ్రీ, ఆకలి రాజ్యమ లో కొటేషన్స్, ఆయన కవిత్వం, తర్వాత శేషేంద్ర గారి కవిత్వం ఇలా చదువుకొంటూ వచ్చాను. ఉత్సాహం వచ్చింది. కొందరు స్నేహితులు నా నుండి దూరం అయినప్పుడు ఆ పెయిన్ ను డైరీ ల్లో రాసుకోనేవాడిని. బాగా రాసాను. ఆ బాధను. అప్పుడు కవిత్వం అనే దాని పైన ఇష్టం పెరిగింది. నా వరకు నా స్నేహితులు విడిపోయిన తర్వాతనే నా కవిత్వ ప్రయాణం మొదలయింది.

ఫేస్
బుక్ కవిత్వం:
తర్వాత
పేస్ బుక్ లో మా సిస్టర్ ఐడి create చేసి ఇచ్చారు. ఇందులో
రాస్తుండు మహీ, అని సలహా కూడా ఇచ్చారు.
అప్పటికే, నేను అఫ్సర్ పెన్నా
శివరామకృష్ణ ల కవిత్వం ఎక్కడ కనపడినా, ఆ పేపర్ ను దాచుకోనేవాడిని.
అలాగే, ఆ ఇద్దరినీ అక్కడ చూసే
సరికి, నాకూ ఏదో రాయాలని తపన, అలా
సోషల్ మీడియా లో రాయడం మొదలు పెట్టినాను.
చిన్నప్పడు
ఒక ఫీలింగ్ ఉండేది.. ఒక్కసారైనా నా పేరు ను పేపర్ లో కనిపించాలని అనుకొనేవాడిని.
అప్పటికే సారంగా పత్రిక వస్తుండేది. అఫ్సర్ గారి పత్రిక అని తెలిసింది. నా
స్నేహితురాలు ఒకావిడ సారంగా లో రాయి మహీ అని చెప్పింది. కానీ నాకు ధైర్యం చాలలేదు.
కొద్ది రోజులకు నేను ఒక పోయెమ్ ధైర్యం చేసి పంపినాను. పంపిన రెండు నిముషాల్లోనే
నాకు అఫ్సర్ గారి దగ్గర నుండి కాల్ వచ్చింది.. నీ పోయెమ్ నచ్చింది మహీ. దీన్ని
సారంగా ప్రచురిస్తాను. అని చెప్పేసరికి ఆనందం పట్టలేక పోయింది. అది నాకు ఒక గొప్ప
సందర్భం. ఎప్పటికీ గుర్తే. తర్వాత ఏదైనా ఆనందం వచ్చినా, అవన్నీ
బోనస్ లె.
నేను
ఏదీ ఆశించి పోయెట్రీ రాయడం లేదు .. అందుకే, ఎప్పుడూ పోయెట్రీ నాకు
నిస్పృహ ను నిరాశను మిగల్చలేదు. పైగా , వ్యక్తిగా నాకున్న స్థానం
కంటే, poet గా నాకో ఉన్నత స్థానాన్ని, పెద్ద
కవుల సరసన అని చెప్పలేను కానీ, వారి మధ్యలో గుర్తింపు
తెచ్చి పెట్టింది.
కవిత్వాన్ని నేను ఏ మాత్రం నేర్చుకోలేదు. ఏదైనా ఒక విషయాన్ని, ఒక లయను, ఒక నిబంధనలను పెట్టుకోన్నమంటే, ఒక నిర్మాణం కోసం ఉన్నామనే అర్థం. ఖచ్చితంగా ఇదే పోయెట్రీ ఇలాంటిదే పోయెట్రీ అని చెప్పలేను. ఏదో ఇదామిత్తంగా రాసేస్తారు అని కూడా అనుకోను. ప్రతి ఒక్కరు పోయెట్రీ రాయాలని ఖచ్చితమైన ఆలోచనతోనే రాస్తారు. నాకు ఇప్పటికీ కవిత్వం knowledge తక్కువ. నాకున్నంత వరకు నాకు ఒక లయ ఉంటుంది. దానికి సమానంగా నా కవిత వచ్చిందా . లేదా. అని చూసుకొంటాను. ఎక్కడైనా, పద గాంభీర్యం, శబ్ద గాంభీర్యం పెద్ద పెద్ద పదాలు వాడటం జరిగిందా అని చూసుకొంటాను. అంతే

వ్యక్తి
తాలుకు ఆలోచన కవిత్వం. కవిత్వం మూల ఉద్దేశ్యం సమాజాన్ని మార్చడం , ఎక్కడో
మేలు జరుగుతుందనో అనుకోవడం పొరపాటే. అలా మార్చాలనుకోవడం కవి కున్న హక్కు. ఇవాళ
సోషల్ మీడియా కవిత్వం చాల మంది కవులు ఒక సిద్ధాంతం అంటూ లేకుండా, ఒక
సమస్య పైనో. ఒక సంఘటన పైనో ఎవరైనా రాయడం మొదలు పెడితే, అనుకరిస్తూ
రాయడం, అందులో తమని తాము చూసుకోవడం
జరుగుతోంది. పోయెట్రీ తాలుకూ లక్ష్యాన్ని సమగ్రంగా ఫాలో అయ్యి. కవిత్వాన్ని రాయడం
లేదని నా అభిప్రాయం. తమ వాదన ను బలంగా వినిపించగలుగుతుంది కానే, కవిగా
నిలిపే కవిత్వం రాయగలగాలి. ఇప్పుడొస్తున్న ఆధునిక కవిత్వం లో, పాత
కవిత్వం తో పోలిస్తే, కవిత్వం పాళ్ళు చాల తక్కువ.
గొప్ప కవిత్వం రాస్తున్న వాళ్ళు చాల తక్కువ.
కవిసంగమం
లో విరించి అన్న నాకు మొదట నుండి తెలుసు. ఆయన చెప్పేవాడు. కవిసంగమం లో
రాయామన్నాడు. అప్పుడు నేను వోద్దన్న. అక్కడ పెద్ద పెద్ద కవులు ఉంటారు... అని
అన్నాను. అప్పుడు అదేమీ లేదు మహీ, రాయడం మొదలు పెట్టు. అక్కడ
మంచి వాతావరణం ఉంది అని ప్రోత్సహించాడు. బయపడుతూనే వచ్చాను. నా భయాలన్నీ తొలగి
పోయాయి. అక్కడ మంచి వాతావరణం ఉంది. సాదరంగా ఆహ్వానించారు. మంచిగా ఉంటె, మంచి
గా ఉందన్నారు. బాగలేకుంటే, బాగాలేదని చెప్పేశారు. చాల
సంతోషం.
మీరు
కానీ, వంశీ గారు కానీ, రాజారం
అన్న కానీ, అఫ్సర్ గారు కానీ, వెంకట
యోగి గారు కానీ, ఎల్. ఎన్. గుంటూరు సర్ గానీ, ఇతర
శీర్షికలు కానీ, కవిత్వం దాని విషయాలు
నేర్చుకోవాలనుకొనే వారికి పెద్ద ఉపయోగకరం. చదవాలన్న ఆలోచన ఉన్నావారికి, చదివి
నేర్చుకోవాలన్న కవులకు ఈ కవిసంగమం లో కవితలు, శీర్షికలు చాల ఉపయోగకరం.
కవిసంగమం గ్రూప్ యొక్క లక్ష్యం యాకూబ్ గారు పూర్తి స్థాయిలో నిమగ్నమయి చేయడం తోనే
ఇవాళ ఆ గ్రూప్ తారాస్థాయి కి చేరుకొంది. .....
ఇలా
ఒక గంట పాటు అనర్గళంగా, ప్రశ్న వేస్తూనే, తటాలున
అందుకొని, సమాధానం ఇస్తూ, నవ్వుతూ, హుషారుగా
సమాధానం ఇస్తూ సాగింది. నిన్న రాత్రి.
ఇక ఈ
కవిత విషయానికొస్తే, ఒక మంచి కవిత. కొన్ని చోట్ల
పూర్తి స్వేఛ్చ తీసుకొన్నాను. భావం చెడిపోకుండా.. అనువాదం చేయడం ఆ వాఖ్య నిర్మాణం
తో కాస్త కష్టం అనిపించినా, మంచి కవిత ను చేసి
అనువాదించా అన్న అనుభూతి మిగిలింది.
...
..
..
సుపర్ణ
మహీ || ఆర్ యు ధెర్? ||
అనుసృజన : సి.వి.సురేష్ || Are You There? ||
..
..
Perhaps..
Dear, may be I cant move ..
without having a glance…
In the place where we were in converse
Even I walk away far to that place…
..
The cold breeze
Brings the sea which conjoining
the murk and moonlight
By holding the edges of the tides!
..
I stare around me
Moving away from there as if it’s too late…
By leaving scribed names….
N’ leaving the shared steps to the sands…!
..
I grope some moments
In the empty place where you left
N’ I will also stand
By removing the waves which bundled the legs
..
The word ..
Which you recited
Reminding me frequently
Tell me dear…
Are you watching me from any where else?

....
Original poem
Supama Mahi : ఆర్ యు దేర్?
బహుశా ఎప్పుడన్నా నేనలా
దూరమ్ నుంచి వెళ్తున్నా,
ఇవాళ మనమ్ కలిసి కబుర్లు చెప్పుకున్న
ఈచోటు వైపు చూడకుండా వెళ్లలేనేమో డియర్...!
..
చీకటినీ, వెన్నెలనీ
కలుపుతున్న సముద్రాన్ని
అలల అంచులు పట్టి చలిగాలి నాదాకా లాక్కొస్తుంది...
…
చుట్టూ చూస్తాను...
రాసుకున్న పేర్లనీ,
జతగా పంచుకున్న అడుగుల్నీ,
అలా ఇసుకకు వొదిలేసి
ఎవరికి వారు అప్పటికే ఆలస్యమైనట్లు
దూరంగా వెళ్లిపోవడమ్ కనిపిస్తుంది...
..
పక్కన
నువ్వు లేని ఖాళీ చోటులో
కొన్ని క్షణాలు తడిమిచూసీ,
కాళ్లని చుట్టేస్తున్న
అలల్ని విప్పుకుంటూ
ఇక నేనూ లేచినిలబడతాను...
..
మొదట్లో*
నువ్వన్నమాటే
ఈమధ్య పదే పదే గుర్తొస్తుంది,
చెప్పు డియర్ ఈ సాయంత్రాల్లో
ఎక్కడి నుంచైనా
నావైపు చూస్తున్నావా...?

* * *

No comments:
Post a Comment