Wednesday, July 18, 2018



                కవిత్వానువాదాలు - మన కవులు 


12

తగుళ్ల గోపాల్ 


      తగుళ్ల గోపాల్ కవిత..!!!
         ఒక submissiveness.  ఒక ఆప్యాయత. ఒక కలగోలుపు తనం గోపాల్ ది.  తన చుట్టూ అలుముకొన్న వాస్థవ దయనీయ పరిస్తుతులను  మార్క్సిజపు ధోరణి లో చూసే అయన దృక్పధం చాల ముద్దేస్తుంటు౦ది.  కవిత్వాన్నే ఊపిరి  చేసుకొన్నాడోలేక కవిత్వమే అయన  ఊపిరి  అయ్యిందో తెలియదు కానీ, ఇటీవల వచ్చిన అద్బుత కవుల్లో ఒకరయ్యారు. అలవోకగా రాస్తున అతడు నా ద్రుష్టి లో  సహజ కవి. సరళత్వం అతని కవిత్వం లోని  ప్రత్యేకత. 
.
         అనువాదం  విషయం లో అయన తో ఒకటీ రెండు సార్లు మాట్లాడాను. అభిమానం కురిపిస్తూ సాగే అతని సంబాషణలో ఒక  స్పిరిట్ ఒక జీల్ కనిపించింది.  ఈ కవిత  విషయాని కొస్తే, ఇది తనకు రోజూ కనిపించే ఒక వృద్ధురాలి దృశ్యం. కవిత కోసం అయన ఆమె తో మాట్లాడింది కాదు. ప్రతి రోజూ తనకు ఆమెను చూస్తే కలిగే దయ...అతడు నిజంగా ఆమె తో మాట్లాడే వాడు. అతని ఈ కవిత అతని తడి గుండె ఆలోచన.
.
        కవిత  వ్యవాహారిక బాష (colloquial language) లో ఉండి ఎంతో సరళ౦గా  ఉన్నా.  భావ తీవ్రత అధికం. ఆర్ద్రత ప్రతి పదంలో కనిపిస్తుంది. మూలాన్ని యధాతధంగా అనుసృజన లోకి తీసుకోవడానికి  పూర్తి స్వేఛ్చ ను తీసుకొన్నాను.   కొన్ని పదాలు “  ఎంతో కొంతకు అమ్ముత”  “చిక్కులు తీయని ఆమె నెత్తికి కొబ్బెరి నూనె గ మారిపోతా”  ఆమె కోసం.. కేవలం ఆమె కోసమైనా ...  ఇలా౦టి పదాల్లో  సహజ సిద్దమైన  ఆర్ద్రత, తెలుగు నుడికారాలు. అతని తడి ఆరని గుండె మనకు కనిపిస్తాయి. అవి అంత సులభంగా  అనువాదం లో ఇమడవు. స్వచ్చమైన అతడు ఇంకా స్వచ్చమైన కవిత్వాన్ని  అందిస్తున్నారు. ఇంకో  ముక్యమైన  విషయం  ఏమంటేఅతనికి  తెలీకుండానేఅతనిలో ఒక  musical  intellligence ఉంది.  ఒక  కథకుడు అతని లో ఇమిడి ఉన్నాడు.  అతని  కవితల్లో  (పరిణామ క్రమంగా) చూస్తూ  వస్తే,   రెండూ  ఎక్కువ  ప్రాధాన్యతగా  కనిపిస్తున్నాయి..  కవిత ప్రియులకు అతడో  వీనుల విందు.!      


ఒకే ఆకాశాన్ని కప్పుకున్నవాళ్ళం//తగుళ్ళ గోపాల్ 
ఆంగ్లం లోకి  అనుసృజన :  
సి.వి.సురేష్ || We, Sheathed The Same Ether ||
..
May be …
In  the  dawn ..At the noon..Over the dusk
If, I  won’t  see her
I feel as if..
no dawn  in the whole day
aphotic..some  pain and agony!  
..
Just for her
It’s just  for her only
I  Have to share the  touch  of damp
And to  gulp some tears
To my  ageold written feelings!
..
I myself, Have to get back
The  leftover soul of me from her
I have to  row them  in between the sentences.
In the alerted midnights…
have to spread  the earth 
To those  sentences 
I should   knit  a  poem…
..  
Either, In  the book selling stores
Or else, In the purchase counters..
Some  may buy my poem…
I will Sell.. 
Certainly,  I  will  sell out my poem ..
for some or  other  ransom!
I will
Keep  the entire ransom
In to her  handfulls 
I  will  paste The  smiles
 which are  flying away from her lips…!!
..
Myself..
ought  to convert as a coconut oil
To reach the  muddled head of her.
Myself..
Stop a while…to stare her compassion looks
Making myself leisure!
To conservate with her for a while!
..
She, herself…
 is an abandoned orphan..
She, herself…
is a ripen leaf to be fallen.
..
Though..she is noway  related..
She calls me ‘father…!’
I called her ‘mother…!’
we both sheathed the same ether
We ought to sheath the same earth..
Is it not  enough..
To get related both of us?


తగుళ్ళ గోపాల్ || ఒకే ఆకాశాన్ని  కప్పుకోన్న వాళ్ళం || 
ఉదయమో,మధ్యాహ్నమో,సాయంత్రమో
ఆమెను చూడకపోతే
ఆ రోజంతా సూర్యుడు ఉదయించనట్లు
చీకటి,వెలితి,బాధ
..
ఆమె కోసం
కేవలం ఆమెకోసమైనా
ఎప్పుడో రాసిపెట్టుకున్న భావాలకు
మళ్ళీ కన్నీళ్ళు తాగించి తడినిఅద్దాలి
..
ఆమె దగ్గర వదిలేసిన మనసును
మళ్ళీ పిల్చుకొచ్చి వాక్యాల్లో కూర్చోబెట్టాలి
అర్థరాత్రి నిద్రలేపిన అప్పటి వాక్యాలకు
మట్టిని పూసి మంచి కవితొకటి అల్లాలి
..
పుస్తకాలు అమ్మేచోటనో,కొనే చోటనో
నా కవితను
ఎవరైనా కొనకపోరా!
అమ్ముత...
ఎంతో కొంతకు అమ్ముత...
..
వచ్చిన చిల్లరంతా ఆమె దోసిట్లో పోసి
పెదాలనుండి ఎగిరిపోతున్న చిరునవ్వును మళ్ళీ అతికిస్తా...
..
చిక్కులు తీయని ఆమె నెత్తికి
కొబ్బరినూనెగా మారిపోత 
తీగల్లా కాళ్ళను అల్లుకున్న 
ఆమె దీన చూపులను చూసి ,ఆగుత
తీరికచేసుకొని కాసేపు మాట్లాడుత.
..
ఆమె
ఎందరున్నా ఎవ్వరూపట్టించుకోని అనాధ
రేపోమాపో రాలిపోయే పండుటాకు
మా మధ్య ఏ బంధుత్వమూ లేకపోయినా
ఆమె నన్ను నాయనా.... అంటది
నేను ఆమెను అమ్మా ....అంట
..
ఒకే ఆకాశాన్ని కప్పుకున్నం
ఒకే మట్టిని కప్పుకోవలసిన వాళ్ళం
ఇది చాలదా  ?
మేం బంధువులం కావడానికీ⁠..
                  *   *   * 




No comments:

Post a Comment