Tuesday, July 17, 2018


                                         కవిత్వానువాదాలు - మనకవులు


2



అఫ్సర్ 

        అఫ్సర్ గారు రాసిన ఈ కవిత తాాత్విక చింతన ప్రాధాన్యత  గలది.   కవి  ఎవరో  చెప్పకుండా కవితప్రియులచే ఈ  కవితను చదివిస్తే, ఇది అఫ్సర్”  కవిత అని ఖచ్చితంగా  చెప్పెస్తారు. వస్తుశైలి  వైవిధ్యం తో పాటు, అడుగడుగునా అద్బుతమైన మెటఫర్ లతో ఈ  కవిత శోభాయమానం.  బొల్లోజు బాబా గారు  ఇవాళ  వ్యాసం  లో  చెప్పినట్లు, ముఖ్యంగా  'డెడ్ మెటఫర్' లను  వాడకుండాసరికోత్హ మెటఫర్ లను ప్రయోగించారు. ఇది ఆయన శైలి ని ప్రస్పుటి౦ప చేస్తుంది. 
వొక చల్లని మంచు నిప్పుసెగని నేను
నిన్న రాత్రి నీ కలకి అంటుకున్న కార్చిచ్చుని నేను” 
కరిగిపోయిన ఇరుదేహాల సర్ప ఘోష
రెప్పల తెల్ల నవ్వు కింద
       ఇలాంటి  విన్నూత్న మెటఫర్ లతో  ఫిలాసఫీ కి అందనిది  అఫ్సర్  కవిత్వం. ఈయన  కవిత్వాన్ని ఆంగ్లం లోకి అనువదించాలన్న ఆలోచనే సాహసం. విషయం చెడకుండా, మనది కాని ఏ పరాయి బాష లోకి అనువదించాలంటే  ఒక  స్వేచ్చానువాదం తోనే సాధ్యం. తెలుగు బాష  లోని  సౌందర్యం పై పట్టుఅనువదించాల్సిన బాష పై బిగుతైన అవగాహన, కవిత రాసిన   కవితా౦శం ను సరిగా మెదడు కు ఎక్కించుకోవడంఇలా  ఈ మూడు  అంశాలపై అనువాదం ఆదారపడుతుంది.
ఈ కవితను అనువదించే విషయాని కి  వొస్తేటైటిల్  లోనే  సరికోత్హ expression మనకు కనిపిస్తుంది.రాయలేనిదేదో   పదం లోనే   ఒక ఆలోచన  మొదలవుతుంది.  writeable అంటే  రాయదగినది అని,   writable  రాయగలిగినది  అన్న అర్థాన్ని  ఇస్తాయి.   ఘర్షణ  మనసుకు  ఎదురు పడింది. చివరాకరకు “ something not writeable”  అని నిర్ణయానికి వచ్చాను. ఇలా.  ప్రతి  స్టాంజా లో  తెలుగు సౌందర్యం అంత  ఇనుమడింప చేసే ప్రతీకలు మెదడుకు పని  పెట్టాయి.
 “ ఆది యందు మాట ఉండేనో లేకపోయనో”   
 “ఆది యందె చివరి మాటని స్వప్ని౦చనీ”  
దుఖాలు పగలబడి .. నవ్వులు తిరగబడి “  ఇలా  idiomatic సొగసు తో పాటు, ఆలోచింప చేసే  కొన్ని  పదాలు ఆంగ్లం లోకి అంత సులభంగా  వోదగవు. ఒరిజినల్  కవిత లోని  తాత్విక చింతన అనువాద౦ లోకి స్వేచ్చగా ప్రవేశ పెట్టడం నిజంగా కష్టతరమైంది. 
కవి  (poet) , తత్వ వెత్త (philosopher)  ఈ ఇద్దరు పూర్తి విభిన్న౦.  ఫిలాసఫర్  లోతైన ప్రశ్నలతో, వాటి లోతైన అర్థాలతోవాస్తవికత, మేధో పరమైన , morals and logical (తర్కం), జనన, మరణ తాత్వికతఇలాంటి  సంక్లిష్ట  సమస్యల నుండి బయట  వేయగల సామర్థ్యం కలిగి ఉంటాడు.  కానీ, కవి, తాను strictures of conceptual thoughts కు exemption  అనితన భావా వేశానికి  అనుగుణంగా పదాలలోకి ప్రవేశించి, వాటికి  musical and playful effect ఇస్తూ సాగుతాడు. ఒక  philosopher,  ఒక  కవి  ఒకే మనిషిలో నిబిడీకృతమైతే  ఇలాంటి  కవితలకు జన్మ నిస్తారు. (The poet walks onto the philosopher's stage , abandoning none of his style and form, and turns his descriptive and metaphorical powers to the weightiest themes)


అఫ్సర్ :  || రాయలేనిదేదో ||
ఆంగ్లం లోకి  స్వేచ్చానువాదం :   సి.వి.సురేష్ 
||Something  Not  Writable||  

,,
While leaving ….
Stop a  moment,   stare a  while  on  the turning ….      
Something I wish to write moves
 away  in the corner of glances 
..     
In  the primitives                                                                                                                                                                                                                   
Whether   the  word  was  there or  not ….
 Let  me dream the  last  word in  primitive  itself…!

The sorrows, 
 overturned  guffawed spheres..
 In  the  burnt grief,  i am  the heat of a foggy  live coal….   
..
Prior to that, 
whether word was there or  not…!
But ,  I am an ignited wild fire of  your  last  night  dream!
.. 
time  isn’t conscious..
 the  sounds  of  an exuviated  moments..
melted  bodies boisterousness in one and the only growl !

..
In  the  carked  sponge leaf ,  In  the  delighted  fire granite
Conscious  only  after crossing …when  the body itself a hearth 
While leaving ….
Stop a  moment,   stare a  while  on  the turning!
beneath the white laugh of eyelids
one thing not  writable  turned  into ashes! 

...
ఒరిజినల్ తెలుగు కవిత .....
అఫ్సర్ ....|| రాయలేని దేదో ....! ||
వెళ్లిపోతూ మలుపు దగ్గిర కాసేపు నిలబడి చూడు 
రాయాలనుకొన్నదేదో  నీ చూపు చివర కదిలి పోయింది.
..
ఆది యందు మాట ఉండేనో లేక పోయానో 
ఆది యుందే చివరి మాట స్వప్నిచనీ నన్ను 
..
దుఖ్హాలు పగలబడి నవ్వుల గోళాలు  తిరగబడి 
శోకాలు తగలబడి వొక చల్లని మంచు నిప్పుసేగని నేను.
..
అంతకు ముందు మాట ఉండేనో ఉండక పోవునో 
నిన్న రాత్రి నీ కలకి అంటుకున్న కార్చిచ్చుని నేను 
..
కాలానికి తెలియదులే,రాలిపడిన క్షణాలు చప్పుడు 
ఒకే ఒక్కకేక లో కరిగిపోయిన ఇరుదేహాల సర్ప ఘోష.
..
చి౦తల చిగురాకులోసుఖాల నిప్పు కణికలో 
దాటి వెళ్ళాక కానీ స్పృహ రాదూ.  వోళ్ళే అగ్నిగుండమయినప్పుడు
..
వెళ్లి పోతూ మలుపు దగ్గిర కాసేపు నిలబడి చూడు 
రాయలేనిదేదో వొకటి దగ్ధమయింది. రెప్పల తెల్ల నవ్వు కింద 
                           *  *  *

No comments:

Post a Comment