Friday, July 27, 2018





                                                                   కొండేపూడి నిర్మల

కవిత్వం ఎమోషనల్ కి దగ్గర రూపం . ఇది నా స్వభావానికి దగ్గరగా వుంటుంది. మన అభివ్యక్తిని సూటిగాను తీవ్రంగాను చెప్పడానికి వీలు కలిగి వుండే ప్రక్రియ. నాకు తెలిసి ఉద్యమాలన్నీ కవితా రూపంలోనే నడిచాయి. ..
నాకవిత్వం గురించి 1990 లో ప్రత్యేకంగా ఎడిటోరియల్ వచ్చింది. “నీలాటి రేవు నిర్మల” అనే పేరుతో ఎబికె గారు ఎడిటోరియల్ రాశారు. అది కాస్త ప్రత్యేకంగా అనిపించింది.
..
నేను రాసిన ఒక కవిత వల్ల ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది . అది చాలా తమాషాగా జరిగింది. Open defecation స్త్రీలకు ఎంత సమస్యో దాన్ని గురించి వలసల రాజ్యం కవిత రాశాను. ఛీ చి అదే వస్తువు అన్నారు కొందరు . కానీ అందులోని సాంస్కృతిక సామాజిక కోణాల్ని గురించి పదే పదే ప్రస్తావిస్తూ వుండేదాన్ని సభల్లో. అది తెలిసిన ఒక ప్రభుత్వాఫీసు తమ water అండ్ sanitation స౦స్థలో consultant జాబ్ ఆఫర్ చేశారు. దానివల్ల ఆ సమస్యని గురించి ఇంకా లోతుగా తెలుసుకునే అవకాశం దొరికింది. ఇది 2000 లో జరిగింది .
..
ఇలా నేనడిగిన ప్రశ్నలకు తాను, రాత పూర్వకంగా వివరాలు ఇస్తూ, సురేష్ గారు మీరడిగిన ప్రశ్నలకన్నీ సమాధానం ఇచ్చేశాను. అని నవ్వుతూ, ఎలాంటి విసుగు లేకుండా సమాదానం ఇచ్చారు.
ఈ వారం కవిత్వానువాదం శీర్షిక కోసం ప్రముఖ రచయత్రి కొండేపూడి నిర్మల గారిని అతిధి గా ఎంపిక చేసుకొని, ఆమె కు ఫోన్ చేసాను. చాల హుందాగా, నిర్మొహమాటంగా మాట్లాడిన ఆమె గురించి, ఆమె సాహితీ ప్రయాణం గురించి ఆమె మాటల్లోనే విందాం....
..
పుట్టుక బాల్యం –వివరాలు :
మా అమ్మ లక్ష్మి నరసమ్మ , నాన్న వెంకట్రావు గోదావరి జిల్లా వాళ్లే. తాతగారి ఉద్యోగ రీత్యా అమ్మ పుట్టిల్లు హైదరాబాదు లో నల్లకుంటలో పెరిగింది. హిందీ బాగా వచ్చు. అమ్మ పుట్టిల్లు హైదరాబాదు కాబట్టి నేను ఇక్కడే నీలోఫర్ హాస్పిటల్ లో పుట్టాను. కానీ నాబాల్యం , చదువు, ఉద్యోగం అన్నీ విజయవాడలో గడిచాయి.. నాన్న అక్కడ స్టేట్ బ్యా౦కు లో పనిచేసేవారు.
..
సాహితీ ప్రయాణం
సాహిత్య వాతావరణం ఏమీ లేని ఉమ్మడి కుటుంబం మాది. ఎలా వచ్చిందో తెలీదు కానీ చిన్నప్పటీ నుంచి కధలంటే ఇష్టం . చందమామలు పక్కింటి నుంచి తెచ్చుకుని చదివేదాన్ని. అందులో కధల్ని స్నేహితులకి ఉత్తరాలుగా రాసేదాన్ని.. ఆ మిత్రులు దూరంగా ఎక్కడో వున్నవాళ్లు కాదు. నాతో బాటు రోజూ బడికి వచ్చేవాళ్ళే. బహుశ అది నా అభివ్యక్తికి తొలిరూపం కావచ్చు. చదువులో ముఖ్యంగా లాంగ్వేజెస్ లో బాగా మార్కులు వచ్చేవి. టెన్త్ నాటికి వ్యాసరచనల్లో స్కూలుకి ప్రతినిధిగా వేరే జిల్లాలకు వెళ్ళి బహుమతులు కొట్టుకు వచ్చేదాన్ని. ఇంటర్ లో వుండగా అలాంటి పోటీలోనే శ్రీ శ్రీ పుస్తకాలు నాచేతికి వచ్చాయి. తిలక్ ను చదివింది అప్పుడే . లైబ్రరీ లో అలాంటి గొప్ప వాక్యాలున్న పుస్తకాలకోసం వెతకడము , వాటినే తల్చుకుంటూ కలవరించి పిచ్చెక్కిపోవడము అదంతా ఆ అడోలసె౦ట్ ఏజ్ లోనే జరిగింది. డిగ్రీ మొదటి సంవత్సరంలో రేడియో వాళ్ళు పెట్టిన ఒక కవితల పోటీలో నా కవిత సెలక్టయింది. ప్రతిరోజూ సాయంత్రం విజేతల వివరాలు చెప్పేవారు . అది వినడం గొప్ప సంబరంగా వుండేది. ఆ రికార్డింగుకి వెళ్లినప్పుడు నా వాయిస్ బావుందని పొగిడారు. తర్వాత ఆడిషన్ కి సెలక్ట్ ఆయాను. యువవాణి లో కవిత్వం ప్రోగ్రామ్ కి యాంకరింగ్ చేసే క్రమలో కవిత్వం రాయడం పట్టుబడింది.
నా మొదటి రచన కధ కాదు కవిత. “మువ్వ మూగబోయింది” అది రేడియోలో ప్రసారమై ‘వాణి’ పత్రికలో అచ్చయింది. మొదటి కవిత ‘దుర్లోచన’ . సులోచనాలు ఆ౦టే కళ్ళజోడు కదా దానికి సెటైర్ గా రాసిన కవిత. సినారె సమక్షంలో కవిసమ్మేళనం లో పాల్గొనడం ఆయన అభినందనఅందుకోవడం ఒక ప్రోత్సాహం ఇప్పటికి 6 కవితా స౦కలనాలు , రెండు కధా సంకలనాలు , ఒక కాలమ్స్ బుక్ తెచ్చాను. ఆరు కవితా సంపుటుల్లోనూ వస్తు పర౦గా, ఎత్తుగడలోను వైవిధ్యం వుంది. మొదటి కవితాసంపుటి “సందిగ్ధ సంధ్య” 1988,ఏది తోస్తే అది రాశాను. అప్పటికి ప్రాపంచిక దృక్పధ౦ అంటూ ఏమీలేదు. రెండోది “నడిచేగాయాలు-“1990. అప్పటికి అస్తిత్వవాదంగా స్త్రీవాదంలో చిక్కటి కవిత్వం వచ్చిన దశ. ఇందులో నా కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువే వుంది. స్త్రీ పుట్టినదగ్గర్నిచి వృద్దాప్య దశవరకు ఎదుర్కొన్న వివక్షలన్నీ ఒక క్రమ0లో రాశాను. అంటే యుద్ద శిశువు దగ్గర్నిచి , మదర్ సీరియస్ దాకా అన్నీ దశలు అన్నమాట. అలాగే అణచివేతకు గురి అయిన అనేక స్త్రీలమీద రాశాను. వస్తు వైవిధ్యమే నా టార్గెట్. కొత్త వస్తువు కొత్తగా చెప్పడానికి వేర్వేరు ఎత్తుగడలు ఆధారంగా చేసుకున్నాను. . స్త్రీవాదం మీద డైరక్ట్ ఎటాక్ చేసినవారికి చెప్పిన జవాబులు కూడా వున్నాయి. నాకొచ్చిన గుర్తింపుల్లో ఎక్కువభాగ౦ ఆ పుస్తకమే దక్కించుకుంది . మూడు “బాధా శప్తనది” మతం కులం రాజ్యంగా వ్యవహరి౦చడం గురించి రాసినవి కనిపిస్తాయి. నాలుగు “మల్టీ నేషనల్ ముద్దు”- 2001 లో వేశాను. ఇందులో ప్రపంచీకరణ నేపధ్యంలో సమాజంలో వ్యవసాయంలో, చదువుల్లో , వలసల్లో మానవ విలువల్లో వచ్చిన మార్పుల్ని ఫోకస్ చేశాను. గ్లోబలియజేషన్ మిడ్ వచ్చియన్ మొదటి రెండుమూడు పుస్తకాల్లో ఇది ఒకటి.
..
కవిత్వం రాస్తున్న క్రమ0లో నిరాశకు గురయిన సందర్భం ;
“లేబర్ రూమ్” రాసినప్పుడు దాన్ని ఎందరు మెచ్చుకున్నారో అందరు విమర్శించారు. అది మాతృత్వానికి దెబ్బలాంటి పోయేమ్ అన్నారు. కొన్ని వాక్యాలు మార్చితే వేస్తాం అన్నారు . మార్చను. అసలు మీ పత్రికలో వెయ్యక్కర్లేదు అని చెప్పాను. అచ్చువేయ్యకుండా విచారణలో ఒక ఏడాది కాలం ఫైల్లో నే వుంచేశారు. ఈలోపుగా అది కొన్ని కవిత్వ సభల్లో చదవడం వల్ల పాపులర్ అయింది. అచ్చయిందా అని అడిగినప్పుడు “లేదండి , ఆంధ్రజ్యోతిలో పెండిగ్ లో వుంది” అని చెప్పేదాన్ని. నామీద అభిమానంతో కవి స్మైల్ లాంటి వాళ్ళు ఎడిటర్ కి ఫోన్ చేసి అడిగేవారు . నేనే ఇలా చేయిస్తున్నానని వాళ్ళు అనుకునేవారు. వాళ్ళకి నామీద కోపం యింకా పెరిగిపోయేది. ఇదంతా నాకు చాలా ఎంబరాసింగ్ గా వుండేది. ఇది నన్ను రాయకుండా ఆపలేదు కానీ విసుగు కలిగించింది.
..
నేను రెండు కధల పుస్తకాలు వేశాను. కవిత్వం తర్వాత సెటైర్ నాకిష్టమైన రూపం . అది నా కాలమ్స్ లో పలికి౦చడానికి ప్రయత్నిస్తాను.
జర్నలిస్టుగా నా వృత్తి కవిత్వాభిరుచికి ఆటంకం అనిపించలేదా అని ఆడిగేవారు. లేదు...దాని కొనసాగింపుగా అనిపించింది. జర్నలిస్టుగా డెడ్ లైన్స్ మీద పనిచేసిన నాకు కవిత్వం రాయడానికి అనేక వస్తువులు దొరికినట్టనిపించింది తప్ప ఆటంకం అనిపించలేదు. ప్రభుత్వ ప్రభుత్వేతర శాఖల్లోనూ అంతే.
..
అందుకున్న అరుదైన గౌరవాలు ;
ఇప్పటివరకు తాపీ ధర్మారావు , ఫ్రీవర్స్, నూతలపాటి గంగాధరం అవార్డు, దేవులపల్లి కృ ష్ణ శాస్త్రి అవార్డు , బి,ఎన్ రెడ్డి సాహితి అవార్డు, పొట్టి శ్రీరాములు లాంటివి వున్నాయి. అయితే అన్నిటికంటే నేనుఅ౦దుకున్న అనేక అవార్డుల్లో “కుమారన్ ఆశాన్ నేషనల్ అవార్డు” విశిష్టమైనది. కేరళ ప్రభుత్వ అతిధిగా 1990 సంవత్సరపు ఉత్తమ యువ కవయిత్రి గా ఎంపికయ్యాను.. ఇంతకు ముందు తెలుగునుంచి సినారే , గద్దర్ లకు మాత్రమే ఈ అవార్డు లభించింది. కవయిత్రుల్లో కమలాదాస్ తర్వాత నేనే అవడం కాస్త గొప్పగా అనిపిస్తుంది.
హ్యూమనిజం లిటరేచర్ అంశం కింద టోరి అంతర్జాతీయ రేడియోవారు 22. ఏప్రెల్ .2018 లో ఇంటర్వ్యూ చేశారు
..
కవిత్వం కాకుండా ఇతర అభిరుచులు
నాకు పెయింటింగ్స్ ఇష్టం . చిన్నప్పుడు వేసేదాన్ని. ఇప్పుడు ఫోటోషాప్ తో గ్రాఫిక్స్ తో సర్రియల్ ఇమేజెస్ చేసి సరదాగా ఫ్రెండ్స్ కి పంపుతుంటాను. అలాగే ట్రైనింగ్ టెక్నిక్స్ తెలుసుకోవడం ఆసక్తి. దానికోసం మాడ్యూల్స్ బాగా చదువుతాను. క్లాస్ రూమ్ ప్లానర్స్, మెటీరీయల్ స్వయంగా పిక్టోరియల్ గా తయారు చేస్తాను. కొన్ని సంస్థలకు స్పాన్సర్ చేశాను కూడా.
..
ఇప్పటి కవిత్వం గురించి ?
కొన్ని చాలా బావుంటున్నాయి. కొన్ని అసలు బావుండటంలేదు. తక్షణ స్పందనకె సంబరపడిపోవడం జరుగుతోంది. ఎడిట్ లేదు, రివ్యూ లేదు . నిజానికి కవిత్వం రాయడంలోనే ఎక్కువ అనుభూతి వుంది. దానికంటే పేరు ప్రఖ్యాతులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనిపిస్తోంది.
..
ఇప్పుడేం చేస్తున్నారు. ?
ప్రస్తుతం జండర్ , కమ్యూనికేషన్స్ స్కిల్స్, చైల్డ్ రైట్స్ లాంటి వాటిమీద గవర్నమెంట్ , నాన్ గవర్నమెట్ సిబ్బందికి టైనింగ్స్ ఇస్తుంటాను. . అనువాదాలు చేస్తాను. ట్రైనింగ్ మెటీరీయల్ , మాడ్యూల్స్ రాస్తాను. ఇవి కాక నా సాహిత్య కార్యక్రమాలు ఎలాగూ వుంటాయి.
ఇలా నేను వేసిన ప్రశ్నలన్నిటికీ చాల తీరిగ్గా, అతి తక్కువ సమయం లోనే, ఆమె నాకు పంపినారు. ప్రస్తుత కవిత విషయం గురించి ప్రస్తవిస్తూ, కవిత్వం ను ultimate వెలుగని. కవిత్వం ఉండగా, ఇంకో వెలుగు అవసరం లేదని అందుకే ఈ కవిత ను రాసానని చెప్పారు.
ఈ కవిత లో చాల idiomatic వర్డ్స్. వాక్యాలు, వాడుక బాష ఉండటం వల్ల, అనుసృజన చేసేందుకు పూర్తి స్వేఛ్చ తీసుకున్నాను. 
..
కవిత్వం వెలిగితే దీపం ఎందుకు ? kondepudi nirmala.!
అనుసృజన : సి.వి. సురేష్
..
Candle doused due to draught
Imaginaries before the eyes
Falling off assuden
The shadow of mine on the wall
Cracked down at a stretch
Chosen death while writing turned….
The unfinished poem
Fled away like a dragonfly..
To the back page..!
..
The environs became unfamiliar abruptly
Now I am unable to find….
Whether to search for light or poetry
Or to search inside of mine…!
I could catch the matchbox
By spreading the hands in the dark
Finding the fire is not a simple phenomenon
It Is a journey
between the ages of dark and supersonic..!.
..
Comforting myself in the light of tubes
In the dark thatched hut which is untamed to the souls
Being not known how to hold the fires
Roaming round around the turns
Across the Rooms…!
..
it is not the old darkness
of age old traditions n’ landmarks..
it is the new darkness
spilled on the unfamiliar milieu
Transforming my fire into two torches
Adjusting my walks in the eyes…
Understanding the Pain is also a light…
..
To invent the fire, primitives
Ignite the stone in the caves…
Myself, with the arranged comforts
Searching the roots of histories…!!
..
on continuing searches…
found a matchbox in the unexpected places
in such a small thing…
full pledged army hit my hand …!
aLike an adage…
‘Seeing the herb half cured disease’
A new drab is experienced to eyes
I tried to lit the fire…
Taking a match stick one by one…
Doubled the perseverance…!
May be the beacon emerged
Due to my ignis
Declared war with dark side of the room…
..
Alike ….
My tamed kitten swig the milk by obtrude the vessel
All the books shelf, the almirah n’ the velum
Gulping the luminescence in ecstasy
With the conquest vanity
My shadow strike the wall and intermit…!
Prior to the lamp off
One should write a poem
why the lamp, if
the poem itself incandesce!!
ఒరిజినల్ పోయెమ్
కొండేపూడి నిర్మల || కవిత్వం వెలిగితే దీపం ఎందుకు ?||
..
గాలికి కొవ్వొత్తి ఆరిపోయింది
కళ్ళముందున్న దృశ్యాలు
తటాల్న రాలిపోయాయి
గోడకి అటు తిరిగి రాసుకుంటున్న నా నీడ
విరుచుకు పడి మరణించింది
సగం రాసిన కవిత వెనక పేజీలోకి తూనీగలాఎగిరిపోయింది.
..
హటాత్తుగా పరిసరాలు అపరిచతమైపోయాయి
నేనిప్పుడు దీపం కోసం వెతకాలో
కవిత్వం కోసం వెతకాలో
నా కోసమే వెతకాలో తెలీడంలేదు
చీకటిలో చేతులు చాచి ఈదుకుంటూ
నిప్పుల పెట్టే అందుకోవాలి
నిప్పుని కనిపెట్టడం అంటే మాటలా
చీకటి యుగానికి రాకెట్ యుగానికి
వున్నంత ప్రయాణం వుంది
..
ట్యూబులైట్ల వెలుగులో అరకొరగా సర్దుకుని
మనసుకి౦కా మచ్చిక కాని ఈ కొత్త ఇ౦టి చీకటి కొట్టంలో
నుంచున్న చోటినుంచి ఎన్ని మలుపులు గదులు దాటి
ఆరలు వెతికి నిప్పుని పట్టుకోవాలో తెలీదు
..
అలవాట్లతో ఆనవాళ్లతో ఏళ్లతరబడి నడుచుకుపోయిన
పాత చీకటి కాదిది
పరిచితం కాని పరిసరాల మీద ఛల్లిన కొత్త చీకటి
..
నాలో వున్న నిప్పునంతటినీ రెండు కాగడాలు చేసి
కళ్లలో సర్దుకుని నడుస్తున్నాను
గాయం కూడా ఒక దీపమేనని తెలుసుకుంటున్నాను
నిప్పుని కనిపెట్టడానికి ఆదిమ మానవుడు
గుహ లోపలి రాయిని చెకుముకి చేస్తే
నేను పుట్టుకతో అమరిన సుఖ జీవన లాలసలో౦చి
మానవ నాగరిక చరిత్ర మూలాల్ని తడుతున్నాను
..
వెతగ్గా వెతగ్గా వెతగ్గా
వుంది అనుకున్న చోటు కాక వుండదు అనుకున్న చోట ఒక అగ్గిపెట్టే దొరికింది
అరచేతిలో ఇమిడేంట అంత చిన్న పెట్టెలో
నిండు సైన్య౦ నిబ్బరంగా చేతికి తగిలింది
మూలిక చూడగానే సగం రోగం తగ్గినట్టు
కాళ్ళకి కొత్త చీకటి కళ్ళకి అలవాటవుతోంది
ఒక పుల్ల గీసాను, సగానికి విరిగిపోయింది
ఇంకొక పుల్ల తీశాను ముఖం చిట్లీంచి వూరుకుంది
దమ్ముకున్న పెట్టె మీద పుల్ల మీద పుల్ల గీసి అఖరి బాణం తీసేసరికి
నా పట్టుదల రెట్టింపయింది
బహుశా నాలోపలి నిప్పు గదిలోపలి చీకటితో యుద్ధం మొదలెట్టిందేమో
దీపం వెలిగింది
..
ఆకలికి ఆగలేని మా పెంపుడు పిల్లి ఆత్రంగా పళ్ళాన్ని బోర్లిచుకుని పాలు తాగినట్టు
గది లోపలి పుస్తకాల అరా, బట్టల బీరువా , మ౦చమ్మీద పరచిన గళ్ళ దుప్పటి అన్నీ
తన్మయంగా వెలుతురు తాగుతున్నాయి
ఒక చీకటిని జయించిన గర్వంతో నా నీడ గోడని తన్ని నిలబడింది
దీప౦ ఆరేలోపు కవిత రాయాలి
కవిత్వం వెలిగితే దీపం ఎందుకు ?

No comments:

Post a Comment