కవిత్వానువాదాలు - మన కవులు
8
అనిల్ డానీ
అనిల్ డాని
కవిత..గాయపడ్డవాడా!!.
.
ఎలాంటి
భేషిిజాలు
లేని వ్యక్తి. మంచి రచయత. హిపోక్రసి అణువంతైన కనిపించదు.
సమాజం లో _అటు మనుషల వల్లనో, లేక ప్రకృతి వల్లనో మనిషి నిత్యం చితికి పోవడం , నోటికాడికి వచ్చి అందక పోవడం, అధైర్య పడటం సహజం. అలాంటి స్థితి లో సమాజాన్ని వెన్ను తట్టి లేపే బాధ్యత రచయతలపై ఉంటుంది. అలాంటి బాద్యత నే తన మీద వేసుకొని, కవిత్వాన్ని మలిచారు అనిల్ డాని..!
అనిల్ డానిగారి తో రెండు మూడు సార్లు మాట్లాడాను. ఎప్పుడూ ఉత్సాహంగా, ఆసక్తి గా మాట్లాడతారు. కవి సంగమం లో ప్రతి రోజు వస్తున్న ఆర్టికల్స్
పై వివరంగా చర్చించారు.
ఈ కవిత నేపధ్యం
పై మాట్లాడినప్పుడు,
అయన, చాల casual గానే చెప్పినా, అయన లోని ప్రోగ్రెసివ్ థాట్స్ ప్రతి మాటలో కనిపిస్తయి. నిరాశ నిస్పృహ లతో ఉన్న వాడిని తట్టి లేపి, కార్యోన్ముఖుడిని చేయడం ఆయన బాధ్యత గా స్వీకరించారు.
“మౌనం యుద్ధం కాదు.” ఈ వాక్యం అతి సరళంగా కనిపించినా, గీతోపదేశం లో అన్ని chaapters ను కలిపి సంగ్రహంగా చెప్పిన మాట గా
భావించాను. మౌనం
గా ఉంటె, జరగాల్సింది ఏదీ జరగదని చెప్పే అంతర్ అర్థం...
కాలమే, పరిష్కారం ఇస్తుంది అనడం నానుడి గా
విన్నాము.. కానీ,
ఈ కవితలో ...” నీ అడుగుల్లో అడుగులేసే వాడిని కాలమే కంటుంది” అని చెప్పడం కోత్హ అభివ్యక్తి. ఇంకా ఇంకా మనిషిని యుద్దొన్ముఖుడిని చేయడానికి, “గమ్యం ఎంతో దూరం లేదనీ”, “చీకటి లో రగులుతున్న జెండా కూడా రెప రెప లాడుతుందని”.....ఇలా.. పూర్తి రెవల్యూషనరీ ముగింపు ను ఇస్తారు.
ఇక అనువాదానికి వస్తే, టైటిల్ నుండే సంశయం మొదలవు తుంది. “గాయపడ్డ వాడా..!” కవి అతడిని పిలుస్తున్నట్లు అనిపిస్తు౦ది.
అందుకే
ఆంగ్లంలో కూడా అలా పిలిచినట్లే hey! Wounded
man..! అని టైటిల్ ను ఇచ్చాను. కొన్ని పదాలు షరా మామూలే. కవిత లో idiomatic సొగసు కోసం వాడిన పదాలు ఆంగ్లం లోకి ఇమడవు. “దోసిలి” అనే పదం ఆంగ్లేయుల వాడకం లోనే లేదు. రెండు చేతులను ఒక కప్పు లాగా చేయడం, ( two hands formed in
a shape of cup) చేయడం. దీన్నే
“డబల్ హ్యాండ్
ఫుల్”
అన్న ఆంగ్ల పదం గా వెతికి వాడాల్సి వచ్చింది.
అలాగే,
“గుండె గదులకు
తాళాలు వేసుకొన్న”
దీన్ని యధా తధంగా రాస్తే, true translation లాగా అనిపిస్తుంది. అంటే “హృదయ విస్తృతి లేని వాడు” అన్న అర్థం తీసుకొని అనువదించడం అయ్యి౦ది. ఒక సారి ఎపుడో కవి సంగమం లో కలిసిన గుర్తే, కానీ, ఫోన్ లో మాట్లాడినప్పుడు చాల ఆప్యాయంగా
మాట్లాడాడన్నసంతృప్తి ఇచ్చాడు. పూర్తి స్వేఛ్చ ను అనుసృజన లో పొందాను.
అద్బుత మైన తెలుగు కవుల అపరూప కవితల్ని ఆంగ్లం లోకి అనువదించడం మూలాన, మన తెలుగు కవుల ప్రతిబ ను ఆంగ్లం ప్రధాన భాష గా
ఉండే ఇతర
ప్రపంచానికి చూపించాలనే ఆశయానికి ఆయన పరిపూర్ణ మద్దతు నిచ్చారు.
(అనువాదం ఇప్పటిది కాదు. మొదట అనువాదాన్ని “ఛాయ” అని పిలిచే వారని, Translation
is the shadow of original writing. తర్వతర్వాత “లోకభాషికరం” అని పిలిచే వారని తెలుస్తోంది. అంటే, సంస్కృతం లోని గ్రంధాలను “లోక బాష” , అంటే ప్రజల బాష, లోకి అనువదించే కార్యక్రమ నిర్విగ్నంగా జరిగింది. ఆ తర్వాత సంస్కృతం లోని అనేక గ్రంధాలను, “లోకబాష” లోకి అంటే , ప్రజల బాష లోకి అనువదించారు. అనువాదాల చరిత్ర
లో,
1757 సం.. ను ల్యాండ్
మార్క్ గా చెప్పుకొస్తారు.
అంటే, ప్లాసీ యుద్ధం కు ముందు జరిగిన అనువాదాలను ఒక కోవగా, ఆ తర్వాత జరిగిన అనువాదాలను ఇంకో కోవ లోకి పరిగణిస్తారని
తెలుస్తోంది)
అనిల్ డ్యాని || గాయపడ్డవాడా ||
ఆంగ్లం లోకి అనుసృజన ::
సి.వి. సురేష్ || Hey!
Wounded Man! ||
Now,
I am in the urge of
Sprinkling
water on earth…
’n
searching for it in sky.
..
Myself,
Peeping
from the edges of last shoots…
The
soul of the deep roots…
..
Myself,
Wailing
for unripe fallen fruits
Reading
the stories of confined humans
..
Myself,
Hearkening
the charred anthems
Of,
the wounded souls
Myself,
Recalling
the fables ..
Of,
the persisted sleeping tombs …..
..
How
magical this past!?
It,
deprived …
The
yield of the black soil..
The
rainy of the sky..
from
the double handfuls ..
Which
are waiting in the last branches..
Now,
I am gazing the adust arboretum
..
Hey…
wounded man..!
Silence
is not a war
Let
us sing your agony like a song…!
Present
vacuum… will be filled tomorrow.
Time
endorses ..
Someone
sails in your foot steps..!
Attainable
is not for away….
From
your first steps.!
On
the edge of the dark…
The
raging flag also fluttering!!
అనిల్ డాని|| గాయ పడ్డ వాడా ||
ఇప్పుడు నేను
నేలమీద
పారబోసుకున్న నీటిని
ఆకాశంలో
వెతుకుతున్నాను
భూమిలోకి బలంగా
చొచ్చుకుపోయిన
తల్లి వేరు
జీవాన్ని చిటారుకొమ్మల చివర్లనుంచి తొంగి చూస్తున్నాను
పక్వానికి ముందే
రాలిపడిన ఫలాలను గుర్చి దుఖిస్తున్నాను
గుండె గదులకి
తాళాలేసుకున్న మనుషుల కధలు చదుతున్నాను
ఏ గాయపడిన
హృదయమో రాసిన దగ్ధ గీతాలని
ఊరి పొలిమేరల
దారుల్లో
వింటున్నాను
..
శాశ్వతంగా నిద్ర
పోతున్న సమాధుల గాధల్ని నెమరేసుకుంటున్నాను
ఎంత మాయదీ గడిచిపోయినకాలం
నల్ల రేగడి
మట్టి పంటని
ఆకాశపు చినుకుని
చెట్ల చివర్ల
మంచుని
ఎదురు చూసిన
దోసిలికి కాకుండా చేసింది
ఇప్పుడు
ఎండిపోయిన పూలవనాన్ని చూస్తున్నాను
..
గాయపడ్డవాడా
మౌనం యుద్దం
కాదు
నీ దుఖపు
నినాదాన్ని గీతంలా పాడుదాం
ఇప్పుడున్న
శూన్యం
రేపటికి ఉండదు
నీ అడుగుల్లో
అడుగులేసేవాడిని కాలమే కంటుంది
బయలుదేరిన
చోటునుంచి గమ్యం దూరమేమి కాదు
చీకటి చివర్న
రగులుతున్న
జండా రెపరెపలాడుతుంది
* * *


No comments:
Post a Comment