Friday, July 27, 2018







టిబెట్ కవి tensing tsude రాసిన “ a proposal” కవిత కు తెలుగు లో స్వేచ్చానువాదం!! by Cv Suresh సి.వి. సురేష్
Tensing tsude || AProposal||
అనుసృజన : సి.వి.సురేష్
|| ఒక ప్రతిపాదన || Tenzing Tsude ||
..
నీ గది పై కప్పు లోపలి బాగాన్ని సగం దాక లాగెయ్
అక్కడ నాకో మధ్య అంతస్తు ను సృష్టించగలవు
..
నీ గది గోడలు అలమార ల లాగా తెరుచుకొన్నాయి కదా
నాకోసం ఎక్కడైనా ఒక ఖాళి అర ఉందా!
..
నీ తోట లోని రోజా పూలవలె ..
చురుకైన బేరి పళ్ళ వల్లే నన్ను పెరగనీ
..
నేను నీ పాన్పు కింద నిద్ర పోతాను
అంతే కాదు, అక్కడ వ్రేలాడే అద్దం లోనుండి టి.వి.చూస్తాను
..
నీ వసారా లో ఏమైనా చెవులు ఉన్నాయా?
నెను నీ కిటికీ ద్వారా పాడు తున్నాను.
..
నీ గది తలుపు తెరువు...
నన్ను లోపలకు రానీవ్వు.
..
నీ గడప దగ్గరే విశ్రమించి ఉన్నా
మెలుకువ రాగానే నన్ను పిలు...!!!
...........................-------...................................------......................
original poem
Tening tsude
||A PROPOSAL ||.
pull your ceiling half-way down
and you can create a mezzanine for me..
your walls open into cupboards..!
is there an empty shelf for me
let me grow in your garden....
with your roses and prickly pears
i'll sleep under your bed..............
and watch TV in the mirror.
do you have an ear on your balcony.....
i am singing from your window...
open your door ...
let me in
..
i am resting at your doorstep
call me when you are awake 




                                                                   ఎమిలీ డికెన్సన్

ఎమిలీ డికెన్సన్...తన జీవితకాలం లో చాల తక్కువ కవితలు రాసారు.ఆమె మరణానంతరమే ఆమె కవితలు వెలుగులోకి వచ్చాయి. ఈ వారం శీర్షిక కు సుప్రసిద్ధ ఆంగ్ల కవియత్రి ఎమిలీ డికేన్సన్ రాసిన ఈ చిన్ని కవిత ను ఎంపిక చేసుకొన్నాను .
మరణిస్తున్న వ్యక్తి కి తన మరణానికి ముందు ఒక దివ్యలోక స్మృతి లేదా అపశకునాలేవో కనిపించినట్లు గుర్తించి రాయడం ఈ కవిత మూలం. అదే క్రమంలో మరణానికి ముందు మనిషి ఎలా స్వార్థపూరితంగా వ్యవహరిస్తాడో,...కూడా ఈ కవిత లో చెప్తారు. 
కవితలో ......ఒక చోట. మరణానికి ముందు 
తనకు సంబంది౦చినవన్నీ అందులోనూ తన భాగానికి వచ్చేవన్నీ, వీలునామాల్లో భద్రపరచినట్లు చెప్తుంది. 
మరణాన్ని, ఒక ఈగ లాగా పోలుస్తూ, ఆ మరణం చేసే దాడి ని రాజు చేసే చివరి దాడి గా అభివర్ణిస్తూ, ఆమె చెప్పుకు రావడం. ఈ కవిత లో విశేషము.
మొదటి stanza లోనే పద ప్రయోగం లో ఒక ప్రత్యేకత ను గమనించవచ్చు. The stillness in the room…was like a stillness in the air… ఇలా ఒకే స్టా౦జాలో abstract noun’ రిపీట్ అవ్వడం...
చివరి స్టా౦జాలో కూడా .... and then…. And then అనే పదాల ప్రయోగాన్ని రెండు సార్లు ఒకే లైన్ లో వాడటం విశేషం.
అలాగే చిట్ట చివరగా.. I could not see to see ….అని కవిత ను ముగిస్తారు.. కవిత లో రిధం మరియు శబ్దం కలిసి చేసే శబ్ద సౌందర్యం కనిపిస్తుంది.
...
తుఫాను తీవ్రత ను తెలిపే క్రమం లో heaves of storm రెండు దాదాపు ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలను అక్కడే ప్రయోగించడం ఆమె కవిత్వం లోని విశేషం.
రెండవ స్టా౦జా లో ఆ గదిలో, ఆ మరణపు అంచుకు చేరుకొన్న వ్యక్తి యొక్క cynical దృశ్యాలు...మూడవ స్టా౦జాలో వ్యంగ్య పూరితమైన స్వార్థాన్ని, నాలుగో స్టా౦జా లో ఆ చివరి మరణ దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది. మోదటి స్టా౦జా...చివరి స్టా౦జాలలో మాత్రమే మరణానికి ప్రతీక గా ఈగ ను ప్రస్తావిస్తారు
..
superstitious గా, అంటే మూడ నమ్మకాలను నమ్మే వ్యక్తి రాసుకొనే కవిత అనిపిస్తుంది. అయితే, ఈ కవిత ను ప్రపంచ సాహితీ విశ్లేషకులు ఎందరో అద్బుతంగా విశ్లేషించారు. వేల కొద్ది రివ్యూ లు రాసారు. ఆ మరణపు పెను బాధ ను , ఆ మరణానికి ముందు ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో చాల ఆర్ద్రత గా చెప్పినా.... ఇదో లిరికల్ పోయెట్రీ. rythem and sound ను ఏక కాలం లో పాటకుడి లోకి ప్రవేశ పెట్టె ఆలోచన రచయత్రి ది.
..
ఆమె మరణించిన నాలుగు సంవత్సరాల తర్వాత ఆమె మొదటి కవిత సంకలనం వచ్చింది. పబ్లిష్ అయిన రెండు సంవత్సరాల లోనే 11 ఎడిషన్ లు ముద్రించాబడ్డాయి. ఈ కవితలన్నీ తన స్నేహితురాలు సేకరించి పబ్లిష్ చేసారు. అది 1890 లో. అప్పటివరకు సాంప్రదాయంగా వస్తున్న కవిత్వపు పోకడలను ఆమె చేదించి , కవిత్వం లో కొత్త ఒరవడి ని తీసుకు వచ్చిన రచయత్రి. తండ్రి లాయర్. ఆమె కూడా తన తండ్రి ప్రాక్టిస్ లో కలిసి లా ప్రాక్టిస్ చేసారు. 
అద్బుతమైన ఈ కవిత ను అనుసృజన లోకి తీసుకురావడానికి పూర్తి స్వేఛ్చ ను తీసుకొన్నాను. ఈ కవిత ఎంపిక చేసుకొన్న తర్వాత ఈ కవిత పైన ఉన్న విశ్లేషణలు, ఈమె పోయెమ్స్ ఒక రెండు మూడు చదివాను. ఆమె ఓ అద్భుత రచయత్రి.

I heard a Fly buzz - when I died - (591)
BY EMILY DICKINSON
తెలుగు లోకి అనుసృజన : ||నా మరణ క్షణం – నే విన్న ఆ ఈగ రొద||
..
నే మరణిస్తున్న ఆ క్షణాన...
అక్కడో...ఈగ రొద వినిపించింది
ఆ గది అంతా నిండిన అచేతనంగా....
విసిరేసే తుఫాన్ భీభాత్శాల మధ్య-
స్తంబించిన గాలి లాగ ఉండిపోయింది!
..
నా కండ్ల సమీపం లో..
తడిలేని తనంతో అవి ఎండిపోయాయి.
నా శ్వాసలు ఒక్కొక్కటే గట్టి పడుతున్నాయి..
ఆ మృత్యువు చేసే చివరి దాడి
ఆ గదిలో సాక్ష్యంగా నిలుచుంది....
..
నా సంబందితాలన్నీ..
అందులో నా భాగానికి వచ్చేదంతా...
రాతపూర్వకమైన వీలునామాలలో ఉంచాను.
సరిగ్గా అప్పుడు, అక్కడే ఆ ఈగ ప్రత్యక్షమైంది
..
నాకు ఆ కాంతి వలయానికి మధ్య
అది నీలి రంగు లో...
అనిశ్చితంగా, తడబడుతూ ఆ ఈగ చేసే ఝుమ్మన్న రొద...
అప్పుడే ఆ కిటికీలు విఫలమవ్వడం ....
ఆ తర్వాత అవేవీ నా చూపుకు అందకుండా పోయాయి...
ఒరిజినల్ పోయెమ్
ఎమిలీ డికెన్సన్ || I heard a fly buzz- when I died ….(591)
..
I heard a Fly buzz - when I died -
The Stillness in the Room
Was like the Stillness in the Air -
Between the Heaves of Storm -
..
The Eyes around - had wrung them dry -
And Breaths were gathering firm
For that last Onset - when the King
Be witnessed - in the Room -
..
I willed my Keepsakes - Signed away
What portion of me be
Assignable - and then it was
There interposed a Fly -
..
With Blue - uncertain - stumbling Buzz -
Between the light - and me -
And then the Windows failed - and then
I could not see to see –




                                                                   కొండేపూడి నిర్మల

కవిత్వం ఎమోషనల్ కి దగ్గర రూపం . ఇది నా స్వభావానికి దగ్గరగా వుంటుంది. మన అభివ్యక్తిని సూటిగాను తీవ్రంగాను చెప్పడానికి వీలు కలిగి వుండే ప్రక్రియ. నాకు తెలిసి ఉద్యమాలన్నీ కవితా రూపంలోనే నడిచాయి. ..
నాకవిత్వం గురించి 1990 లో ప్రత్యేకంగా ఎడిటోరియల్ వచ్చింది. “నీలాటి రేవు నిర్మల” అనే పేరుతో ఎబికె గారు ఎడిటోరియల్ రాశారు. అది కాస్త ప్రత్యేకంగా అనిపించింది.
..
నేను రాసిన ఒక కవిత వల్ల ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది . అది చాలా తమాషాగా జరిగింది. Open defecation స్త్రీలకు ఎంత సమస్యో దాన్ని గురించి వలసల రాజ్యం కవిత రాశాను. ఛీ చి అదే వస్తువు అన్నారు కొందరు . కానీ అందులోని సాంస్కృతిక సామాజిక కోణాల్ని గురించి పదే పదే ప్రస్తావిస్తూ వుండేదాన్ని సభల్లో. అది తెలిసిన ఒక ప్రభుత్వాఫీసు తమ water అండ్ sanitation స౦స్థలో consultant జాబ్ ఆఫర్ చేశారు. దానివల్ల ఆ సమస్యని గురించి ఇంకా లోతుగా తెలుసుకునే అవకాశం దొరికింది. ఇది 2000 లో జరిగింది .
..
ఇలా నేనడిగిన ప్రశ్నలకు తాను, రాత పూర్వకంగా వివరాలు ఇస్తూ, సురేష్ గారు మీరడిగిన ప్రశ్నలకన్నీ సమాధానం ఇచ్చేశాను. అని నవ్వుతూ, ఎలాంటి విసుగు లేకుండా సమాదానం ఇచ్చారు.
ఈ వారం కవిత్వానువాదం శీర్షిక కోసం ప్రముఖ రచయత్రి కొండేపూడి నిర్మల గారిని అతిధి గా ఎంపిక చేసుకొని, ఆమె కు ఫోన్ చేసాను. చాల హుందాగా, నిర్మొహమాటంగా మాట్లాడిన ఆమె గురించి, ఆమె సాహితీ ప్రయాణం గురించి ఆమె మాటల్లోనే విందాం....
..
పుట్టుక బాల్యం –వివరాలు :
మా అమ్మ లక్ష్మి నరసమ్మ , నాన్న వెంకట్రావు గోదావరి జిల్లా వాళ్లే. తాతగారి ఉద్యోగ రీత్యా అమ్మ పుట్టిల్లు హైదరాబాదు లో నల్లకుంటలో పెరిగింది. హిందీ బాగా వచ్చు. అమ్మ పుట్టిల్లు హైదరాబాదు కాబట్టి నేను ఇక్కడే నీలోఫర్ హాస్పిటల్ లో పుట్టాను. కానీ నాబాల్యం , చదువు, ఉద్యోగం అన్నీ విజయవాడలో గడిచాయి.. నాన్న అక్కడ స్టేట్ బ్యా౦కు లో పనిచేసేవారు.
..
సాహితీ ప్రయాణం
సాహిత్య వాతావరణం ఏమీ లేని ఉమ్మడి కుటుంబం మాది. ఎలా వచ్చిందో తెలీదు కానీ చిన్నప్పటీ నుంచి కధలంటే ఇష్టం . చందమామలు పక్కింటి నుంచి తెచ్చుకుని చదివేదాన్ని. అందులో కధల్ని స్నేహితులకి ఉత్తరాలుగా రాసేదాన్ని.. ఆ మిత్రులు దూరంగా ఎక్కడో వున్నవాళ్లు కాదు. నాతో బాటు రోజూ బడికి వచ్చేవాళ్ళే. బహుశ అది నా అభివ్యక్తికి తొలిరూపం కావచ్చు. చదువులో ముఖ్యంగా లాంగ్వేజెస్ లో బాగా మార్కులు వచ్చేవి. టెన్త్ నాటికి వ్యాసరచనల్లో స్కూలుకి ప్రతినిధిగా వేరే జిల్లాలకు వెళ్ళి బహుమతులు కొట్టుకు వచ్చేదాన్ని. ఇంటర్ లో వుండగా అలాంటి పోటీలోనే శ్రీ శ్రీ పుస్తకాలు నాచేతికి వచ్చాయి. తిలక్ ను చదివింది అప్పుడే . లైబ్రరీ లో అలాంటి గొప్ప వాక్యాలున్న పుస్తకాలకోసం వెతకడము , వాటినే తల్చుకుంటూ కలవరించి పిచ్చెక్కిపోవడము అదంతా ఆ అడోలసె౦ట్ ఏజ్ లోనే జరిగింది. డిగ్రీ మొదటి సంవత్సరంలో రేడియో వాళ్ళు పెట్టిన ఒక కవితల పోటీలో నా కవిత సెలక్టయింది. ప్రతిరోజూ సాయంత్రం విజేతల వివరాలు చెప్పేవారు . అది వినడం గొప్ప సంబరంగా వుండేది. ఆ రికార్డింగుకి వెళ్లినప్పుడు నా వాయిస్ బావుందని పొగిడారు. తర్వాత ఆడిషన్ కి సెలక్ట్ ఆయాను. యువవాణి లో కవిత్వం ప్రోగ్రామ్ కి యాంకరింగ్ చేసే క్రమలో కవిత్వం రాయడం పట్టుబడింది.
నా మొదటి రచన కధ కాదు కవిత. “మువ్వ మూగబోయింది” అది రేడియోలో ప్రసారమై ‘వాణి’ పత్రికలో అచ్చయింది. మొదటి కవిత ‘దుర్లోచన’ . సులోచనాలు ఆ౦టే కళ్ళజోడు కదా దానికి సెటైర్ గా రాసిన కవిత. సినారె సమక్షంలో కవిసమ్మేళనం లో పాల్గొనడం ఆయన అభినందనఅందుకోవడం ఒక ప్రోత్సాహం ఇప్పటికి 6 కవితా స౦కలనాలు , రెండు కధా సంకలనాలు , ఒక కాలమ్స్ బుక్ తెచ్చాను. ఆరు కవితా సంపుటుల్లోనూ వస్తు పర౦గా, ఎత్తుగడలోను వైవిధ్యం వుంది. మొదటి కవితాసంపుటి “సందిగ్ధ సంధ్య” 1988,ఏది తోస్తే అది రాశాను. అప్పటికి ప్రాపంచిక దృక్పధ౦ అంటూ ఏమీలేదు. రెండోది “నడిచేగాయాలు-“1990. అప్పటికి అస్తిత్వవాదంగా స్త్రీవాదంలో చిక్కటి కవిత్వం వచ్చిన దశ. ఇందులో నా కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువే వుంది. స్త్రీ పుట్టినదగ్గర్నిచి వృద్దాప్య దశవరకు ఎదుర్కొన్న వివక్షలన్నీ ఒక క్రమ0లో రాశాను. అంటే యుద్ద శిశువు దగ్గర్నిచి , మదర్ సీరియస్ దాకా అన్నీ దశలు అన్నమాట. అలాగే అణచివేతకు గురి అయిన అనేక స్త్రీలమీద రాశాను. వస్తు వైవిధ్యమే నా టార్గెట్. కొత్త వస్తువు కొత్తగా చెప్పడానికి వేర్వేరు ఎత్తుగడలు ఆధారంగా చేసుకున్నాను. . స్త్రీవాదం మీద డైరక్ట్ ఎటాక్ చేసినవారికి చెప్పిన జవాబులు కూడా వున్నాయి. నాకొచ్చిన గుర్తింపుల్లో ఎక్కువభాగ౦ ఆ పుస్తకమే దక్కించుకుంది . మూడు “బాధా శప్తనది” మతం కులం రాజ్యంగా వ్యవహరి౦చడం గురించి రాసినవి కనిపిస్తాయి. నాలుగు “మల్టీ నేషనల్ ముద్దు”- 2001 లో వేశాను. ఇందులో ప్రపంచీకరణ నేపధ్యంలో సమాజంలో వ్యవసాయంలో, చదువుల్లో , వలసల్లో మానవ విలువల్లో వచ్చిన మార్పుల్ని ఫోకస్ చేశాను. గ్లోబలియజేషన్ మిడ్ వచ్చియన్ మొదటి రెండుమూడు పుస్తకాల్లో ఇది ఒకటి.
..
కవిత్వం రాస్తున్న క్రమ0లో నిరాశకు గురయిన సందర్భం ;
“లేబర్ రూమ్” రాసినప్పుడు దాన్ని ఎందరు మెచ్చుకున్నారో అందరు విమర్శించారు. అది మాతృత్వానికి దెబ్బలాంటి పోయేమ్ అన్నారు. కొన్ని వాక్యాలు మార్చితే వేస్తాం అన్నారు . మార్చను. అసలు మీ పత్రికలో వెయ్యక్కర్లేదు అని చెప్పాను. అచ్చువేయ్యకుండా విచారణలో ఒక ఏడాది కాలం ఫైల్లో నే వుంచేశారు. ఈలోపుగా అది కొన్ని కవిత్వ సభల్లో చదవడం వల్ల పాపులర్ అయింది. అచ్చయిందా అని అడిగినప్పుడు “లేదండి , ఆంధ్రజ్యోతిలో పెండిగ్ లో వుంది” అని చెప్పేదాన్ని. నామీద అభిమానంతో కవి స్మైల్ లాంటి వాళ్ళు ఎడిటర్ కి ఫోన్ చేసి అడిగేవారు . నేనే ఇలా చేయిస్తున్నానని వాళ్ళు అనుకునేవారు. వాళ్ళకి నామీద కోపం యింకా పెరిగిపోయేది. ఇదంతా నాకు చాలా ఎంబరాసింగ్ గా వుండేది. ఇది నన్ను రాయకుండా ఆపలేదు కానీ విసుగు కలిగించింది.
..
నేను రెండు కధల పుస్తకాలు వేశాను. కవిత్వం తర్వాత సెటైర్ నాకిష్టమైన రూపం . అది నా కాలమ్స్ లో పలికి౦చడానికి ప్రయత్నిస్తాను.
జర్నలిస్టుగా నా వృత్తి కవిత్వాభిరుచికి ఆటంకం అనిపించలేదా అని ఆడిగేవారు. లేదు...దాని కొనసాగింపుగా అనిపించింది. జర్నలిస్టుగా డెడ్ లైన్స్ మీద పనిచేసిన నాకు కవిత్వం రాయడానికి అనేక వస్తువులు దొరికినట్టనిపించింది తప్ప ఆటంకం అనిపించలేదు. ప్రభుత్వ ప్రభుత్వేతర శాఖల్లోనూ అంతే.
..
అందుకున్న అరుదైన గౌరవాలు ;
ఇప్పటివరకు తాపీ ధర్మారావు , ఫ్రీవర్స్, నూతలపాటి గంగాధరం అవార్డు, దేవులపల్లి కృ ష్ణ శాస్త్రి అవార్డు , బి,ఎన్ రెడ్డి సాహితి అవార్డు, పొట్టి శ్రీరాములు లాంటివి వున్నాయి. అయితే అన్నిటికంటే నేనుఅ౦దుకున్న అనేక అవార్డుల్లో “కుమారన్ ఆశాన్ నేషనల్ అవార్డు” విశిష్టమైనది. కేరళ ప్రభుత్వ అతిధిగా 1990 సంవత్సరపు ఉత్తమ యువ కవయిత్రి గా ఎంపికయ్యాను.. ఇంతకు ముందు తెలుగునుంచి సినారే , గద్దర్ లకు మాత్రమే ఈ అవార్డు లభించింది. కవయిత్రుల్లో కమలాదాస్ తర్వాత నేనే అవడం కాస్త గొప్పగా అనిపిస్తుంది.
హ్యూమనిజం లిటరేచర్ అంశం కింద టోరి అంతర్జాతీయ రేడియోవారు 22. ఏప్రెల్ .2018 లో ఇంటర్వ్యూ చేశారు
..
కవిత్వం కాకుండా ఇతర అభిరుచులు
నాకు పెయింటింగ్స్ ఇష్టం . చిన్నప్పుడు వేసేదాన్ని. ఇప్పుడు ఫోటోషాప్ తో గ్రాఫిక్స్ తో సర్రియల్ ఇమేజెస్ చేసి సరదాగా ఫ్రెండ్స్ కి పంపుతుంటాను. అలాగే ట్రైనింగ్ టెక్నిక్స్ తెలుసుకోవడం ఆసక్తి. దానికోసం మాడ్యూల్స్ బాగా చదువుతాను. క్లాస్ రూమ్ ప్లానర్స్, మెటీరీయల్ స్వయంగా పిక్టోరియల్ గా తయారు చేస్తాను. కొన్ని సంస్థలకు స్పాన్సర్ చేశాను కూడా.
..
ఇప్పటి కవిత్వం గురించి ?
కొన్ని చాలా బావుంటున్నాయి. కొన్ని అసలు బావుండటంలేదు. తక్షణ స్పందనకె సంబరపడిపోవడం జరుగుతోంది. ఎడిట్ లేదు, రివ్యూ లేదు . నిజానికి కవిత్వం రాయడంలోనే ఎక్కువ అనుభూతి వుంది. దానికంటే పేరు ప్రఖ్యాతులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనిపిస్తోంది.
..
ఇప్పుడేం చేస్తున్నారు. ?
ప్రస్తుతం జండర్ , కమ్యూనికేషన్స్ స్కిల్స్, చైల్డ్ రైట్స్ లాంటి వాటిమీద గవర్నమెంట్ , నాన్ గవర్నమెట్ సిబ్బందికి టైనింగ్స్ ఇస్తుంటాను. . అనువాదాలు చేస్తాను. ట్రైనింగ్ మెటీరీయల్ , మాడ్యూల్స్ రాస్తాను. ఇవి కాక నా సాహిత్య కార్యక్రమాలు ఎలాగూ వుంటాయి.
ఇలా నేను వేసిన ప్రశ్నలన్నిటికీ చాల తీరిగ్గా, అతి తక్కువ సమయం లోనే, ఆమె నాకు పంపినారు. ప్రస్తుత కవిత విషయం గురించి ప్రస్తవిస్తూ, కవిత్వం ను ultimate వెలుగని. కవిత్వం ఉండగా, ఇంకో వెలుగు అవసరం లేదని అందుకే ఈ కవిత ను రాసానని చెప్పారు.
ఈ కవిత లో చాల idiomatic వర్డ్స్. వాక్యాలు, వాడుక బాష ఉండటం వల్ల, అనుసృజన చేసేందుకు పూర్తి స్వేఛ్చ తీసుకున్నాను. 
..
కవిత్వం వెలిగితే దీపం ఎందుకు ? kondepudi nirmala.!
అనుసృజన : సి.వి. సురేష్
..
Candle doused due to draught
Imaginaries before the eyes
Falling off assuden
The shadow of mine on the wall
Cracked down at a stretch
Chosen death while writing turned….
The unfinished poem
Fled away like a dragonfly..
To the back page..!
..
The environs became unfamiliar abruptly
Now I am unable to find….
Whether to search for light or poetry
Or to search inside of mine…!
I could catch the matchbox
By spreading the hands in the dark
Finding the fire is not a simple phenomenon
It Is a journey
between the ages of dark and supersonic..!.
..
Comforting myself in the light of tubes
In the dark thatched hut which is untamed to the souls
Being not known how to hold the fires
Roaming round around the turns
Across the Rooms…!
..
it is not the old darkness
of age old traditions n’ landmarks..
it is the new darkness
spilled on the unfamiliar milieu
Transforming my fire into two torches
Adjusting my walks in the eyes…
Understanding the Pain is also a light…
..
To invent the fire, primitives
Ignite the stone in the caves…
Myself, with the arranged comforts
Searching the roots of histories…!!
..
on continuing searches…
found a matchbox in the unexpected places
in such a small thing…
full pledged army hit my hand …!
aLike an adage…
‘Seeing the herb half cured disease’
A new drab is experienced to eyes
I tried to lit the fire…
Taking a match stick one by one…
Doubled the perseverance…!
May be the beacon emerged
Due to my ignis
Declared war with dark side of the room…
..
Alike ….
My tamed kitten swig the milk by obtrude the vessel
All the books shelf, the almirah n’ the velum
Gulping the luminescence in ecstasy
With the conquest vanity
My shadow strike the wall and intermit…!
Prior to the lamp off
One should write a poem
why the lamp, if
the poem itself incandesce!!
ఒరిజినల్ పోయెమ్
కొండేపూడి నిర్మల || కవిత్వం వెలిగితే దీపం ఎందుకు ?||
..
గాలికి కొవ్వొత్తి ఆరిపోయింది
కళ్ళముందున్న దృశ్యాలు
తటాల్న రాలిపోయాయి
గోడకి అటు తిరిగి రాసుకుంటున్న నా నీడ
విరుచుకు పడి మరణించింది
సగం రాసిన కవిత వెనక పేజీలోకి తూనీగలాఎగిరిపోయింది.
..
హటాత్తుగా పరిసరాలు అపరిచతమైపోయాయి
నేనిప్పుడు దీపం కోసం వెతకాలో
కవిత్వం కోసం వెతకాలో
నా కోసమే వెతకాలో తెలీడంలేదు
చీకటిలో చేతులు చాచి ఈదుకుంటూ
నిప్పుల పెట్టే అందుకోవాలి
నిప్పుని కనిపెట్టడం అంటే మాటలా
చీకటి యుగానికి రాకెట్ యుగానికి
వున్నంత ప్రయాణం వుంది
..
ట్యూబులైట్ల వెలుగులో అరకొరగా సర్దుకుని
మనసుకి౦కా మచ్చిక కాని ఈ కొత్త ఇ౦టి చీకటి కొట్టంలో
నుంచున్న చోటినుంచి ఎన్ని మలుపులు గదులు దాటి
ఆరలు వెతికి నిప్పుని పట్టుకోవాలో తెలీదు
..
అలవాట్లతో ఆనవాళ్లతో ఏళ్లతరబడి నడుచుకుపోయిన
పాత చీకటి కాదిది
పరిచితం కాని పరిసరాల మీద ఛల్లిన కొత్త చీకటి
..
నాలో వున్న నిప్పునంతటినీ రెండు కాగడాలు చేసి
కళ్లలో సర్దుకుని నడుస్తున్నాను
గాయం కూడా ఒక దీపమేనని తెలుసుకుంటున్నాను
నిప్పుని కనిపెట్టడానికి ఆదిమ మానవుడు
గుహ లోపలి రాయిని చెకుముకి చేస్తే
నేను పుట్టుకతో అమరిన సుఖ జీవన లాలసలో౦చి
మానవ నాగరిక చరిత్ర మూలాల్ని తడుతున్నాను
..
వెతగ్గా వెతగ్గా వెతగ్గా
వుంది అనుకున్న చోటు కాక వుండదు అనుకున్న చోట ఒక అగ్గిపెట్టే దొరికింది
అరచేతిలో ఇమిడేంట అంత చిన్న పెట్టెలో
నిండు సైన్య౦ నిబ్బరంగా చేతికి తగిలింది
మూలిక చూడగానే సగం రోగం తగ్గినట్టు
కాళ్ళకి కొత్త చీకటి కళ్ళకి అలవాటవుతోంది
ఒక పుల్ల గీసాను, సగానికి విరిగిపోయింది
ఇంకొక పుల్ల తీశాను ముఖం చిట్లీంచి వూరుకుంది
దమ్ముకున్న పెట్టె మీద పుల్ల మీద పుల్ల గీసి అఖరి బాణం తీసేసరికి
నా పట్టుదల రెట్టింపయింది
బహుశా నాలోపలి నిప్పు గదిలోపలి చీకటితో యుద్ధం మొదలెట్టిందేమో
దీపం వెలిగింది
..
ఆకలికి ఆగలేని మా పెంపుడు పిల్లి ఆత్రంగా పళ్ళాన్ని బోర్లిచుకుని పాలు తాగినట్టు
గది లోపలి పుస్తకాల అరా, బట్టల బీరువా , మ౦చమ్మీద పరచిన గళ్ళ దుప్పటి అన్నీ
తన్మయంగా వెలుతురు తాగుతున్నాయి
ఒక చీకటిని జయించిన గర్వంతో నా నీడ గోడని తన్ని నిలబడింది
దీప౦ ఆరేలోపు కవిత రాయాలి
కవిత్వం వెలిగితే దీపం ఎందుకు ?






ఆఫ్రికన్ అమెరికా రచయత్రి tiffany బి. రాసిన “the distance love” కవిత లో ఎంత స్వల్ప మాటలతో,ఎంత గాడత ను వ్యక్త పరిచారో చదివి ఆశ్చర్య పోయాను. ఈ కవిత ను తెలుగు లోకి అనువదించాల్సిన అవసరం ఉందని భావించాను. ఈ కవిత లో అభివ్యక్తి, ఆ శైలి మనం గమనించాల్సిన అంశం. ఆంగ్లం లోకి అనుసృజన చేయడానికి సిద్దపడి, “సుదూర ప్రేమ” ను కవిత ప్రియులకు అందిస్తున్నాను.
Tiffany.B || the distance love ||
తెలుగు లోకి అనుసృజన : సి.వి.సురేష్ || సుదూర ప్రేమ ||
.
చాల కాలంగా
నా జీవితం శూన్యం గానే ఉంటూ వస్తోంది.
అటు ప్రేమించడానికీ ఎవరూ లేరు...
నాకు నేనుగా కూడా ఆ పిలుపు లేదు.
అయితే,
చాల ఓపిగ్గా నాసమయమూ వస్తుందని వేచిఉన్నాను..
ఆ అపరూపమైన అంశాలన్ని
ఇంకొకరితో పంచుకోవడానికి.
..2
.
అనుకోకుండా,
నీవు ఓ పొగమంచు లో నుండి వచ్చి
నన్ను నన్నులా ఒప్పేసుకొని, కలిపెసుకొన్నావు.
నా లోలోపల నిండుకొన్న ఖాళీతనాన్ని
పూర్తిగా ని౦పేశావు.....
నాలోని ఆ చేదునూ ....
అదే.. ఆహ౦కారాన్నుండి నన్ను విముక్తుణ్ణి చేసావు.
..3
..
కరిగి పోని క్షణాలను ఎన్నో
మనం కలిసే పంచుకొన్నాం...
మన భావనలన్నీ నిజమేనా అనికూడా ప్రశ్నించుకొన్నాం
అనుకొనే లోగానే,
ఎంత త్వరగా కాలం ఎగిరిపోయిందో
సమయం నాలోకి ఒక బాగంగా వచ్చింది.. వెళ్లి పోయింది..
అయితే, “ఇక సెలవ్” అన్న మాటల్ని మాత్రం
నేను అనేందుకు తిరస్కరించాను.
..4
..
నేను ప్రేమించిన వారి నుండి...
నేనిప్పుడు వేల మైళ్ళు దూరం ఉన్నాను..
పరిస్థితులన్నీ ఎన్నో మారాయి, అయితే,
నేను అలోచి౦చినట్లే
నీవు అప్పటిలాగే ఉంటావని నేను ఇప్పటికీ భావిస్తాను..
ఒక రోజు ఒక ఏడాది గా,
ఒక నెల ఇక ఎప్పటికి కొలవలేని సమయంగా అనిపిస్తోంది.
మనం గడిపిన క్షణాల గురించి అలోచిస్తానే,
అదే... ఒక నిధి గా నేను దాచుకొన్నాను.
.
..5
.
నీ సుకుమెత్తటి ఆ గోధుమ రంగు కళ్ళు
నన్ను సిగ్గు నుండి దూరం చేసాయి.
నీ చిలిపి నవ్వు నా రోజును కాంతివంతం చేసేది
నీ సుకుమారపు స్పర్శలు నాలో చలి తెప్పించేవి.
అనూహ్యమైన నీ మెత్హని శరీరం
నన్ను ఉద్వేగానికి గురి చేసేది..
.
..6
.
కానీ,
మనం మళ్ళీ ఒకరి నొకరం స్పర్సించుకొనేందుకు
నేను ఓపిగ్గా వేచి ఉంటాను
అయితే, ఇప్పుడు నీవల్ల నేను
గతం లో కంటే, మరింత సంతృప్తి గా ఉన్నాను..
ఒక మంచి స్నేహితుడికంటే ఎక్కువగా,
మళ్ళీ మనం కలిసి ఉండిన ఆ
మధుర క్షణాలను వెనక్కు తెచ్చుకొంటాను,
ఇదంతా, చివరాఖరకు నీ పెదాలపై చిరునవ్వు కోసమే..!
ఇతరత్రా విషయాలన్నీ, కొద్ది కాలం, యధాతధంగా
ఉంటాయని విశ్వసిస్తాను.
..
..7
..
తెలుసా, ఇప్పుడు నీపై నాకున్న తలపులన్నీ
మునుపటి కంటే ఎక్కువగా ఉన్నాయి.
నీ ప్రేమ,, నేను ఎప్పటికి మరువరానిదై ఉంది.
చూడు,ఇప్పుడు, నీది అనుకొనేది ఏదో నాలో పెరిగి పెద్దదై౦ది
నేనేప్పుడూ, నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను.
అది నాలో అజరామరం.
Distant Love by Tiffany.B
My life has been so empty for so long,
no one to love or call my own.
I patiently waited for that time to come,
To share this special with someone.
..
Until you came from the mist, unexpectedly,
Taking me as I am and accepting me.
You filled the emptiness that laid inside,
releasing me form my bitterness and pride.
..
We shared endless moments together,
questioning if the feelings were true,
Not realizing how fast time had flew.
The time had come for me to part and go away,
The words goodbye I had refused to say.
..
I am now miles away from the one I love,
things are so different, but your still all I think of.
A day seems like year and a month feels like forever,
I think about the times we spent, and THAT
I will always treasure
..
Your soft brown eyes that made me shy away,
your cute little smile that brightened my day.
Your gentle touch that gave me chills,
and your whole body in itself that gave
me thrills.
..
I'll wait patiently until we can touch again,
but i am now more satisfied because you
are more than just my friend.
To bring back those moments, and to
finally see your smile,
And hope that things will remain the same
for a while.
..
My feelings for you are now stronger than before,
and your love is something I will not ignore.
See now, a part of you has grown in me,
I love you always and forever it will be.
Written by Tiffany B.






                                                                   ఫణి మాధవి కన్నోజు.....
..
నిన్నేదైతే గాయపరిచి౦దో దాన్ని గురించి గట్టిగా , చాల స్పష్టంగా రాయమని ఎర్నేస్ట్ హెమ్మింగ్వే చెప్తారు.
Write hard and clear about what hurts - EARNEST HEMINGWAY
.
కవిత్వం ఎలా పుట్టుకొస్తుంది అన్న అంశం పై షరోన్ ఒల్డ్స్ తన “The dead and living” పుస్తకం లో అనేక అంశాలను చెప్పుకొస్తూ.. “Out of memory—a dress I lent my daughter on her way back to college;” అనే ఒక కవిత్వ ప్రేరకాన్ని కూడా ప్రస్తావిస్తాడు.
..
After great pain, a formal feeling comes
The nerves sit ceremonious, like tombs
The stuff heart questions 'was it He, that bore.,'
And 'yesterday , or Centuries before? అని Emily Dickinson తన ఒక కవిత ను ఇలా ప్రారంభిస్తారు..
..
ఎందుకో ఫణి మాధవి కన్నోజు గారి కవిత్వం చదివినప్పుడు, షరాన్ ఒల్డ్స్ , ఎర్నేస్ట్ హెమ్మింగ్వే లు కవిత్వంపై మాట్లాడిన అంశాలు ..Emily Dickinson రాసిన కవిత గుర్తుకొస్థాయి.
.
తన చిన్న తనం నుండి బాష పట్ల,సాహిత్యం పట్ల విపరీతమైన అభిమానాన్ని పెంచుకొన్న ఆమె జీవితం లో ఒక విషాద వీచిక... ఆమె కన్నా కూతురు హాఠాన్మరణం. గుండెలు పగిలే ఆ పెను బాధ నుండే ఆమె కవిత్వం పుట్టుకోచ్చి౦దేమో అన్న నా ఆలోచన, ఆమె తో ఫోన్ లో మాట్లాడినప్పుడు ఖరారైంది.
ఆ పై లోకంలో నా బంగారు తల్లికి ఎవరు జడ వేస్తారో? ఎవరు తనకు తోడుగా పడుకొంటారో? ఎవరు స్నానం చేయిస్తున్నారో? ఎవరు నా చిట్టి తల్లి ఇష్టాలు కనుగొని తినిపిస్తున్నారో? తనకు నా పైన చేయి వేసుకొని పడుకొనే అలవాటు ఉంది...ఇప్పుడెలా చేస్తు౦దో? నేను అక్కడికి వెళితే బావుంటుందేమో అని చాల అమాయకంగా, పెను బాధను తన మాటల్లో హృదయ విదారకంగా ఆమె మాట్లాడుతుంటుంటే, ఆమె తో పాటు నేను కూడా కన్నీళ్ళ పర్యంతం అయ్యాను.
..
ఇలా ఇక్కడ ప్రస్తావించి, ఆమెకు మళ్ళీ బాధను జ్ఞాపకం చేసిన వాడి నవుతానేమోనని కూడా ఆలోచించాను. కానీ, ఆమె లో కవిత్వం ఆ పెను బాధ లో నుండే పుట్టి౦దన్న విషయం ప్రస్తావించేందుకు అది అవసరం అనిపించింది.
..
తన తొలి కవితల్లో ఒక కవిత లో ఇలా..రాసారు..
ఆ విధాత కరుణిస్తే...ఒక్కసారి నిను పంపితే...
నా ఒడిలో నీకు లాలి పాడాలని ఉందమ్మా
వింటూ నువ్వు కురిపించే నవ్వుల వెన్నెలలో తడిసి
ముద్దవాలని ఆశగా ఉందమ్మా... విశాల గగనాన్ని కప్పుకొని విశ్రమించాలని ఉందమ్మ..
..
ఆమె రాసిన ఇంకో కవిత...లో...
చిన్నారి నా తల్లికి కుంకుమేదమ్మ...
విశ్వమంతా వెలుగునిచ్చు సూర్య బి౦బమేనమ్మా
పొన్నారి నా తల్లికి మేనేమి కట్టేను
పచ్చని ప్రకృతి పరికిణి చుట్టెను.
అందాల నా తల్లికెవరమ్మ తోడు
అవనినే పాలించు శ్రీకృష్ణుడే
బంగారు నా తల్లి బొమ్మెక్కడుండు
బొమ్మలతో ఆడుకొను బ్రహ్మా చెంతనే ఉండు...
నా నివాళి. అని ముగించారు. ప్రతి అక్షరం లో ఆ పెను బాధ ఆమెను కవిత్వం వైపు చుట్టేసింది. ప్రతి అక్షరం లో ఆమె ఆ పాప జ్ఞాపకాలను కలిపి కవిత్వాన్ని చేసింది....ఆ పెను బాద నుండే ఆమె కవిత్వం !!
..
తొలి నాటి కవితల్లో ఎంతో ఆర్ద్రత గా విషయాన్నీ చెపుతూ , స్త్రీ వాద కవిత్వపు ధోరణలను తన కవిత్వం లో వినిపిస్తున్న ఖమ్మం కు చెందిన కొత్త కవిత్వ స్వరం ఫణి మాధవి కన్నోజు
..
ఈ వారం కవిత్వానువాదం శీర్షిక కు ఆమె అతిధి. ఆమె కవిత్వం అనువది౦చేందుకు నిశ్చయించి ఆమెకు ఫోన్ చేసాను. ప్రతి మాటలో ఆమె తన పాప మరణపు చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకొంటూనే ఉంటుంది. ఆమె సాహితీ ప్రయాణం ఆమె మాటల్లోనే విందాం...
..
పుట్టింది తల్లాడ గ్రామం, ఖమ్మం జిల్లా, అమ్మమ్మ గారి ఊరు. ఖమ్మం లో పెరిగాను. నాన్న రాఘవాచారి నల్గొండ జిల్లా. NSP కార్యలయం లో సీనియర్ అసిస్టెంట్. నాన్నగారు జాబు చేస్తున్నప్పుడే చనిపోయారు. అప్పుడు నా వయసు ఆరేళ్ళు. మూడవ తరగతి చదువుతు౦డినాను. అప్పుడు తల్లాడ లో మూడో తరగతి సగం నుండి చేర్పించారు. తర్వాత మిర్యాలగూడ లో నారాయణ విద్యాలయం లో చదివాను. ఇంగ్లీష్ పై మమకారం టీచర్ రాజేంద్ర ప్రసాద్ గారు కారణం. అక్కడ ఉదయాన్నే శ్లోకాలు, తెలుగు బాష, సాహితీ సంస్కృతిక అంశాలపై చెప్పడం తో, అక్కడే తెలుగు నేర్చుకోవాలని భీజం పడింది. అప్పల నారాయణ గారు స్ఫూర్తి గా నిలిచారు.
అమ్మ జానకి. సంస్కృత పండితురాలు. తెలుగు పండిట్ కోర్సు కూడా చేసి “వైరా” అనే ప్రాంతం లో టీచర్ గా పని చేసింది. ఇంట్లో ఎప్పుడూ గీత శ్లోకాలు, భారత భాగవతాలు, అమ్మ నోట్లోనే నానేవి. పూజ చేస్తూ, శ్లోకాలు పాడేది. ఇప్పటికీ కూడా పాడుతూనే ఉంటుంది. మా అమ్మ చేతిరాత కూడా అందంగా ఉంటుంది. ఇదే బహుశా నాకు తెలుగు బాష పట్ల ప్రేరణ కలిగించి ఉండొచ్చు. మాక్సిం గోర్కి నవల "అమ్మ" నన్ను అత్యంత ప్రభావితం చేసిన పుస్తకం. అందులోని తల్లి పాత్ర అద్భుతం....దినపత్రికల పట్ల ఎక్కువ మక్కువ ఉండటం, నా బాబు కడుపు లో ఉన్నప్పుడు పూర్తి విశ్రాంతి తేసుకోవాలన్నప్పుడు కంప్లీట్ బెడ్ రెస్ట్ సలహా ఇచ్చారు. ఆ సమయం లో దాదాపు 300 పైగా నవలలు చదివాను. సులోచన రాణి నవలలు ఇష్టం.
.
కవిత్వం లోకి ఎలా వచ్చాను అంటే ఖచ్చితంగా చెప్పలేను కానీ, నా ఆలోచల్ని అనూహ్యమైన మలుపు తిప్పిన అంశం ఒకటుంది. నా పాప స్మృతులే అక్షరాల్లో రాసుకొంటూ , ప్రతి నెలా పాప తిధికి ఒక్కో కవిత పోస్ట్ చేస్తుంటే, సాహితీ అభిమాని, మా శ్రేయోభిలాషి అయిన మా బంధువు ఫోన్ చేసి, చాల ప్రోత్శాహించాడు. నీ దుఖం కోసం కాక, సమాజ దుఖాన్ని స్వంతం చేసుకొని రాయి.. అని అద్బుతమైన ఉత్సాహాన్ని నాలో నింపారు. రచయత ఆకెళ్ళ రాఘవేంద్ర గారి ఉపన్యాసం తో నా దిగులు నుంచి బయటకు వచ్చాను. మనదంటూ ఒక ముద్ర వేసే పోవాలి అనే ఆలోచనలోకి జారుకొన్నాను. శూన్యం పోగొట్టి , నాలో ప్రతికూల శక్తీ నింపుకోవటానికి సంగీతాన్ని, సాహిత్యాన్ని ఆశ్రయించా. మహిళలు, పిల్లల సమస్యలు నన్ను బాగా కదిలించే అంశాలు.
.
ప్రచురణలు...
గత ఏడాది ఇదే రోజుల్లో కుప్పిలి పద్మ గారి సంపాదకత్వం లో “కొత్త కథ -2017” బుక్ రిలీజ్ అయ్యింది. పేస్ బుక్ లో ప్రతి రోజు ఒక్కో కథ ఒక్కో పోస్టర్ రిలీజ్ చేస్తుంటే, ఆ బుక్ పై ఆసక్తి కలిగి ప్రముఖ రచయత కకుమాని srinivas గారు a బుక్ పంపి, కథలపై అభిప్రాయాన్ని చెప్పమన్నారు. మంచి ఆదరణ వచ్చింది. మీ బాష వక్తీకరణ బావుంది. ఏదైనా సాహిత్య ప్రక్రియ ను ఎంచుకొని రాయడం మొదలెట్టండి అని ఆయన ప్రోత్సహ మివ్వడం తో, నేను నా జీవితం లో నేను రాయగలను అన్న ధైర్యం వచ్చింది. నా జీవితం లో కొత్త కథ మొదలైంది. అటు విద్యావంతురాలైన తల్లి, బి.ఏ లిటరేచర్ చేసిన తండ్రి, అత్హగారింట్లో మా మామ గారు, నా భర్త నాకు సాహిత్య పరంగా ఎప్పుడూ సపోర్ట్ గానే ఉంటూ వచ్చారు.
.
ఉపాద్యాయలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే, ఎంపిక విధానాల పట్ల, ప్రభుత్వం స్పష్టత లేని అనేక ప్రకటనలు చేస్తున్న నేపధ్యం లో వారి ఆవేదనను అక్షరీకరించాను. ఆ ఆర్టికల్ నవ తెలంగాణా మెయిన్ ఎడిషన్ లో ప్రచురితమింది. అప్పటి నుండి, మనసు స్పందించే అంశాలను, వ్యాసాలుగా, కవితలుగా రాయడం మొదలు పెట్టాను.
.
“మానవి” మహిళా మాగజైన్ లో, రెగ్యులర్ గా నా వ్యాసాలు, కవితలు ప్రచురితమయ్యాయి. “రంగుల కన్నీళ్లు” అనే కథ రాసాను. అనేక కవితలు నవతెల౦గాణ ఖమ్మం అంకురం పేజి లో వచ్చాయి.
కవి సంగమం గ్రూప్ పై...
కవిసంగమం గురించి చెప్పాలంటే, పెద్ద వ్యాసమే అవుతుంది. కవిసంగామానికి రుణపడి ఉంటాను. నేను ఆ గ్రూప్ లో వచ్చి కొద్ది రోజులే అయినా, కవితలు, వ్యాసాలు, విశ్లేషణలు, పుస్తక సమీక్ష కవిత్వం తో ముఖాముఖి ఇలా నేను ఏ ప్రక్రియ చేపట్టినా, సభ్యులు పూర్తి ఆదరణ ఇస్తున్నారు. నిజం చెప్పాలంటే కవిసంగమం నాకు రెండో జీవితం. ఎన్నో విషయాలను నేర్చుకొంటున్న. అది ఒక కవిత్వ విద్యాలయం.
.
కవిసంగమ లో శీర్షిక లపై...
అన్ని శీర్షిక లు అద్బుతంగా వర్ధమాన రచయతలకు మార్గదర్సకం. కవిత్వానువాద శీర్షిక పై నాకు మొదట్నుంచి కాస్త ఎక్కువ అభిమానం. కారణం నాకిష్టమైన రెండు భాషలు ఉండటం . ఆ శీర్షిక లో కవి పరిచయం నుంచి స్ఫూర్తి పొందగల విషయాలు ఉండటం ఇంకో కారణం. అనువాదానికి వాడే అరుదైన వొకాబులరీ, అదీ ఆ కవిత లో ఎలా ఒదిగిందో పరిశీలించటం ఇష్టం. ప్రపంచ స్థాయికి తెలుగు సాహిత్యం చేరాలంటే, అనువాదమే ఏకైక వారధి.
ఈ కవిసంగమ శీర్షిక కోసం నాకు ఫోన్ కాల్ రావడం, నా గురించి నా అభిమాన శీర్షిక లో రాయడం, ఎంతో ఆశ్చర్యనందాన్ని కలిగించింది. మీతో సంబాషణ మరింత ఆత్మ విశ్వాసాన్ని ఇచ్చింది. నా ఖమ్మం సాహితీ మిత్రులకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. వారంతా నాకు ఎప్పుడూ నా సాహితీ ప్రయాణమ లో నాకు అండదండ గా ఉంటారు. ముఖ్యంగా నా భర్త..., నాకు అత్యంత ప్రాధాన్యత గల అంశం సాహిత్యం అని గుర్తెరిగి నాకు వెన్నంటి ఉంటూ వస్తున్నారు.
ఇక ఈ కవిత సరళమైన పదాల్లో ఉంది. అయినా అనువాదం లో నేను కాస్త స్వేచ్చగానే పదాలను. వాక్యాలను ఎంపిక చేసుకొన్నాను....
..
ఫణి మాధవి కన్నోజు || తానెవరు..?? విజేత..?? పరాజిత..??||
అనుసృజన : సి. వి. సురేష్||Who she is? The winner? The looser?||
..
she herself is a question to her
who she is?
She is in search of herself.
Travelling through herself…
for the sake of hers
Searching in herself
for the sake of hers
fighting for herself…
being distressed herself..
looking deeper into herself
for the sake of herself n’ only for herself…
..
She is the bevy of specks..
She is amenable to the situations
Whether she is joyous…?
She herself being happy…
For the sake of her family….
Circumscribe herself ...
By drawing the restricted lines..
..
She is a mother…?
She herself becomes aliment
To feed the ravenous
She herself becomes a plaything..
Being played herself if necessary
..
She is an umbrella?
She always with them…
in joys and sorrows
Alike an umbrella
Protects them in sunny and rainy!

She is the goddess of earth?
Yes, she is deity of earth….!
Being sowed and reaping the happy crop
With the seeds of longing and despondency of her people…!

she is an ocean…?
Yes, she is an inlet…
Merging the anguish and loving rivers into her….
N’ bearing alone the ebbs and flows
..
Is she a desert?
Yes, she is really a desert….
Filled the heart with appetence of oases..!
..
She herself is a question… who she is?
is she a winner??
Or the backbone to the triumphs of her people…!
..
She is a looser….??
She knows….
That she can’t find herself forever…
...
...
Original poem
ఒరిజినల్ పోయెమ్.....
..
..
తనకు తానో ప్రశ్న.. తానెవరు..??
తనను తాను వెతుక్కుంటోంది
తన కోసమై తనలోకే వెళ్తోంది
తానెవరో.. తనలోనే వెతుకుతూ..
తపించిపోతూ తండ్లాడుతోంది..
తనదైన.. తనదే అయిన తన కోసం..
తరచి చూసుకుంటోంది..
..
తానో నీటిబిందువుల సమూహం..??
ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రలా మారగల నీరు...
..
తానొక ఆనందం..??
తన కుటుంబానికి.. తనకై తానే
గిరిగీసుకున్న తనదైన ప్రపంచానికి తానో ఆనందం..
..
తానొక అమ్మ..??
ఆకలి తీర్చే అన్నం తనే.. అవసరమైతే ఆడించే
బొమ్మా తనే..
..
తానో గొడుగు..??
ఎండలో వానలో తన వారి నెత్తిన గొడుగై..
కష్టసుఖాల్లో వెన్నంటే నీడ తాను...
.
తానో భూమాత..??
తన వారి ఆశనిరాశల విత్తనాలు తనలో
ఇముడ్చుకుని సుఖశాంతుల పంటపండించగల
భూమాత తను..
.
తానో సముద్రం..??
తన వారి ప్రేమల కోపతాపాల ఆవేశాల నదులన్నీ
తనలో కలిపేసుకుని.. ఆటుపోటులన్నీ తానే
భరించగల సముద్రం తను..
..
తానో ఎడారి..??
ఎద నిండిన ఆశల ఎండమావులను నింపుకున్న
ఎడారి తాను..
..
తనకు తానో ప్రశ్న.. తానెవరు??
తానొక విజేత..?? తన వారి విజయాలకు వెన్నెముక..
..
తానొక పరాజిత..??
తనకు తానెప్పటికీ దొరకదని ఎరుక...
~ ఫణిమాధవి కన్నోజు

Thursday, July 26, 2018




                                                                        శ్రీరాం పుప్పాల 

ప్రపంచమంతా కవిత్వం తో నిండి ఉంది. ఈ గాలి ఆ కవిత్వం ఇచ్చే స్పిరిట్ తోనే జీవిస్తోంది. అంతే కాదు, ఈ తరంగాలు ఆ కవిత్వం యొక్క సంగీతం తో, దాని శ్రావ్యత గల పాటలతో, అంతే కాదు , కవిత్వపు వెలుగు లోనే మెరుస్తుంది..... జేమ్స్ గేట్స్ పెర్సివాల్
THE WORLD IS FULL OF POETRY. THE AIR IS LIVING WITH ITS SPIRIT AND THE WAVES DANCE TO THE MUSIC OF ITS MELODIES, AND SPARKLE IN ITS BRIGHTNESS…JAMES GATES PERCIVAL
సరిగ్గా ఇలాగే ఆలోచిస్తాడు రాజమండ్రి కి చెందిన శ్రీరాం. పి. ఆయన మాట్లాడితే కవిత్వం. తన చుట్టూ కవిత్వం ఉందని భావిస్తాడు. కొత్తగా రాయలంటాడు. అదేదో నచ్చనిదాన్ని బద్దలు కొట్టి, దాంట్లోనుంచి, నచ్చినదేదో కవిత్వం ద్వారా తీసుకోవాలంటాడు. విస్పోటనం లాంటి కవిత్వం సృజించాలంటాడు. నాకు తెలిసి ఆయనే ఓ కవిత్వం. ప్రస్తుతం కడియం పట్టణం లో ఆంధ్రా బ్యాంకు చీఫ్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. రాత్రి పొద్దు పోయే వరకు , దాదాపు మూడు గంటలు మాట్లాడినా, ఆయన తనివి తీరలేదు. ఆ కవిత్వ దాహం అలాంటిది. సురేష్ గారూ... కేవలం కాలతీతమవుతుందని తప్ప .. ఫోన్ పెట్టేయ బుద్ధి కాలేదు అని చెప్పారు. అతి తక్కువ వ్యవధి లోనే అత్యంత ఆప్తుడయ్యారు.
ఇటీవలే రాధేయ పురస్కారం అందుకొన్న అద్బుత కవి శ్రీరాం పుప్పాల. ఆయన రాసిన “యుద్ధ నౌక” కు ఉత్తర అమెరిక తెలుగు సంఘం (నాట) కవితల పోటీల్లో మొదటి అవార్డ్ వచ్చింది. ఎలాంటి భేషిజాలు లేని, అతి మంచి వ్యక్తి శ్రీరాం. వందకు పైగా కవితలు రాసారు. త్వరలో సంకలనం వేయాలన్నది ఆయన ఆకాంక్ష.
ఈనాటి ఈ శీర్షిక కు ఆయన అతిధి.
..
ఆయన గురించి ఆయన మాటల్లోనే విందాం....
సాహితీ ప్రయాణం :
ఈ బ్యాంక్ ఉద్యోగమూ, బిజీ పనుల, సాధారణ రణగొణ జీవితం నుంచి మరో పక్కకు రావటం, ప్రపంచాన్ని కొత్త చూపు తో చూడటం, కవిత్వంలోకి రావడం...పాఠాలు చెప్పిన తెలుగు టీచర్ల ప్రభావం. ఆరవ తరగతిలోనే సోషల్ కాన్సెప్ట్ తో ఓ కవిత రాశాను. అది స్కూల్ మేగజైన్ లో పబ్లిష్ అయింది. ఆ తరువాత టి..కె. చూడామణి గారు, శర్మ గారు లాంటి టీచర్ల వల్ల తెలుగు అంటే మక్కువ ఏర్పడింది.
..
ఇంటర్మీడియట్, విజయవాడ సిద్దార్థ కాలేజ్ లో తాటి శ్రీ కృష్ణ గారు తెలుగు లెక్చరర్. ఆ మహానుభావుడు 'అరుణ తార' అనే పుస్తకం నా చేతికిచ్చిన వ్యక్తి. రావి శాస్త్రి ని పరిచయం చేసిన వ్యక్తి. ఆయన లాంటి వ్యక్తి దొరకటం నా జీవితంలో అదృష్టం. "మో" వేగుంట మోహన్ ప్రసాద్ గారనే మహాకవి ి అక్కడ ఇంగ్లీష్ లెక్చరర్. ఆ కాలేజ్ మేగజైన్ కు ఎడిటర్ కూడా. నేను కవిత రాసుకెళ్ళటం ఆయన అది ప్రచురించటం ఇలా నడిచింది. అప్పటికి ఆయన అంత గొప్ప వ్యక్తి అని కూడా తెలియదు....
..
అప్పట్లోనే ఆలిండియా రేడియో లో నెలకొకసారి 'కవితా కిరణాలు' 'భావ చిత్రాలు' అని ఓ శీర్షిక నడిపేవాళ్ళు. వచన కవిత్వంలో సమస్యాపూరణం. అందులో గెలవటం రేడియో లో ఇంటర్వ్యూ రావటం జరిగింది.
..
18 సంవత్సరాల వయసులో అప్పట్లో విశాలాంధ్ర లో ముత్యాల ప్రసాద్ గారు ఆదివారం పేజీలో కవితలు ప్రచురించి ప్రోత్సహించారు. ఆ తర్వాత బియస్సీ, ఎంఎస్సీ అగ్రికల్చర్ బాపట్ల. అక్కడ మరో మహానుభావుడు 'వాస్తు బాబాయ్' అనే ఫేమస్ నాటిక రాసిన గొప్ప హాస్య నాటక రచయిత, గాయకుడు పివిి. రాం కుమార్ గారు మాకు జెనెటిక్స్ ప్రొఫెసర్, డీన్ ఆఫ్ స్టూడెంట్స్ అఫైర్స్. బూసురుపల్లి వెంకటేశ్వర్లు రాం కుమార్ గారికి సమకాలీకులు. వాళ్ళ ఆధ్వర్యం లో అక్కడ ఉగాది కవింసమ్మేళనాలు నిర్వహించేవారు. మళ్లీ అక్కడా కాలేజ్ మేగజైన్ లో కవితలొచ్చేవి. అప్పుడే నన్ను కవిగారూ అని గౌరవంగా పిలిచేవారు.
..
మా తాతగారు కమ్యూనిస్టు అభిమాని. తెలుగు వ్యాకరణం ప్రత్యేకంగా మా అమ్మ పరమేశ్వరి గారు చదివించారు.. ఆ నేపథ్యంలోనే తొమ్మిది, పదో తరగతి సమయంలోనే పరస్పర విరుద్ధమైన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి భావ కవిత్వం, మహాప్రస్థానం లాంటి విప్లవ సాహిత్యం చదివాను
..
ఇవి నా మీద ప్రభావం చూపించిన పుస్తకాలు కూడా ఇవే. అప్పుడు మొదలైన సాహిత్యం పై మోజు కొనసాగుతూనే ఉంది. బాపట్ల కాలేజ్ లో ఉన్నప్పుడు వరవరరావు కవిత్వం పరిచయమైంది.
..
ఈ అనుభవాల దృష్ట్యా మొదటి నుంచి ఒక అభిప్రాయం, నాకు సామాజిక అంశం లేనిదే అది కవిత్వం కాదనేది ప్రగాఢమైన నమ్మకం. కవిత్వం అంటేనే అది సమాజం గురించి మనుషుల గురించి మాట్లాడుతుంది. కవిత్వంలోని లయ నన్నాకర్షించిన అంశం. విజయవాడలో వారం రోజుల పాటు జరిగే బుక్ ఫెస్టివల్స్ కు అప్పటి నుంచి ఇప్పటి వరకూ హాజరవుతుండటం నిరంతర ప్రక్రియ గా కొనసాగుతుంది. అప్పట్లో 'పూర్ణకుంభ్' అని తమిళనాడు నుంచి వచ్చే హిందీ మేగజైన్ లో హిందీ ప్రవీణ లాంటివి చదివిన అనుభవంతో హిందీ కవితలు కూడా రాయటం జరిగింది. కొత్తగా బ్యాంకు జాబ్ లో చేరినపుడు పర్సనల్ ఆఫీసర్ దర్భశయనం గారితో పరిచయం మళ్ళీ సాహిత్యం పై శ్రద్ధ కొనసాగేలా చేసింది. చేనేత కార్మికుల మీద కవితలూ అప్పుడు రాయటం జరిగింది. ఇలా ప్రతి దశలో ఎవరో ఒకరి సాంగత్యం వల్ల నాలో కవిత్వం సజీవంగా ఉంటూ వచ్చింది. ఉద్యోగం లో చేరిన తర్వాత సంపాదనపై శ్రద్ధ కామన్ గా పెరిగింది. రంపచోడవరంలో చేస్తున్నపుడు గిరిజన సమస్యల పట్ల అవగాహన పెరిగింది. అక్కడి పరిస్థితులే నా ఆలోచనలను పతాక స్థాయికి తీసుకెళ్ళాయి. పెనుకొండ ఇస్మాయిల్ గారు నాతో కలం స్నేహం చేసి, మా అక్కను వివాహం చేసుకున్నారు. 'దేవుడి సందు' అని రంజాన్ సందర్భంగా ప్రజాశక్తి లో ఒక కవిత రాశా. అది చదివి అఫ్సర్ మెసేజ్ చేసాడు. బావుంది బాగా రాయమని ప్రోత్సహించారు. అలా ఆయన పరిచయం అయారు. ఆ తర్వాత విజయవాడలో శ్రీ శ్రీ ప్రింటర్స్ దంపతులు విశ్వేశ్వర రావు , ప్రమీల లు పరిచయం తో, కవిత్వం పట్ల పరిపక్వమైన ఆలోచన చేయడానికి కారణమయ్యారు.ఆ సాహితీ మిత్రుల ఎల్లలు లేని విలాసం లోనే కవి సీతారం, కొమ్మన రాధాకృష్ణ, లెనిన్ లాంటి కవులు పరిచయం అయ్యారు. అయన 2004 నుంచి నిర్వహించిన కవిత్వం తో సాయుంకాలం కార్యక్రమ లో, క్రమం తప్పకుండ విడుదల అయిన కవితా వార్షిక సంచికలు, మరో స్ఫూర్తి దాయకమైన ప్రేరణ. ఈ సభల్లో నామాడి శ్రీధర్, జి. లక్ష్మీ నరసయ్య గారు బాగా రాయమని ప్రోత్సహించే వారు. అక్కడే అనిల్ డానీ కూడా పరిచయం.
కవిత్వానికి ఒక కొత్త రూపం అవసరం. కొత్త వాక్యం రాయొచ్చు. అనే గొప్ప అభిప్రాయం కలిగేది. ఖాదర్ మొయినుద్దీన్ 'పుట్టుమచ్చ' అనే కావ్యం నన్నెంత గానో కదిలించిన కావ్యం. త్రిపురనేని రహస్యోద్యమం, అరుణ్ సాగర్ కొత్త డిక్షన్ మ్యూజిక్ డైస్ , హెచ్ ఆర్ కె విలక్షణ వాక్యం కూడా నాపై ప్రభావం చూపింది. నచ్చేది. మొత్తం మీద ఇప్పుడు, కవిసంగమంలో ఇంతమంది కొత్త కవులను చూస్తున్నప్పుడు మనం కొత్తగా ఎలా రాయాలి? ఏం రాయాలి? అనిపిస్తుంటుంది. కర్నాటక, తమిళనాడు ల మధ్య కావేరి జలాల వివాదం, ఆత్మహత్యలు జరగటం, మన దగ్గర కూడా నీళ్ళ గురించి వివాదాలుండటం నన్ను మనస్తాపానికి గురిచేసింది. అప్పుడు నీళ్ళు అంశం మీద రాయటం మొదలెట్టి 'నాటా' వారి పోటీకి పంపాను. పాలింకిన ఇసుక రొమ్ములు ,ఏడుపు బంతుల్లా దొర్లి పడే కన్నీళ్లు, తడి కిరీటం, తలలు లాంటి రాళ్ళు పగిలిన నీళ్ళ ఒడ్డున నిప్పు రాజుకున్న గుర్తులు, ఇవన్నీ కూడా కొత్త పదాలని , వాటిని వాడే సందర్భాలను, ఆ సందర్భాలు చెప్పే భావాల్ని, మనకు సజీవంగా కళ్ళకు కట్టేస్తాయి.. ఈ కవితకు మొదటి శ్రోత పాయల మురళీకృష్ణ.
కవి సంగమం గురించి....
కవి సంగమం వర్ధమాన కవుల్ని ఒక వేదిక మీదికి తెచ్చిన ప్రయత్నం. చాల అద్బుత ప్రయోగం కూడా. యాకూబ్ గారు ఎంతో ప్రశంసార్హమైన వ్యక్తి. నేడు కుర్రాళ్ళల్లో కొన్ని బలమైన గొంతులు వినిపిస్తున్నయంటే అది కవి సంగమం పుణ్యమే. ఇది మరింత పకడ్బందీగా నిర్వహించాలి. అప్పుడు మరిన్ని అద్బుతాలు జరిగి తీరుతాయి.
కవి సంగమం శీర్షిక ల గురించి....
శీర్షికలన్నింటి లో లక్ష్మి నరసయ్య గారిది మీ కవిత్వానువాద శీర్షిక బాగుంటుంది. ఒకటి బేసిక్ సంగతులు సింపుల్ గా చెప్పే శీర్షిక. మరొకటి అద్బుతమైన వ్యాఖ్యానము చాల ఇంటరెష్టి౦గ్ గా ఉంటుంది.
కవిత్వానువాదం శీర్షిక పై....
ఈ శీర్షిక లో మంచి మంచి తెలుగు కవితలని తీసుకొని, అంతే నిబ్బరంగా, సమర్థవంతంగా, ఇంగ్లీష్ లోకి అనువాదం చేస్తున్నారు. మీరు ఆంగ్ల కవిత్వాన్ని కొత్త తరం కవులతో పరిపుష్టం చేస్తున్నారు. ఇది భావి తరాలకి ఒక చరిత్ర.
వర్ధమాన కవులకు సూచనలు...
సూచనలిచ్చెంత పెద్దరికం నాకేక్కడుంది? కొత్తగా మాత్రం రాయాలి. ఫ్రెష్ గా అదో విస్పోటనం లా ఉండేట్టు, చురుక్కుమనేట్టు రాయాలి. కవులు సమాజం లోనుంచి రాయాలి.
ఈ కవిత నేపధ్యం... ఆయన మాటల్లో..
ఇరాక్ లోని మోసుల్ పట్టణంలో ఇసిస్ దాడి కి 39 మంది బారతీయులు చనిపోయారు. వారి స్మృతి లో ఈ కవిత. మతోన్మాద ఉగ్రవాదులకి భారతీయ విశ్వాసలెలా ఉంటాయో, తెలియ చెప్పే కవిత. చనిపోయిన వాళ్ళల్లో ముస్లీం లు, సిక్కులు ఇద్దరూ ఉన్నారు. భారత ప్రభుత్వం వాళ్ళ చావు గురించి, వాళ్ళ కుటుంబ సభ్యులకి లేట్ గ, అదీ పర్సనల్ గా చెప్పకుండా, డైరెక్ట్ గా పార్లమెంట్ లో ప్రకటించినప్పుడు వాళ్ళ బాధ ఎలా ఉందో తెలియ చెప్పిన కవిత. డబ్బులు కాదు మనుషులు కావాలని ఇంటివాళ్ళు ఏడ్చే కవిత.
ఇటీవలే రాధేయ అవార్డు సాధించిన ఈ కవిత నాకు ఒక కత్తి మీద సాము. మొత్తంగా వాడుక బాష, ప్రతీకలు, ఇడియమ్స్ తో కూడుకొన్నది. శ్రీరాం గారు రాసిన ఈ కవిత కవిత ప్రియులందరూ చదవాల్సిందే.
మనసుకు హత్తుకొని మనల్ని ఏడిపించే కవిత ఈ “మెహరూం కా మోహబ్బత్ నామ” ! అనుసృజన లో పూర్తి స్వేఛ్చ తో కవిత మూలాన్ని అర్థం చేసుకొని చేసాను.... ఎంజాయ్ దిస్ ట్రాజిక్ లిరికల్ పోయెమ్.!!

..
..
శ్రీరాం .పి.|| మెహ్ రూం -కా-మొహబ్బత్ నామా ||
సి. వి. సురేష్
అనుసృజన: || THE LOVE LETTER OF THE DECEPTED||
..
As
The village farmland was not imbrued
Moving faraway..
By leaving the womb of mother
You ligate the niche of apprehension
by
Bailing the body of out flowed tears in fist…
N’ leaving the sacrifying ray of your family..
N’ departing from the tender seeds…!
..
in the
Starved stomach alike,
the narrowed pile of home….
The sonority of
tea cups n’ saucers and the big biryani vessel..
while cleaning…!
The unbearable fumed land
In the heart underneath the legs!
The whole heartstrings
Masked with black emptiness!
..
There…
No visa tree will give sweet date
Except.
The shattered blood of migrants
Along the shore of the red sea!
N’
The pledged sorrowful tears
In the whole salty liquid of Persian gulf..!
..
from the day
You left the house…..
Jasmine of our backyard
Singing the lonely solo song…
On the service bed….
From the dinars n’ courage you sent!!
Landmarks which can’t live without you…
Never being translated into heavens
..
You are the only one….
By screwing the spikes in the sandy machine
Hanging alike the tail of poverty
To the kites of desert appetence!!
When you intake the food?
When you slept in peace?
The psalms of the gurbhani..
‘Akala nirankaara’… “alak niranjaa’
Sung by sardhaari neighbour
Alike the tone of the ajhaa fort….
The flying smooth pigeon
Always come n’ fall
On the house exactly at prayer time
..
laying in the open yard
While, counting the frayed star- lines
Of our palm like birth town
I glared
Forty crescents standing ..
by bending their knees in abroad..
who searched the birth-moles.!!!
..
May be my hungry is my identity
I scarf my head with pious
When sevadar called me for lunger
With golden plate…!
Religion is my epistle
Which taught me how to fight…!
ఒరిజినల్ పోయెమ్ ......!
పి. శ్రీరాం || మెహరూం కా మోహబ్బత్ నామా
..
ఊరిపొలంలోకిన్ని నీళ్ళు రాలేదని
గట్టుతెగిన కన్నీళ్ళ దేహాన్నో గుప్పిట మూటగట్టుకుని
వత్తిలా కాలుతున్న చూపుల ఇంటిదీపాన్నొదిలి
నేలలో నాటిన పసి గింజల్నొదిలి
అమ్మ కడుపులోంచి
ఎక్కడికో సుదూరంగా వెళ్ళి
నువ్వో దిగులు ఇసుకగూడు కడతావు
..
ఇరుకింటి మోరీ లాంటి ఆకలి కడుపులో
కడుగుతున్న చాయ్ కప్పులూ సాసర్ల ధ్వని
బిర్యానీ భాండంలా, నిభాయించలేని
కాళ్ళకింది గుండెలో సెగలు గక్కే భూమి
మనసంతా నల్లటి సిఫర్ కప్పిన పరదా !
..
నీకక్కడ ఎర్ర సముద్రం ఒడ్డంతా
వలస చేతుల్నుంచి పిండిన రక్తమూ
పెర్షియన్ గల్ఫ్ ఉప్పుద్రవమంతా
తనఖా పెట్టిన దు:ఖపు కన్నీరూ తప్ప
వీసా చెట్టుకి తియ్యటి ఖర్జూరమెప్పుడూ కాయదు.
..
నువ్విల్లు వదిలి వెళ్ళినప్పటినుండీ
దొడ్లో పూసిన మల్లె పూవు
కిద్మత్ పక్కమీద ఒంటరి గీతమాలపిస్తుంది
నువు పంపే దీనార్లూ , దీరమ్ములనుండీ
నిన్నొదిలి ఉండలేని ఆనవాళ్ళు
ఎప్పటికీ జన్నతులుగా తర్జుమా కావు
..
ఇసుక యంత్రానికి మరమేకులు దిగ్గొడుతూ
ఎడారి ఆశల గాలిపటానికి
నువ్వొక్కడివీ పేదరికం తోకలా వేలాడతావు.
ఏ పూట తిన్నావో, ఎంత కునుకు దీశావో ?
అకల నిరంకార, అలక్ నిరంజన
గుర్బనీ కీర్తనలు పాడే పక్కింటి సర్దారమ్మ
అజా బురుజు లాంటి గొంతులోంచి
ఎగిరే మెత్తటి పావురమెప్పుడూ
నమాజు సమయానికి ఇంటిమీద వాలుతుంది
..
ఆరుబయట పడుకుని
అరచెయ్యిలాంటి పుట్టిన ఊళ్ళోని ఆకాశంలో
అరిగిపోయిన భాగ్య రేఖల్ని లెక్కగడుతున్నపుడు
నాకు
పుట్టుమచ్చలు వెతికిన
పరాయి దేశం మోకాళ్ళమీద నిలబడ్డ
నలభైమంది ఇంటి నెలవంకలు కనిపిస్తున్నాయి
*
ఆకలి నా అస్తిత్వమే కావొచ్చు
బంగారు పళ్ళెంతో
సేవాదార్ లంగర్కి పిలుస్తున్నపుడు
భక్తితో దుపట్టా తలమీద కప్పుకుంటాను
మతం నాకు పోరాడ్డం నేర్పించిన గురువు.
(ఇరాక్ లో ని మోసుల్ పట్టణంలో ఐసిస్ కి బలయ్యిన 39 మంది భారతీయుల స్మృతిలో)
------------------------------------------
మెహ్ రూం - పరాధీన, వంచిత
సిఫర్ - ఖాళీతనం
జన్నత్ - స్వర్గం
కిద్మత్ – సేవ

Wednesday, July 18, 2018


              కవిత్వానువాదాలు - మనకవులు 
                                     18
                                                        సుపర్ణ మహి 

      మూడు పదుల ప్రాయం ఇప్పుడిప్పుడే నింపుకొని, తత్వాన్ని, కవిత్వాన్ని మిళితం చేస్తూ, కవితా ప్రియులకు మంచి కవిత్వాన్ని అందిస్తున్న సుపర్ణ మహి ఈ నాటి కవిత్వానువాద శీర్షిక కు అతిధి. 
ఊరు ఒంగోలు. చదివిందీ, పెరిగిందీ అక్కడే. ఇంటర్ వరకే చదివి, తర్వాత పారిశ్రామిక విద్యుత్ రంగం లో పని చేస్తూ, ఉండే మహీ, ఒక జింక పిల్ల. ఇప్పటికే ఐదారు సార్లు మహీ తో మాట్లాడిన అనుభవం తో చెప్తున్నాను, ఎప్పుడూ హుషారుగా, గమ్మత్తుగా, తాత్వికంగా, కవిత్వంగా కనిపిస్తాడు. ఆ కవి కవిత్వ ప్రయాణాన్ని ఆయన మాటల్లోనే విందాం.
రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఇవాళ కవులు ఎవరైనా కవిత్వం రాయగలగడమో, చదవగలగడమో జరుగుతోందటే, వారిలో సగం మందికి పైగా కవిసంగమంగ్రూప్ ను చూడని వారు ఉండరు.
బాగా చదవగాలిగినవారే రాయగాలుగు తారు. సమకాలీన కవిత్వం ఒకటే కాదు. వెనక తరాల కవిత్వాన్ని కూడా చదవాలి.
.
కవిత్వాభినివేశ౦:
మా నాయనమ్మ మంచి రీడర్. వారపత్రికలు, పురాణాలు అన్నీ ఆమె దగ్గర ఉండేవి. ఆమె వాటినన్నిటిని చదివేది. అప్పుడు నేను ఒక పోయెమ్ చదివాను. చనిపోయిన తన తమ్ముడిని తలచుకొంటూ ఒక అమ్మాయి రాసిన పోయెమ్. ఆ కవిత లో ఒక పదం నన్ను వెంటాడింది. ఒక వ్యక్తి చనిపొతే ఇలా రాస్తారా/ అని ఆ అమ్మాయి ఎలా రాసింది అని అనుకొన్న.. ఆ అమ్మాయి పేరు దేవిప్రియ. మొన్నటి వరకు దేవి ప్రియ అమ్మాయి అనుకొనే వాడిని. కానీ, ఇటీవలే తెలిసింది దేవిప్రియ అమ్మాయి కాదు. గొప్ప కవి అని . తర్వాత శ్రీ శ్రీ, ఆకలి రాజ్యమ లో కొటేషన్స్, ఆయన కవిత్వం, తర్వాత శేషేంద్ర గారి కవిత్వం ఇలా చదువుకొంటూ వచ్చాను. ఉత్సాహం వచ్చింది. కొందరు స్నేహితులు నా నుండి దూరం అయినప్పుడు ఆ పెయిన్ ను డైరీ ల్లో రాసుకోనేవాడిని. బాగా రాసాను. ఆ బాధను. అప్పుడు కవిత్వం అనే దాని పైన ఇష్టం పెరిగింది. నా వరకు నా స్నేహితులు విడిపోయిన తర్వాతనే నా కవిత్వ ప్రయాణం మొదలయింది.
ఫేస్ బుక్ కవిత్వం:
తర్వాత పేస్ బుక్ లో మా సిస్టర్ ఐడి create చేసి ఇచ్చారు. ఇందులో రాస్తుండు మహీ, అని సలహా కూడా ఇచ్చారు. అప్పటికే, నేను అఫ్సర్ పెన్నా శివరామకృష్ణ ల కవిత్వం ఎక్కడ కనపడినా, ఆ పేపర్ ను దాచుకోనేవాడిని. అలాగే, ఆ ఇద్దరినీ అక్కడ చూసే సరికి, నాకూ ఏదో రాయాలని తపన, అలా సోషల్ మీడియా లో రాయడం మొదలు పెట్టినాను.
చిన్నప్పడు ఒక ఫీలింగ్ ఉండేది.. ఒక్కసారైనా నా పేరు ను పేపర్ లో కనిపించాలని అనుకొనేవాడిని. అప్పటికే సారంగా పత్రిక వస్తుండేది. అఫ్సర్ గారి పత్రిక అని తెలిసింది. నా స్నేహితురాలు ఒకావిడ సారంగా లో రాయి మహీ అని చెప్పింది. కానీ నాకు ధైర్యం చాలలేదు. కొద్ది రోజులకు నేను ఒక పోయెమ్ ధైర్యం చేసి పంపినాను. పంపిన రెండు నిముషాల్లోనే నాకు అఫ్సర్ గారి దగ్గర నుండి కాల్ వచ్చింది.. నీ పోయెమ్ నచ్చింది మహీ. దీన్ని సారంగా ప్రచురిస్తాను. అని చెప్పేసరికి ఆనందం పట్టలేక పోయింది. అది నాకు ఒక గొప్ప సందర్భం. ఎప్పటికీ గుర్తే. తర్వాత ఏదైనా ఆనందం వచ్చినా, అవన్నీ బోనస్ లె.
నేను ఏదీ ఆశించి పోయెట్రీ రాయడం లేదు .. అందుకే, ఎప్పుడూ పోయెట్రీ నాకు నిస్పృహ ను నిరాశను మిగల్చలేదు. పైగా , వ్యక్తిగా నాకున్న స్థానం కంటే, poet గా నాకో ఉన్నత స్థానాన్ని, పెద్ద కవుల సరసన అని చెప్పలేను కానీ, వారి మధ్యలో గుర్తింపు తెచ్చి పెట్టింది.
కవిత్వాన్ని నేను ఏ మాత్రం నేర్చుకోలేదు. ఏదైనా ఒక విషయాన్ని, ఒక లయను, ఒక నిబంధనలను పెట్టుకోన్నమంటే, ఒక నిర్మాణం కోసం ఉన్నామనే అర్థం. ఖచ్చితంగా ఇదే పోయెట్రీ ఇలాంటిదే పోయెట్రీ అని చెప్పలేను. ఏదో ఇదామిత్తంగా రాసేస్తారు అని కూడా అనుకోను. ప్రతి ఒక్కరు పోయెట్రీ రాయాలని ఖచ్చితమైన ఆలోచనతోనే రాస్తారు. నాకు ఇప్పటికీ కవిత్వం knowledge తక్కువ. నాకున్నంత వరకు నాకు ఒక లయ ఉంటుంది. దానికి సమానంగా నా కవిత వచ్చిందా . లేదా. అని చూసుకొంటాను. ఎక్కడైనా, పద గాంభీర్యం, శబ్ద గాంభీర్యం పెద్ద పెద్ద పదాలు వాడటం జరిగిందా అని చూసుకొంటాను. అంతే
వ్యక్తి తాలుకు ఆలోచన కవిత్వం. కవిత్వం మూల ఉద్దేశ్యం సమాజాన్ని మార్చడం , ఎక్కడో మేలు జరుగుతుందనో అనుకోవడం పొరపాటే. అలా మార్చాలనుకోవడం కవి కున్న హక్కు. ఇవాళ సోషల్ మీడియా కవిత్వం చాల మంది కవులు ఒక సిద్ధాంతం అంటూ లేకుండా, ఒక సమస్య పైనో. ఒక సంఘటన పైనో ఎవరైనా రాయడం మొదలు పెడితే, అనుకరిస్తూ రాయడం, అందులో తమని తాము చూసుకోవడం జరుగుతోంది. పోయెట్రీ తాలుకూ లక్ష్యాన్ని సమగ్రంగా ఫాలో అయ్యి. కవిత్వాన్ని రాయడం లేదని నా అభిప్రాయం. తమ వాదన ను బలంగా వినిపించగలుగుతుంది కానే, కవిగా నిలిపే కవిత్వం రాయగలగాలి. ఇప్పుడొస్తున్న ఆధునిక కవిత్వం లో, పాత కవిత్వం తో పోలిస్తే, కవిత్వం పాళ్ళు చాల తక్కువ. గొప్ప కవిత్వం రాస్తున్న వాళ్ళు చాల తక్కువ.
కవిసంగమం లో విరించి అన్న నాకు మొదట నుండి తెలుసు. ఆయన చెప్పేవాడు. కవిసంగమం లో రాయామన్నాడు. అప్పుడు నేను వోద్దన్న. అక్కడ పెద్ద పెద్ద కవులు ఉంటారు... అని అన్నాను. అప్పుడు అదేమీ లేదు మహీ, రాయడం మొదలు పెట్టు. అక్కడ మంచి వాతావరణం ఉంది అని ప్రోత్సహించాడు. బయపడుతూనే వచ్చాను. నా భయాలన్నీ తొలగి పోయాయి. అక్కడ మంచి వాతావరణం ఉంది. సాదరంగా ఆహ్వానించారు. మంచిగా ఉంటె, మంచి గా ఉందన్నారు. బాగలేకుంటే, బాగాలేదని చెప్పేశారు. చాల సంతోషం.
మీరు కానీ, వంశీ గారు కానీ, రాజారం అన్న కానీ, అఫ్సర్ గారు కానీ, వెంకట యోగి గారు కానీ, ఎల్. ఎన్. గుంటూరు సర్ గానీ, ఇతర శీర్షికలు కానీ, కవిత్వం దాని విషయాలు నేర్చుకోవాలనుకొనే వారికి పెద్ద ఉపయోగకరం. చదవాలన్న ఆలోచన ఉన్నావారికి, చదివి నేర్చుకోవాలన్న కవులకు ఈ కవిసంగమం లో కవితలు, శీర్షికలు చాల ఉపయోగకరం. కవిసంగమం గ్రూప్ యొక్క లక్ష్యం యాకూబ్ గారు పూర్తి స్థాయిలో నిమగ్నమయి చేయడం తోనే ఇవాళ ఆ గ్రూప్ తారాస్థాయి కి చేరుకొంది. .....
ఇలా ఒక గంట పాటు అనర్గళంగా, ప్రశ్న వేస్తూనే, తటాలున అందుకొని, సమాధానం ఇస్తూ, నవ్వుతూ, హుషారుగా సమాధానం ఇస్తూ సాగింది. నిన్న రాత్రి.
ఇక ఈ కవిత విషయానికొస్తే, ఒక మంచి కవిత. కొన్ని చోట్ల పూర్తి స్వేఛ్చ తీసుకొన్నాను. భావం చెడిపోకుండా.. అనువాదం చేయడం ఆ వాఖ్య నిర్మాణం తో కాస్త కష్టం అనిపించినా, మంచి కవిత ను చేసి అనువాదించా అన్న అనుభూతి మిగిలింది.
...
..
సుపర్ణ మహీ || ఆర్ యు ధెర్? ||
అనుసృజన : సి.వి.సురేష్
|| Are You There? 
||
..
..
Perhaps..
Dear, may be I cant move ..
without having a glance…
In the place where we were in converse
Even I walk away far to that place…
..
The cold breeze
Brings the sea which conjoining
the murk and moonlight
By holding the edges of the tides!
..
I stare around me
Moving away from there as if it’s too late…
By leaving scribed names….
N’ leaving the shared steps to the sands…!
..
I grope some moments
In the empty place where you left
N’ I will also stand
By removing the waves which bundled the legs
..
The word ..
Which you recited
Reminding me frequently
Tell me dear…
Are you watching me from any where else?

....
Original poem
Supama Mahi :
ఆర్ యు దేర్?
బహుశా ఎప్పుడన్నా నేనలా
దూరమ్ నుంచి వెళ్తున్నా,
ఇవాళ మనమ్ కలిసి కబుర్లు చెప్పుకున్న
ఈచోటు వైపు చూడకుండా వెళ్లలేనేమో డియర్...!
..
చీకటినీ, వెన్నెలనీ కలుపుతున్న సముద్రాన్ని
అలల అంచులు పట్టి చలిగాలి నాదాకా లాక్కొస్తుంది...

చుట్టూ చూస్తాను...
రాసుకున్న పేర్లనీ,
జతగా పంచుకున్న అడుగుల్నీ,
అలా ఇసుకకు వొదిలేసి
ఎవరికి వారు అప్పటికే ఆలస్యమైనట్లు
దూరంగా వెళ్లిపోవడమ్ కనిపిస్తుంది...
..
పక్కన
నువ్వు లేని ఖాళీ చోటులో
కొన్ని క్షణాలు తడిమిచూసీ,
కాళ్లని చుట్టేస్తున్న
అలల్ని విప్పుకుంటూ
ఇక నేనూ లేచినిలబడతాను...
..
మొదట్లో*
నువ్వన్నమాటే
ఈమధ్య పదే పదే గుర్తొస్తుంది,
చెప్పు డియర్ ఈ సాయంత్రాల్లో
ఎక్కడి నుంచైనా
నావైపు చూస్తున్నావా...

                   *  *  *



                కవిత్వానువాదాలు - మన కవులు

17


నారయణ  శర్మ మల్లావజ్జల 


     నారయణశర్మ మల్లావజ్జల గారి కవిత దుఃఖ వాస్తవికతను  ఆంగ్లం లోకి అనువదించాలి అన్న నా  ఆలోచనేచాల  కొత్త విషయాలు తెలుసుకొనే అవకాశాన్నిచ్చింది. దాదాపు నాలుగు రోజులు  వరుసగానో...విడతలు విడతలు గానో  ఫోన్  లో మాట్లాడినాను. ఎప్పుడు మాట్లాడినా  అదే ఆప్యాయత.  పైకి ప్రశాంతంగా  కనిపించే  అయన మాటల్లో....ఆయన కవితల్లో  ఒక పెను బాధ ప్రవహిస్తోంటో౦ది. Sarah boston రాసిన  depression  is never  ending, ఇవాన్ రాసిన death అనే  కవితలు   గుర్తుకు వచ్చాయి.
I may look fine// But on the inside I'm full of death ..  అనే    రెండు వాఖ్యాలతో  death  కవిత ముగుస్తుంది. ఈయన  కవితల్లో  కూడా అదే తరహా ప్రస్పుటంగా కనిపిస్తుంది. ఒక సగటు  జీవతం లో ఎన్ని హిమనీ పాతాలు ఉంటాయో...అన్నీ చవి చూసాడు. 
ఒక కవిత రాయాలంటే, ఒక అనుభూతికి లోనైతేనే, ఆ కవిత లో జీవం  ఉంటుదని గాడంగా భావించాడు.  నా కవిత...నా భావోద్వేగాలు ..నా ఇష్టం అనే ఒక అంతర్ ధీమా అతనిది.  తొలి దశల్లో  వేదపండితుడు గా ...ఆ తర్వాత  ఒక పెయింటర్ గా....తర్వాత క్రమం లో  తెలుగు టీచర్ గా.... ఇప్పుడు సంస్కృతోధ్యపకుడిగా... మారానని చాల లోతుగా వివరి౦చారు . globalaisation ప్రతి జీవితం లో  పెను ప్రభావాన్ని చూపే క్రమం, బహుశా ఇదే నెమో అని వ్యక్తం చేస్తాడు. ఒక గొప్ప క్రిటిక్ నారాయణ శర్మ. తనకు విశ్లేషకుడిగా, ఒక క్రిటిక్ గా చాల ఆనందాన్ని ఇచ్చే సందర్భాలు ఎక్కువగా  ఉన్నాయ౦టాడు.  మూడు రోజుల క్రితం కవి యాకూబ్ గారిని, నేను  హైదరాబాద్ లో కలిసినప్పుడు నారాయణ శర్మ  అద్బుత మైన మృదంగ వాయిద్యకారుడు కూడా, అని  చెప్పడంతో ఆశ్చర్యమేసింది.
1999 తర్వాత కవితలు రాయలేక పోయానని, ఆ తర్వాత  కవి సంగమం ..లో రాయడం మొదలెట్టాక మళ్ళీ ఆ యాసంగం లోకి వచ్చానన్నాడు.  “ఈనాటి కవిత”  లో  కొత్త కవులను ఎనాలిసిస్ చేసే మంచి అవకాసం వచ్చి౦దని, మంచి పేరు తెచ్చి పెట్టింద౦టాడు.
ప్రస్తుత దుఃఖ వాస్తవికత  కవిత కూడా, ఆయన  పని చేస్తున్న పాటశాల లో ఉపాధ్యాయుల పదోన్నతులు.. రాజకీయ నిర్ణయాలతో పెను మార్పులు.. వాళ్ళు పడే బాధ లను, వాళ్ళ మాటలను విని, కలత చెంది, కవిత గా మలిచానని చెప్పినారు. జీవితాలు పట్టు తప్పి పోయాయని”  తన బాధ ను అతి సున్నితంగా ఓ  వేదాంతి లాగా మాట్లాడటం విశేషం.  ఇంకో కోణం లో progressive థాట్స్రాజ్యపు దుర్మార్గ విదానలపై ఎక్కు పెట్టడం ఇవన్నీ మరో  కోణం లో నాకు కనిపించాయి. 
1996-97 లలో ఉప్పెన అనే సంపుటి.. 1998 లో సృష్టి అనే దీర్ఘ కవిత ను, 1999 లో తమో చిత్రాలు అనే ఒక మానసిక విశ్లేషణ కు సంబందించిన కవిత, శతకాలు, అనువాదాలు. విమర్శలు రాసారు. 2005 లో 1999 లల్లొ గోపి గారి కవిత్వం పైన , సి.నారయణ రెడ్డి గారి కవిత్వం పైన విమర్శా, విశ్లేషణ చేసారు. చాల పత్రికల్లో ఆయన విమర్శా లు ప్రచురిత మయ్యాయి. 2016 లో  సాదారణ.. వ్యక్తీకరణ, అనే వ్యాసాల సంపుటి ప్రచురించారు. ఊరి దుఖం అనే జూకంటి గారి కవిత పైన విమర్శ ను చేసారు. 
ఇక ఈ కవిత అనుసృజన విషయానికొస్తేనా మెదడుకు మేత. కవి తో మాట్లాడలేని పక్షం లోఈ కవిత ను అనుసృజన చేసే అవకాశమే లేదు. ఆ కవిత లోని  idiomatic సొగసులు విన్నవారికి విన్నంత. లోతైన భావన. అద్బుత పదజాలం. ఇవన్నీ అనుసృజన కు ఒదిగే పరిస్తితిలేదు. నారాయణ శర్మ  గారితో మాట్లాడిన ప్రతి సందర్భం లో ఆయన నా అనుమానాలను వివరించే తీరు చాల నచ్చేసింది. ఒక గొప్ప కవి. మాటల  సందర్భం లో మీ కవితల్లో  ఏదో desperation కనిపిస్తుంది కదా?అని అడిగితే, ఒక మంచి నవ్వు నవ్వేసి  నిజమే నెమో  అన్నారు.   
నారాయణ శర్మ మల్ల వజ్జల :  దుఃఖ వాస్తవికత 
ఆంగ్లం లోకి అనుసృజన : 
సి.వి.సురేష్ || The Reality Of Distress  ||

A dream...
That, two handful of grains 
Scud away with the winds…!

An awful  creepy…. 
The stroling intelligence
Emptied and  remained in the midway..!

A shiver …
in  the back, while  trying  to sketch the city life….
No water to the plants….!
Instead,, protecting  those…planting is essential..
.
you are an nineteen 
Your  demise can’t  choose  my condolence…
2.
Temples …
will stand still….
The Vedic ritual bells  started ringing..

The core  essence …
being translated from  the life…
within Hours….minutes….seconds !
..
The rivers …
headed by the dictionaries…
In an extreme dead hibernation..
Bearing  the weight  of  eyelids is the 
reality of suffer in the life…!    
..
Now don’t draw any images…!
It’s a vast vacuum …
Even the breeze loathes..
Four directions covered with phony luster
But, fragrance is of political chairs….!

3
May be…
It’s not related to hungry 
It’s a speculation between a  cup and lip …
..
Time is an immortal agony….
When, the country itself only a festive….
And  when the ecstasy only an euphoria…!
...
Now…
A heaving tear need an explication..
A pledged pride needs an answer…
Whether …
Am i  a justified winner?  Unjustified winner?


ఒరిజినల్ తెలుగు కవిత.. 
దుఃఖ వాస్తవికత// నారాయణ శర్మ మల్లావజ్జుల//
_________________
దోసిటిలోని గింజలు 
గాలికెగిరిపోయినట్టొక కల.
..
నడుస్తూ వెలుతున్న పుస్తకం
మధ్యలో ఆగి ఖాళీగా మిగిలిపోయినట్టు
ఒకానొక గగుర్పాటు.
..
నగరపు జీవితాన్ని గీస్తుంటే వెన్నులో ఎదో వణుకు.
మొక్కలకు నీళ్ళులేవు
కాపాడటమెందుకు నాటడమే ముఖ్యం
..
నువ్వునిండు గర్భిణివే
నీ మరణం నా సంతాపానికి నోచుకోదు
2

ఆలయాలు నిల్చుంటాయి
ఆగమశాస్త్రాల గంటలుమోగుతాయి
..
అయువుపట్టుమాత్రం
జీవితాలనుంచి గంటలు నిముషాలు
క్షణాల్లోకి తర్జుమా అవుతుంది.
..
నెత్తిపై నిఘంటువుల్ని మోసీన నదులు
నిట్టనిలువునా ఒక మృత సుషుప్తిలో.
కనురెప్పల బరువుమోసే దుఃఖ వాస్తవికత జీవితం.
..
ఇప్పుడు బొమ్మలు వేయకు..
గాలికూడా ఏవగించుకునే మహాశూన్యం
దిక్కుల్ని కప్పెస్తున్న ప్లాస్టిక్ వెలుగు
సువాసన మాత్రం కుర్చీలది
3
అన్నానికి నోటికి మధ్య ఉండే మీమాంస
బహుశః ఆకలికి సంబంధించింది కాదు
..
పండుగలు మాత్య్రమే దేశమైనప్పుడు
పరవశం మాత్రమే దేహమైనప్పుడు
కాలం ఒక అశీర్ణ దుఃఖం
..
ఉబుకుతున్న కన్నీటిచుక్కకొక సంజాయిషీ కావాలి!
త్రాకట్టుపడ్ద మానాలప్రశ్నల కొక జవాబు కావాలి
నేను ధర్మవిజితనా ? అధర్మ విజితనా

                        *  *  *