కవిత్వానువాదాలు - మనకవులు

5
బొల్లోజు బాబా
బొల్లోజు బాబాగారి కవిత. “ఒక దుఖానికి కొంచం ముందు..”
బొల్లోజు బాబా గారి ది ఒక క్రిస్టల్ క్లియర్ వ్యక్తిత్వం. అద్బుత శైలి. గొప్ప రచయతల జాబితాలో ఎప్పుడో
చేరిపోయారు. అటు కవిగా,
విమర్శకుడిగా, అనలిస్ట్ గా , తన దైన శైలి ని చూపించే మంచి మనిషి .
భిన్నత్వంతో నిండిన ఈ కవిత గురించి తప్పకుండా చెప్పాలి. ప్రభుత్వపు తప్పుడు విధానాల వల్ల అన్నదాత అనేక పోరాటాలు చేయడం, రోడ్లేక్కడం, విధిలేక అర్ధాంతరంగా తన ప్రాణాన్ని త్యజించడం..ప్రస్తుత భారతావని పై కదలాడే
దృశ్యాలు. అటు మహారాష్ట్ర రైతులు, ఆంధ్ర లోని
మిర్చి రైతులు, తమిళనాట రైతుల విన్నూత్న నిరసనల నేపధ్యం లో ఈ కవిత రాసారని కవితో మాట్లాడిన తర్వాత ఆయన ఆవేదన అర్థమైంది. ఈ కవిత ను ఆంగ్లం లోకి అనుసృజన చేసేందుకు నేను ఎంపిక చేసిన తర్వాత, అయన తో మాట్లాడాలని అనిపించింది. ఫోన్ నెంబర్ సాధించి మాట్లాడాను.
మార్క్సిజం, ఆ సిద్దాంతాలనూ చదివిన తర్వాతనే అవి ఎవరిలోకి అయినా ప్రవేసిస్తాయి అనుకోవడం పొరపాటే అని మరో సారి రుజువైంది.
పుట్టుక తోనే ఆ
భావనలు కొందరిలో
పుట్టుకొస్తాయి అన్నది వాస్తవం.. “Marxism is nothing but height
of humanism “.
ఆ రైతుల వేదన పై
ఆయన ఆవేదన అనంతం!!
సాదారణంగా, రైతుల ఆత్మ హత్య ల ముందు పంటలు ఎండి పోవడం, పురుగుల మందుల నకిలీ దాష్టీకం ఇలా అనేక
కారణాలు... ఆ
తర్వాత వారి కుటుంబం లో పరిస్థుతులు వీటిపై కవిత్వం చాలానే వచ్చింది. కానీ, జస్ట్ ఆ రైతు మరణానికి కొంచం ముందుగా, ఆ ఆ రైతు ఇంట్లో అతడి బార్య కు కానీ, ఆ పైరు కు కానీ, ఆ ఉరి గా మారే చీరే కు కానీ ఇవేవి తెలియవు. అక్కడ అంతా రోజు మాదిరి గానే కనిపిస్తాయి. ఒక్క రైతు మనసుకు తప్ప ఎవరికీ ఆ విషయం తెలియదు. అలాంటి పరిస్థితుల్లో కవి ఆ రైతు ఇంటి పరిస్థితి లోకి ప్రవేశించి, అక్కడ సాదారణంగా కనిపించే అసాదారణ పరిస్థితుల్లో వేదన ను
ఆర్ద్రంగా చిత్రీకరించాడు. ఈ విషయమ నాకు నిజంగా ఆశ్చర్యం కలిగించింది.
కవిత కు ఆ టైటిల్ ఎంచుకోవడమే అద్బుతం. చనిపోయే, ఆ రైతు ఇంట్లోని దయనీయ imaginary లను పాటకుడిలో దృశ్యంగా ప్రవేశ పెట్టడానికే
అన్నది అర్థమవుతుంది.
ఇక అనువాదానికొస్తే, చాల సరళంగా అనిపిస్తున్న ఈ కవిత చాల ఆర్ద్రత
తో కూడుకోంది. సరైన పదాల ఎంపిక, కవి మూల భావం,
ఆయన శైలి, ఆ టోన్, ఆ imaginary లను అలాగే అనువదించడానికి పూర్తి స్వేఛ్చ ను
తీసుకోవాల్సి
వచ్చింది.
“ఇసుక హృదయాలతో” “అప్పటికింకా,” “చెట్టుకొమ్మకు పిడికెడు మట్టి అయి.” ఇలాంటి పదాలు అనుసృజన లో వోదగడం లో కాస్త కష్టం
అనిపించింది. కొన్ని
రాయలసీమ లో వాడుకలో ఉన్న పదాలు కూడా ఈ కవిత లో కనిపించడం ఆశ్చర్యం అనిపించింది.
“దండెం” అనే ఈ పదం ఇక్కడ సీమ లో వాడుక. ఇంటి లోని ఒక గది లో గోడలకు పై బాగాన, ఒక వెదురు బొంగు ను రెండు వైపులా తాళ్ళు కట్టి పైకి వేలాడ దీసి ఉంటారు. దాదాపు పాతకాలం లో ప్రతి
ఇంటి లో ఉంటుంది.
దీనిపై బట్టలు ఆరేయడం
సహజం.
ఒక మంచి కవిత, ప్రస్తుత పరిస్థితుల్లో అనువాదం చేయడం అవసరమ అనిపించి మొదలెట్టినా, అనువాదం పూర్తి అయ్యేసరికి ఆ రైతు కుటుంబ పరిస్థితులపై వేదన మనసును బాధ పెట్టింది.
బొల్లోజు బాబా
గారి తో
మాట్లాడినప్పుడు
ఆయన మాటల్లో నాకు
అంతకన్నా వేదన కనిపించింది. మంచి కవిత ను అనువాదం చేశా అన్న ఆత్మ సంతృప్తి మిగిలింది.
బొల్లోజు బాబా || ఒక దుఖానికి కొంచం ముందు ||
సి.వి.సురేష్ || A LITTLE
PRIOR TO THE GRIEF ||
(ఆంగ్లం లోకి అనుసృజన )
..
..
By
then, yet
He
wasn't hanged to the tree,
as
converted into a fistful of mud!
He
was consoling the dried crops
Sitting
on the bank of fields…
With
the disrupted minds…!
..
..
By
then, yet
Her
better half was not buried…
She
was still spreading saffron .
On
the brow…
Like
a full shaped sun…!
..
..
By
then,yet
That
saree wasn't transformed
Like
a hanging- cord.
In
fact,
It
was hanging dried on the hanger…
Like
a faded sky .
..
..
By
then, yet
That
branch didn’t enter the role
of
gallows!
But,
closely observing, a
Snake
moving towards the
Birds
nest…
..
..
By
then, yet
The
world doesn’t know,
At
the early hours of tomorrow,
Assuming,
one’s declaration is
All
the civilization is a plot.’!
It
is sleeping pleasantly …
As
if no sin from her end…!
-_________
ఒక దుఃఖానికి
కొంచెం ముందు...
అప్పటికింకా
అతను
చెట్టుకొమ్మకు పిడికెడు మట్టై
వేలాడలేదు
చేనుగట్టుపై
కూర్చొని ఎండిన
పంటను
ఓదారుస్తున్నాడు, ఇసుక
నిండిన హృదయంతో.
..
అప్పటికింకా
అతని భార్యలో
సగభాగం ఖననం
చేయబడలేదు
కళాయిపోయిన
అద్దంలో
చూసుకొంటూ
నుదుటిపై
సూర్యబింబమంత
కుంకుమ దిద్దుకొంటోంది.
.
..
అప్పటికింకా ఆ
చీర
ఉరితాడుగా
మారలేదు
ఒక్క ఉతుకు
వానకే
రంగువెలసిన
ఆకాశంలా
దండంపై వట్టిపోయి వేలాడుతోంది
..
అప్పటికింకా ఆ
చెట్టుకొమ్మ
ఉరికంబం పాత్రను
ధరించలేదు
పక్షిగూడు దిశగా
పాకుతున్న
పామును
శ్రద్ధగా
చూస్తోంది.
..
అప్పటికింకా ఈ
ప్రపంచానికి
తెలీదు
రేపు ఉదయం ఒకడు
దాని
నాగరికత అంతా ఒక
కుట్ర అని
ప్రకటించబోతున్నాడని.
ఏ దోషం చేయనిదానిలా
ప్రశాంతంగా నిద్రిస్తూంది.
* * *
.

No comments:
Post a Comment