Wednesday, July 18, 2018



                                      కవిత్వానువాదం - మనకవులు


13


ఇబ్రహీం నిర్గుణ్ 


           ఇబ్రహీం నిర్గుణ్  ఖమ్మం లో హిందీ టీచర్. ఆయన రాసిన కవిత మా నాన్న  ఆదిమ మానవుడు”  పేరు లోనే ఆ  కవితను   చదివించే  ఆసక్తి  కలిగింది.  ఈ కవిత ను ఆంగ్లం లోకి అనుసృజన చేసే క్రమంలో  ఆయన తో నిన్న రాత్రి మాట్లాడినాను. భయ్యా...! అని ఆప్యాయంగా పిలుచుకోన్నాం. ఒక అరగంట సేపు సాగిన మా మాటల్లో  అనేక  విషయాలు దొర్లాయి. పూర్తి progressive భావాలు ఉన్న నిబద్దత గల కవి. కవి యాకూబ్ గారు, శిలా లోలితా గారు తన కవిత్వానికి మార్గదర్శకత్వం అనీశివారెడ్డి గారుఆశారాజు గారి కవితలంటే ప్రాణం అని కోటిరెడ్డి గారుసి.హెచ్.ఆంజనేయులు గారు ,   రాజ  హుసైన్  గారు, సతీష్ గారు, నేనూ, ఇంకా  కొందరు  అజ్ఞాత  కవులు  చాల స్ఫూర్తి నిచ్చారని హిపోక్రసి లేకుండా చెప్పుకొచ్చాడు.. త్వరలో  రాబోయే తన  కవితా సంకలనం “  ఇప్పుడేదీ రహస్యం కాదు” .. ఆ పేరు పై ఒక  అంతు చిక్కని  రహస్యాన్ని చెప్పాడు.  2011 వరకు  పెద్దగా  కవితలేవి రాయని  నిర్గుణ్  ను, ఆ సమయం లో,   ఒక  కవి  రాసిన  కవిత  తనను  చేయి  పట్టి నడిపించిందనీతన విజయంతన కవిత ప్రయాణం అక్కడి నుండే  అని చెప్పాడు.  ఆ కవి పేరు కానీఆ కవిత పేరు కానీ  చెప్పలేనని అదే  రహస్యమని అన్నాడు. కవియత్రాకవినాఅని  అడిగితే, పెద్దగా నవ్వి, కవి  నే అని  చెప్ప్పాడు.  తులసి దాస్ తన భార్య ను చేరుకోనే  ఆత్రుత లో, గవాక్షి కి వేలాడుతున్న పాము ను కూడా గమనించ కుండాఆ పాము ను పట్టుకొని కిందకు దిగినప్పుడుఆయన భార్య చెప్పిన కొన్ని మాటలు ఆయన ను గొప్ప కవిని చేసిందనిఅలాంటిదే  ఆ రహస్య కవిత  అని చెప్పాడు. ప్రముఖ హింది కవి బిహారి లాల్  కవిత్వ౦లోని  కొన్ని అద్బుత వాఖ్యాలను  చక్కగా పాడి, దాని అర్థాన్ని  వివరించాడు. 
చాల  పేద కుటుంబం నుండి వచ్చిన నిర్గుణ్తనకు అన్ని రకాలుగా ఆర్హిక సహాయం  చేసి జీవితాన్ని నిలబెట్టిన కే. నరసింహ రావు గారిని చాల సార్లు అనుకొన్నాడు.  
భావ కవిత్వం చాల కాలం మనుగడ  అంటారు కానీ, విప్లవ కవిత్వమే పది కాలాలు మనుతుందని, అందుకు ఉదాహరణలు చెప్పుకొచ్చాడు.  జార్జ్ బుష్ పైకి బూటు విసిరేసిన ఆల్ జైది  అనే వ్యక్తి ఆ పేరు లోని  ‘జైది’  ని తీసుకొని తన కుమార్తే కు  “రక్షందా జైది”  అని పేరు పెట్టినాననిఅలాగే తనకు బాగా నచ్చిన  దర్శకుడు  “ఫాజిల్”  కు గుర్తుగా తన కుమారుడికి ఫాజిల్ హిందూస్థానీ  అని పేరు పెట్టినాను అన్నాడు. ఆయన ప్రతి మాటలో మార్క్సిజం భావాలు తోణికిస లాడుతుంటాయి. 
ఇక కవిత విషయానికొస్తే, తన  తండ్రి తన కోసం, తన తమ్ముడి కోసం ప్రాణం ఇచ్చేవాడని, అతి పెద్ద భూస్వామి, ఒక సెంటు భూమి కూడా లేకుండా పోయిన స్థితి కి చేరుకోన్నాడని, ప్రతి రోజు ఏదో ఒకటి ఇంటికి తీసుకు రమ్మని  ఒక  సలహా లాగ చెప్పేవాడని, తన జీవిత పూర్తిగా తన కోసం, తన తమ్ముడి కోసం త్యాగం  చేసినాడని చెప్పాడు.  ఎలాంటి హైపోక్రసి లేని అద్బుత వ్యక్తి ఇబ్రహీం నిర్గుణ్.
కవిత ను స్వేచ్చానువాదం  చేసే సమయం లో , ఆయన భావాన్ని పక్కకు తప్పకుండ, ఆంగ్లం లోకి అనువదించి నానని భావిస్తాను.  కొన్ని  వాఖ్యాల్లో  పూర్తి స్వేఛ్చ ను తీసుకొన్నాను.

*****
ఇబ్రహీం నిర్గుణ్  ||  మా నాన్న ఆదిమ మానవుడు ||
ఆంగ్లం లోకి అనుసృజన : సి.వి.సురేష్ 

|| My Father  Is A Primitive Man||
..
My father used to heed….
Heading up on my childhood
Bring back  something to your homestead.   
Either a stone on the road 
or a  stick,  or a  cake of dung dried..
While returning…!
Tell me …?
What can I bring back  to my domicile?
It’s  not  a village  
To obtain  those cow-dung cake 
or  a firewood stick, 
Or a pebble or a gravel…
It’s the city  covered  with  offal!
While nearing  to the  nest
The splinted thought 
Rested  the  wings of  juvenility 
On  a  scrap of  paper  somewhere away…!   
..
If anyone glances
N’ thought  as a  pickup boy of  scrap papers
But  the  soul  consoles….
Alphabets on a paper  valid more of  lakhs…
Is it not?
see  and  read  if  it’s a  paper blacken with alphabets !
Hey !
If it’s a blank paper
Write  on it  a  valid  letter
In the inmost heart  when  the  thoughts flitter
A raged hungry stomach
Hide outs  in its dried flanks such  scrap papers…
..
My dad is a primitive man
Feel to procure something to the future generation
By the time I  reach  my  home
I should convert   and   give…
 these starved  belly  into a poetry  progressive ….!



ఒరిజినల్  పోయెమ్ 
ఇబ్రహీం నిర్గుణ్ ||మా నాన్న ఆదిమానవుడు ||
మా నాన్న !
నా బాల్యం మీద నిమిరి
ఓ మాటనెవాడు
ఇంటిముఖం పడుతున్నప్పుడు
దారిమీద దొరికే రాయో ,రప్పో
కట్టెపుల్లో , ఎండినపిడకో
ఏదో ఒకటి చేత పట్టుకొని రావాలనేవాడు
..
ఇప్పుడు ఏం తీసుకెళ్ళగలను ?
ఇదేమన్న ఊరా !
పిడకో-పుల్లో ,రాయో-రప్పో దొరకడానికి
నగరం చెత్తను కప్పుకున్న ప్రపంచం
ఇల్లు దగ్గరౌతున్నకొద్ది ఆలోచన విరిగి
ఎక్కడో దూరంగా ఓ చిత్తు కాగితం మీద
బాల్యం రెక్కలు వాల్చింది.
ఎవరైనా చూస్తే 
చిత్తు కాగితాలు ఏరుకునేవాడంటారేమో !
మనసంటుంది ఐతే అయ్యింది పర్లేదులే !
కాగితంలో అక్షరాలుంటే లక్షలకన్నా విలువేగా
నల్లకాగితమైతే చదివి చూడు
..
కాగితంలో అక్షరాలే లేకుంటే
లక్షలకన్న విలవైన అక్షరాన్ని రాయి
ఆలోచనలు అంతరంగంలో తర్జన బర్జనవుతున్నప్పుడు !
..
జ్వలిస్తున్న ఆకలి కడుపొకటి
చిత్తుకాగితాల్ని తన ఎండిన డొక్కల్లో దాచుకుంటుంది
..
మా నాన్న ఆదిమానవుడు  
రేపటి ప్రపంచానికి ఏదో ఒకటి సమకూర్చాలనేవాడు
నేను ఇంటికి వెళ్ళేలోపు ఎండిన ఈ డొక్కల్ని 
రేపటికి కవిత్వాన్ని చేసి ఇవ్వాలి 
                *  *  *


No comments:

Post a Comment