కవిత్వానువాదాలు - మనకవులు
16
పటాన్ మస్తాన్ ఖాన్
పటాన్ మస్తాన్
ఖాన్ గారి కవిత “
గొంతు నులిమిన
శ్వాస”
ను ఈ వారం
కవిత్వానువాదం శీర్షిక కు ఎంపిక చేసుకొన్నాను. మా రాయల సీమ వాసి. మాకు అతి సమీపం
లోనే బాకరాపేట లో టీచర్ గా వృత్తి కొనసాగిస్తూ, సాహితీ ప్రపంచం లో కవిత్వపు సేద్యం
చేస్తున్నారు.
కవి యాకూబ్ గారి
దగ్గర ఫోన్ నెంబర్ సేకరించి,
ఆయన కు ఫోన్
చేశాను. ఉదయం షేక్ మహమూద్ తో కాసేపు కవిత్వ ముచ్చట్లు మాట్లాడు కొన్న సమయం లో
పటాన్ మస్తాన్ ఖాన్ గారి పేరు చాలా సార్లు మా మాటల్లో దొర్లింది. 20 ఏళ్లుగా కవిత్వం రాస్తున్నా సర్..కానీ, కవిసంగమం లో జాయిన్ అవ్వడం తో కవిత్వ జిజ్ఞాస
అధికమైంది. గతం లో హిందీ అనువాదాలు బాగా చేసాను సర్.. అని మాట్లాడుతూ, నిక్కచ్చి తనానికి, సౌమ్యత కు ఈయన ను ప్రతీక గా చెప్పవచ్చు.
కవిత్వం...
కవులపై ఆయన మాటల్లోనే,
హిందీలో “అంధా యుగ్” అనే కవిత, ఒక అస్తిత్వం ఒక సంక్షోభం అనే కవితలతో నా కవిత ప్రయాణం మొదలైంది. సంకలనాలైతే తీసుకు రాలేదు కానీ, పది ..పన్నే౦డేళ్ళ క్రితం హైకూ లు ఆంధ్ర
జ్యోతి లో ప్రచురిత మయ్యాయి. రోహిత్ ఆత్మ హత్య తర్వాత మరిన్ని కవితలు రాయడానికి
మనసు సిద్దమైంది. నా అభిరుచికి ఓ పెద్ద ప్లాట్ ఫార్మ్ అయ్యింద౦డి. గతం లో రాసి
ఉంచినవి కూడా ఇక్కడ నేను పోస్ట్ చేయడం జరుగుతోంది. కవిత్వం లో ఎప్పుడూ నిరాశ
పడలేదు.
కవిత్వాన్ని ఒక
ఆల్టర్ ఈగో లాగ నేను
చూసుకొంటా.
కవిత్వాన్ని ప్రాణం గా చూసుకొంటా. కవిత్వం ఉంటె చాలు అనిపిస్తాది. ఎవరి కవిత
చదివినా,
అందులోకి
ట్రాన్స్ఫార్మ్ కావడం నాకు అలవాటు. ఆ కవిత లోని భావోద్వేగాలు నా పైన పని చేస్థాయి.
జార్జ్ బుష్ పైన ఎవరో చెప్పు విసిరేసినప్పుడు రాసిన కవిత చాల సంతృప్తి నిచ్చింది.
ఇష్టమైన పని చెస్థున్నప్పుడు కలిగే సంతృప్తి , సుఖం నాకు కవిత్వం లో కనిపిస్తాది. నాకు
ప్రతి దాంట్లో కవిత్వం కనిపిస్తాది. అంతే, వాటిపైన కవిత్వం రాయడం, ఆనందం పొందడం. ఒకటి చెప్పనా సర్... మనిషిలోని సూపర్
కాన్షియస్ నుండి కవిత్వం వస్తుంది. అనుభూతిస్తే కానీ కవిత్వం రాయలేము సర్.. నాకంటూ
ఒక గురువు లేరు. నా పైన ఎవరి ముద్ర పడలేదు. నా ప్రతి కవిత నా గుండెల్లో నుండే
వస్తుంది.
కవిలో ఎక్కడో
ఒకచోట రగిలే నిప్పురవ్వే కవిత్వం. కవిత్వం సమాజాన్ని ప్రతిబింబించేలా ఉండాలి.
కవిత్వం ఇంకా పరిమిత౦గానే ఉంది. ఇంకా విస్తృతి కావలి. కవిత్వం పాటగా ప్రజల
నోళ్ళల్లో నానే రోజు రావాలి.
కవిత్వం యొక్క
అవసరం ఎక్కడ ఉందో.. అక్కడ ఖచ్చితంగా కవిత్వం నిలబడుతుంది. కవి ఏ ఉద్దేశ్యం తో
రాస్తారో,
ఆ ఉద్దేశ్యం
దగ్గరికి కవిత చేరాలి. అంతే కానే, అది ఆకవిత్వమా,
వచనమా అనే మీటర్
లు ఉండాలని నేను భావించాను.
కవిసంగమం ప్రతి
రోజు వచ్చే శీర్షిక లు అన్ని రకాల కవులకు, యువతరానికి అద్బుత చుక్కాని లాగ ఉన్నాయి.
అయితే కొందరు రాసే వ్యాసాల్లో పదాలు అసలు అర్థం అయ్యేట్టు ఉండాలని నా అభిప్రాయం.
నేటి తరం కవులకు
ఏవైనా సూచనలు ఇస్తార?
అన్న ప్రశ్న కు
జవాబు ఆయన బాష లోనే...
నేను సూచనలు , సలహాలు ఇవ్వను సర్. కవులు వాళ్ళే స్వతహాగా
తెలుసుకోవాలి. సమాజం లోకి కవులు రావాలి. ప్రపంచాన్ని చూడాలి. నిష్పాక్షికంగా ఉండాలి. basic human క్వాలిటీస్ పెంచుకోవాలి.
కవిసంగమ లో
కవితల పై మాట్లాడుతూ..కవితలపై ఎప్పుడూ మెచ్చుకోలుగా కామెంట్ ల లాగా కాకుండా, ఒక క్రిటిక్, ఓ విశ్లేషణ అవసరమని నా అభిప్రాయం. ఎక్కడ
మార్చుకోవాలో చెప్పే దిశగా సున్నితంగా ఆ విశ్లేషణ ఉంటె బాగుంటు౦ది. కానీ, ఒక అద్బుత మైన వేదిక కవి సంగమ౦....
మాట్లాడుతున్నంత
సేపు,
ఆయన లో తోణికిసలాడిన
ఒకటే అంశం. కవిత్వం పట్ల ఆయన కున్న జిజ్ఞాస. ఆసక్తి. ఆరాటం.!
ఈ కవిత
విషయానికొస్తే,
తనకు తాను
తెలుసుకొనే సందర్భం లో ఒక నిజమైన సంగర్షణ . అందులోని బాధలు ఏంటో చెప్తాయి. ఈ కవిత
పైన నారాయణ శర్మ గారు రివ్యూ రాసారు. చాల కష్ట పడ్డాను. అనుసృజన కు ఒదగని పదాలు, తెలుగు ఇడియమాటిక్ పదాలు చాల ఉన్నాయి. పూర్తి
స్వేఛ్చ ను తీసుకొన్నాను.
పటాన్ మస్తాన్
ఖాన్ ||
గొంతు నులిమిన
శ్వాస..||
ఆంగ్లం లోకి
అనుసృజన :
సి.వి.సురేష్ || THE BREATH THAT
THROTTLED ||
------------------------------
.
1)
Yes,
There
is an obit
And
there is a natal…
Yes…
both
are right
Nd’
there is a life in between those!
.
2)
Llife
has its own dreams…
Dreams
sprouted iron wings!
unable
to pounce…
all
of a sudden…I rise
from
the dream to life….!
.
3)
Truth
lost its essence
When
the life and death confluence…
some
thing in a blurred glance
disappears
in a trice….!
unable
to identify those…!!
.
4)
it
will be like….
Wishing
subtly alike….
With
a coloured mask..!
It
will be like…
Rooting
out with its sharp nails alike..!
When
I flux
On
becoming wound like…
I
drop myself in a silent valley!!!
.
5)
there
in finally….
After
a prolonged struggle
In
the distant outer universe…
Listening
to a faded song of agony…
In
a silent shadows
Possessed
like death
‘Nd
when I transformed into a flame….
The
silence showered laugh..
The
reflection perceptible..
It
will give life to the flowers…
By
spreading the fragrances…
.
6)
Again
the dream..
Into
sprouted iron wings…!
ఒరిజినల్ పోయెమ్
:
పటాన్ మస్తాన్
ఖాన్ ||
గొంతు నులిమిన
శ్వాస ||
1.
అవును
చావు వుంది
పుట్టుక వుంది.
అవును
రెండూ నిజమే
యీ రెండింటి
నడుమ
బతుకూ వుంది
2.
బతుకులో
స్వప్నాలుంటాయి
స్వప్నాలకు
యినుపరెక్కలొస్తాయి
యెగరలేక
పోతుంటాను
అర్థ్రాంతరంగా...
మేల్కొంటాను
స్వప్నంలో నుంచి
జీవితంలోకి....
3.
సత్యం
అర్ధాన్ని
కోల్పోతుంది
చావు పుట్టుకలు
సంగమించినపుడు
కన్పించినట్టే
కన్పించి
మాయమౌతుంటుంది
గుర్తుపట్టలేక
పోతుంటాను.
4.
మనస్సును
రంగుల మాస్క్ తో
మార్మికంగా
పలకరించినట్టు
వుంటుంది
తన పదునైన
గోర్లతో
పెకలిస్తున్నట్టు..
నేను
గాయమై
స్రవిస్తున్నప్పుడు
నన్ను నేను
నిశబ్దపు
లోయల్లోకి
జారవిడుచుకుంటూ....
5.
అక్కడ..
పోరాడి - పోరాడి
చివరకి
మృత్యువులా
ఆవహించిన
నిశబ్దపు నీడల
దూరదిగంతాలలో వో
అస్పష్ట
స్వరదుఖాలాపన వింటూ
జ్వాలగా
మారుతున్నప్పుడు
నవ్వును రాల్చిన
మౌనం
ప్రతిబింబంగా
ప్రత్యక్షమై
నాలో
సుగంధాలను
విరజిమ్మి
పూలకు ప్రాణం
పోస్తుంది...
6.
మళ్ళీ
స్వప్నం
యినుప
రెక్కల్లేకి...
* * *


No comments:
Post a Comment