కవిత్వానువాదాలు - మన కవుల ![]() |
1
ఆశారాజు
“మనిషైతే గాని కవిత్వం రాయలేడు..సురేషూ!...కవిత్వం అంటేనే ప్రేమ” అని కవి ఆశారాజు నిన్న రాత్రి ఫోన్ లో నాతో ఆప్యాయంగా అనడం తో అప్రయత్న౦గానే “వాహ్” అన్నాను.
ఈ వారం ఆయన కవిత ను ఆంగ్లం లోకి అనుసృజన చేయాలని, ఆయన అనుమంతి కోసం ఫోన్ చేసాను. రాత్రి బాగా పొద్దు పోయింది. ఒక గంట పాటు ఆత్మీయ కవిత్వ సంబాషణ మా ఇద్దరి మధ్య సాగింది. ఒక్క క్షణం కూడా ఆయన లో విసుగు కనిపించలేదు. ఒక గంట పాటు జరిగిన సంబాషణ లో ... 18 సంకలనాలు అచ్చు వేసినా, కేవలం మూడింటికి మాత్రమే ఆవిష్కరణ సభలు పెట్టాను... అని ఆయన అన్నప్పుడు మాత్రం ఆయన మాటల్లో ఏదో సన్నని బాధ కనిపించింది. ఇక అంతా అమితోత్శాహమే ! కవిత్వం పై మాట్లాడుతున్నంత సేపూ, ఆయనలో ఒక పెద్ద ఉత్సాహం.. గొప్ప ఆసక్తి... ఇంకా ఏదో చెప్పాలన్న ఆరాటం చూసాను. ప్రతి సారీ సురేషూ ...సురేషూ అని పిలుస్తుంటే ..తెలియని ఆత్మీయతొకటి గుండెల నిండా పరుచుకొంది....
..
కవిత్వం పై ఆయన ఆసక్తి ఆయన మాటల్లోనే...
ఏమో సురేషూ నాకైతే కవితల్లో కవిత్వం లేకుంటే అస్సలు నచ్చదు. ఒకటి చెప్పు.... !ఎవరినైనా నిర్దాక్షిణ్యంగా చంపే కత్తి కి నగిషీలు చెక్కిన ఒర..., వజ్రాలో.. సింహపు బొమ్మో చెక్కిన పిడి...అందంగా కనిపించే ఆ చేమికీలు ఎందుకు పెడతారంటావు.? ప్రతి దానికి ఓ నగిషీ అవసరం.. మన భావనలకు .. మన భావోద్వేగాలకు నగిషీ లాంటిదే కవిత్వం.! చెప్పేది అందంగా ఉండాలి. శైలి, నడక కొత్తగా ఉండాలి.
సురేషూ...”నేపధ్యం” అనే నా కవితా సంకలనం ఆవిష్కరణ లో సి.నారాయణ రెడ్డి గారు వచ్చారు. వేదిక పై నుండి మాట్లాడుతూ, చూడు ఆశారాజు...నేను కళ్ళు మూసుకొని సంకలనం లోని ఒక పేజి ని తెరుస్తాను. అందులో కవిత్వం కనిపించక పోతే, వెంటనే వేదిక పై నుండి దిగి పోతాను.” అన్నాడు. అదే చేసాడు. చూసాడు. అద్బుతంగా ప్రశంసించాడు.
మొదట్లో నేను కవిత్వం కేవలం అవసరార్థం రాసేవాడిని. కే. శివారెడ్డి గారు మాకో ఉస్మానియా లో జాయిన్ అయినప్పుడు , ఆయనకు నేను దగ్గరవుతో వచ్చాను. అద్బుత సాహితీవేత్త, విశ్లేషకుడు.కే.కె.రంగనాథ చారి తమ్ముడు బుచ్చిబాబు నాకు చాల సన్నిహితుడు. చాల మంది కవులు శివారెడ్డి గారి ఇంటికి వచ్చే వారు. ఉస్మానియా రైటర్స్ అసోసియేషన్ కవులంతా ద్వారక హోటల్ లో వచ్చే వారు. కలిసేవాడిని..వాళ్ళ ప్రతిబ కవిత్వం నన్ను కవిత్వానికి దగ్గర చేసింది. ఉర్దూ సాహిత్యం పైన నాకున్న మక్కువ, అభినివేశం నాతో కవిత్వం రాయించడానికి సన్నాహం చేసింది. నాకంటూ ఒక డిక్షన్ ఏర్పాటు చేసుకొన్నాను. 1987 లో చార్మినార్ నుండి వస్తుంటే, ఒక bus లో గుడ్డివాడు ఉర్దూ లో “ నా కళ్ళ మీద పరదా లేదు...” అని పాడిన పాట నన్ను వెంటాడింది. ఆ పాట కు inspire అయ్యి ఒక కవిత రాసాను. “ మనిషే పాడినట్లు..అన్న కవిత రాసి, ఆంద్ర జ్యోతి కి పంపినాను. అచ్చయింది. అద్బుతమైన పేరు వచ్చింది. నారాయణ రెడ్డి గారు ఒక ఏడాది పాటు ఆ కవిత గురించి, ప్రతి సభ లో చెప్పేవారు. అప్పటి నుండి ఆరాటం మొదలయింది. అమ్మ పైన రాసిన ఒక కవిత ఆంధ్ర జ్యోతి లో అచ్చయింది. కొన్ని వేల మంది అమ్మలు ఆంధ్ర జ్యోతి కి ఉత్తరాలు రాసారు. దేవిప్రియ గారు నన్ను ఆంధ్ర జ్యోతి ఆఫీస్ కి పిలిచి, ఉత్తరాలు చూపించారు. మరుసటి రోజు నా ఫోటో వేసి, అమ్మ కు ఆదరణ అనే ఒక కాలం రాసారు. పొంగిపోయాను. సురేషూ , నేను ఎప్పుడూ కవిత్వం లో నీరస పడలేదు. నాకు ఒక ఇమేజ్ ఇచ్చింది. ఒక పేరు ఇచ్చింది. ఒక స్థాయి ఇచ్చింది. ఒక అద్బుత మైన కీర్తి ఇచ్చింది. నా జీవితం లో కవిత్వం నా సర్వస్వం . నేను లేని సభల్లో సైతం నా గురించి పొగుడుతుంటే, ఒక అవ్యక్తానుభూతి పొందాను. ఫ్రీవెర్స్ ఫ్రంట్ అవార్డు , సినారే సాహిత్య పురస్కారం, తెలుగు యూనివర్సిటీ వారు ఇచ్చే సాహితీ పురస్కారం వచ్చాయి. ప్రతి పోయెమ్ నాకు ఒక త్రిల్.
...
ఆధునిక కవులు.. కవిసంగమం గురించి....!
ఒకటి చెప్పనా సురేషూ.....అసలు ఇలా నేనెందుకు రాయలేక పోయా ... అని అనుకొనేలా రాస్తున్నారు. కవిసంగమం వారం వారం శీర్షిక లలలో అద్బుతంగా విశ్లేషిస్తున్నారు. కవిత్వం ఒక యజ్ఞం లాగా చేపట్టారు. అన్ని పోయెమ్స్ బాగా లేక పోవచ్చు. సురేశూ.. ఎక్కువ రాయాలన్న ప్రయత్నం లో కవిత్వం పలచ బడుతుంది. ఒకటి చెప్పనా సురేశూ....ఒక్క "షేర్ " అంటే నాలుగు లైన్స్ ఉర్దూ లో రాసేందుకు ఒక్కో కవికి కొన్ని నెలలు పట్టేదట. “నదులన్నీ సముద్రం లో మునుగుతాయి... సముద్రం కన్నీటి బిందువులో మునిగి పోతాది..” ఈ నలుగు వాఖ్యాలు రాయడానికి కొన్ని నెలలు పట్టిందంటే నమ్ముతావా?
.ఇంకోటి చెప్పాలి సురేష్....పెద్దవాళ్ళ గురించి, సాటి కవుల గురించి విమర్శించడం , కామెంట్ చేయడం మానుకోవాలి. ఎదుటివారికి గౌరవాన్ని ఇచ్చినప్పుడే కవిత్వం రాయగలవు. ఏదో ఒక అకారణ అసూయ నో, ద్వేషమో అభివృద్ధి చెందకూడదు. కవివంగమం అద్బుతం. పరేష్ దోషి కి నాకు అద్బుతమైన సాహిత్య౦, సంగీతం లో పోలిక ఉన్నాయి.
సాహిర్ లుదియాని నా అభిమాన కవి. పరేష్ దోషి ఒక అద్బుత కవి. ఆయనకు కూడా సాహిర్ లుదియాని అంటే అభిమానం.
సురేషూ ... ఆధునిక కవులకు ఏమైనా చెప్పే౦త స్థాయి లేదు కానీ, కోత్హగా రాయాలి. మనకంటూ ఒక డిక్షన్ ఏర్పాటు చేసుకోవాలి. ఇంతవరకూ చెప్పగలను.
సురేషూ,.. ఈ రాత్రి నాకు నీతో జరిగిన సంబాషణ జీవితం లో మరిచిపోలేని రాత్రి...అని ఆయన సంతోషంగా చెపుతుంటే, ఆయన ఒక అద్బుత వ్యక్తి గా నాకు ఆవిష్క్రుతమయ్యారు.
-------------
ఆశా రాజు || గుంపు లో కలిసే దాక నడుద్దాం||
ఆంగ్లం లోకి అనుసృజన : సి.వి.సురేష్
|| Let Us Walk Till We Mingle In Shoal ..!|
What else there for me…
To stare?
What else strikes me..
To do?
All that having was….
Totally evanished!
…
Where else I quest…
For love !?
How can I tie up…
The bonding…?!
sloped and searched their own ways
with secede hands …!
..
Who will align…
in this dark murk!?
whoever will identify…
in those masks…!
..
Calling with no reciprocation…
Retorting with no Clatter..
Moving With no destination
No little light around in any turn…!
What’s up here..like strangers…,
May be with an Illation journeys..?!
..
Even the siblings
Or even those symbiosis
May be unknown
* * *


No comments:
Post a Comment