కవిత్వానువాదాలు - మన కవులు
11
బాల సుధాకర మౌళి
“
మనం భద్ర జీవితం
లో ఎంజాయ్ చేస్తున్నామనే ఒక నిరాశ ఉందన్నా...!.అవసరమున్న చోట గొంతెత్త లేక పోవడం ఈ అంశాలపైన కవి యుద్ధం చేయాలి...”
.
“అడవి గిరిజునలది, సముద్రం మత్య కారులది. ఆ సహజ వనరుల నుంచి వాళ్ళని తరిమేసే కుట్రలు జరిగాయి. జరుగుతున్నాయి. వాళ్ళ పక్షాన
కవిత్వం మాట్లాడాలి.”
.
“మార్క్సిజం అనేది నిత్య జీవితం లో సహజంగా
దానికదే అంతర్భాగం. భారత దేశంలో కులం అంతర్భాగమై పోయి ఉంది. వర్గాదిపత్యం
కులాధీపత్యం పోయే ఒక మార్గం లోకి కవిత్వం రావాలి. వస్తుంది. కాల స్వభావం ఆ కవిత్వం
పుట్టకకు దారి తీస్తుంది. ఇది నమ్ముతున్నాను.”
.
“ఇప్పుడోస్తున్న దళితకవిత్వం ఆ మార్గంలో ఒక
దారిని విస్తారం చేసుకొంటూ నడుస్తుంది. మొత్తం సాహిత్యం దారులన్నీ ఆ భిన్న రకాల
అంతరాలు పోవడానికి బయలుదేరుతున్నాయి. ఆ నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకం మీదనే మనం
వెళ్ళాలి. కవిత్వం కూడా దానికదే అంతర్భాగం..”
.
“కవి కన్నా కార్యకర్త గొప్పోడు. శ్రమజీవి
కన్నా మనం రాసే కవిత్వం గొప్పది కాదు. మనం రాసే అక్షరాలకి అనాది స్వభావం ఉంది.
పూర్వీకుల నుంచి కవిత్వం బాష ద్వారా కొత్త తరాలకు అందుతూనే ఉంది. కాబట్టి
కవిత్వానికైనా,
ఏ సాహిత్య
రూపానికైనా,
కేంద్రం
శ్రామికులే.. ప్రజల్లోనే కవిత్వం పుట్టింది. శ్రమ జీవుల మాటల్లో కవిత్వం ఉంది.
ప్రజల కోసమే అది పని చేయాలి.”
.
“అన్నా.. పేదరికం, వర్గ వైషమ్యాలు సామన్యుని జీవితాన్ని చిద్రం
చేస్తున్నాయి. ఇవాళ తెల్లవారు జామున 3 గంటల ప్రాంతం లో ఓ తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్ధి పచ్చ
కామెర్లు తో చనిపోయాడు.
కేవలం అవిద్య, డబ్బులేని తనం ఆ పిల్లవాన్ని పొట్టన పెట్టుకొంది.
ఈ తారతమ్యాలు పోవాలన్న..ఆ దిశగా కవులు రాయాలి. “
...
ఈ అద్బుత
విషయాలన్నీ,
“కవిత్వం తన
అంతిమ లక్ష్యం వైపు పయనిస్తోందా?” అన్న నా ప్రశ్న కు బదులుగా.. తనలోని ఉద్వేగాన్నంతా ఉత్హరాంద్ర కు చెందిన “బాల సుధాకర మౌళి” చెప్పడం నా మాటల్లో వొద్దని భావించి, అతని మాటల్లోనే కవి సంగమం మిత్రులకు ఈ
శీర్షిక ద్వారా అంద చేస్తున్నాను. అయన ఫోన్ కోసం కవి యాకూబ్ అన్న కు ఫోన్ చేశా. సరిగ్గా ఆయన ఆ
సమయం లో తన పుస్తకావిష్కరణ లో ఉండటం తో, నేను పెట్టేసా. బాల సుధాకర్ మౌళి గారికి
మెసెంజర్ లో మెస్సేజ్ పెట్టినాను. కొద్ది సేపటికి స్పందించారు. ఫోన్ నెంబర్ ఇచ్చారు. డిన్నర్ తర్వాత ఫోన్ చేస్తా
అన్నా.
అని చెప్పా.. అలాగే 10 గంటలకు చేసాను. ఒక సాహితి పిపాసి ని చూసా....
ఒక నిబద్దత గల
టీచర్. కవిత్వం తో ఏదో ఒకటి చేయాలనే తపన. కవిత్వమే జీవితం. జీవితమే కవిత్వం.
ఒకదాని కొకటి పరస్పర అంతర్భాగాలు. అంటూ.... అనర్గళ౦గా చెప్పుకు రావాడం ఒక ఎత్తైతే, మాటామాట కూ అన్నా...అంటూ ఆప్యాయంగా చెపుతూ, “మౌళి” అని పిలవండన్నా.... అ౦టూ తన సౌశీల్యం తో ఎదుటి వారిని కట్టి పడేస్తాడు “మౌళి”.
తన ఆరవ తరగతి
లోనే కవిత్వాన్ని రాసిన
ఈయన రెండు
సంకలనాలు విడుదల చేసారు. “
ఎగరాల్సిన సమయం.” “ ఆకు కదలని చోట “ . ఈ రెండు సంకలనాలల్లో అయన తన భావ కవిత్వం అందులో వేయలేదు. .
..
కవిత్వం...జీవితం పై మౌళి...ఎన్నో అద్బుత అంశాలు చెప్పారు.
అదంతా ఆయన
మాటల్లోనే
విందాం....!
..
నాన్న గీసే
బొమ్మల్లో
నే కవిత్వం
చూసా....!
.
అన్నా..! నా
నాన్న టీచర్.
బొమ్మలు గీయడం
ఆయన హాబి.
పక్కనే కూర్చొని
అయన వేస్తున్న బొమ్మల్ని తదేకంగా చూసే వాడిని. వాటిలో ఏదో తెలియని బాష ఉందని
అనిపించేది. ఆ బొమ్మలు ఏదో చెప్పాలని అనుకొంటున్నాయని భావించేవాడిని. క్రమేపి ఆ
బొమ్మలు నాతో కవిత్వాన్ని రాయించాయి. ఆంద్ర భూమి లో రావూరి భరద్వాజ గారి ఒక
శీర్షిక వచ్చేది. అది చాల స్పృహ తో చదివే వాడిని. కవిత్వం పట్ల జిజ్ఞాస పెరుగుతూ
అంచెలంచలుగా పెరిగింది.
..
మీ ప్రాంతీయ
మాండలీకం మీ పైన ప్రభావితం చూపలేదు కదా... అన్న ప్రశ్న కు ...
.
నా పైన ప్రాంతీయ
మాండలీకం ప్రభావం లేదనే చెప్పాలి. అక్కడక్కడ నేనా ఆ పదాలను వాడుతున్నప్పటికీ, నా పైన నా ఉత్హరాంధ్ర మా౦డలీకపు ప్రభావం
లేదు.
అయితే..
అఆధునిక శిల్ప
రీతులు మాండలీకాన్ని కొంత మింగుతాయని అభిప్ర్యపడుతున్నాను. అందుకే ఒక్కోసారి మనం
గ్రామీణ శిల్ప రహస్యాలహో కవిత్వం నిర్మాణం చేయాల్సిన బాధ్యత ఉంటాది. ఇక్కడ నేన౦టు౦ది అవసరం గురించి కాదు
బాద్యత గురించి...సుదీర్ఘ కాల సాహిత్య ప్రయాణమ లోఅవన్నీ సాధ్యమోతయన్న.....గ్రామీణ
పద సొబగును కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది . నిత్యాన్వేషణే కవిత్వం ని సమాజ
అవసరాలకి తగినట్టు రూపొందిస్తుంది.
..
నా దారెటు?
ఇంకా సంచారం
చేసి,
ఉత్తరాంద్ర జీవన
వాస్తవికతను,
ఆ సజీవ
దృశ్యాలతో కవిత్వం లోకి తరుజుమా చేయాలి. అయితే ఆధునిక సిల్పరీతులను కూడా కవిత్వం రాసినాడు పట్టించుకోవాలి. కవి అనే
పదం ..చెమట కార్చి బతుకు యాతన పదేవానికన్నా ఎక్కువైపోతు౦దనే ఒక బెగ కూడా ఉంది. కవి
మన చుట్టూ ఉండేశ్రామిక మనుష్యుల కన్నా ఎక్కవ కాదు.
..
నా అమ్మా..
కే.శివారెడ్డి గారూ
నా ద్రుష్టి లో
ఒకరే...
:
శివారెడ్డి గారు ఒక అద్బుతమైన మనిషి. జీవితమే
కవిత్వం... కవిత్వమే జీవిత౦ గా నడిచే వారు. ఆయన తో ఉదయాన్నే నడక ఎన్నో విషయాలను
తెలియచేస్తాయి. ప్రకృతి ని కవిత్వం లోకి ఎలా తీసుకోవాలో చెప్తూ నడిచే వాడు. మన ఇంటి మనిషి గా మారిపోతాడు. మన క్షేమ
సమాచారాలు ఆయనకు మొదటి ఛాయస్. ఒక ఉదాత్త మైన వ్యక్తిత్వం ఆయనది. ఆత్మీయత, అనురాగం లల్లో నాకు నా తల్లి. ..శివారెడ్డి
గారూ ఒకరే. అయన గురించి ఓ పుస్తకమే రాయాలనుంది.
..
కవిసంగమం
సాహిత్యాన్ని భుజాన మోస్తోంది. :
ఆ పత్రిక అయినా వారం లో ఒక రోజు కవిత్వానికి వెలుగు నిస్తుంది. కవి సంగమం ప్రతి రోజు
సాహిత్యాన్ని వెలిగిస్తోంది. క్రమం తప్పకుండ ప్రతి రోజు ఒక శీర్షిక కింద ఏదో ఒక కొత్త దనం కవితా ప్రియులకు, కొత్త వారికి అందియ్యడం ఒక గొప్ప పని. గతం లో యాకూబ్ అన్న కవిత్వం పై సౌబాగ్య గారు
రాసిన
పుస్తకం
చదివినప్పుడు,
“బహుత్ ఖూబ్ ... కవి యాకూబ్” అని చేరా అన్న మాటలు నిజం...!
..
ఈ కవిత ఎలా
ఉద్భవించింది అంటీ....
చలసాని ప్రసాద్ గారి మరణం నన్ను కలిచి వేసింది. ఆయన మరణించిన తర్వాత, ఆయన అభిమానులు, విద్యార్ధులు ఆయన పార్థీవ దేహాన్ని మెడికల్ హాస్పిటల్ కు అవయవాల దానం కోసం
ఇచ్చారు. నేనూ అక్కడికి వెళ్లాను. ఆయన మరణాన్ని
భరించలేని నేను, అటు తర్వాత, నేరుగా అక్కడ సమీపం లో సముద్రం దగ్గరకెళ్ళి
అక్కడే కూర్చున్నాను.
సముద్రం నన్ను
ఓదార్చే ఒక పెద్ద స్నేహం.
ఆ నేపధ్యం లో
రాసిన ఈ కవిత..
..
నాతో కలిపిన
ఆత్మీయ మాటలు....
అన్నా. మీతో
మాట్లాడటం ఆనందం అన్పించింది. అంతకు ముందు మీతో ఒకసారి మాట్లాడను. కడప లో ఉన్నారు. మీరు అనేక వారాలుగా చేస్తున్న ఈ అనువాదం పని
చాల విలువైనది. మందిని
కలిపెవోడు
గొప్పోడు. అనువాదాల ద్వారా ఇన్నాళ్ళుగా మీరు ఆ పనే చేస్తున్నారు. అద్బుతమైన దారిలో
సాగుతున్నారు. ఈ రాత్రిని కదిపినందుకు థాంక్స్ అన్న..మీరు ఫోన్ చేస్తా అన్నప్పటి
నుండి literal
గా ఎదురు
చూసాను. అన్నా. ఒకటి చెప్పనా. “ మీ ఫోన్ కాల్ ఇప్పుడ౦దరికిఒక స్పెషల్ కాల్ అవుతున్నది.. అవునన్నా.! మౌళి.
ఆత్మీయత ను మనసు నిండా నింపుకొన్నా..చివరగా, రాత్రి 3 వరకు సాగే మీ శ్రమ లో ఆరోగ్యాన్ని జాగ్రత్హ
గా చూసుకొండన్నా..అని ఆత్మీయంగా సూచన ఇచ్చారు. ...
..
బాల సుదాకర్
మౌళి
|| కొన్ని ఉద్విగ్న
క్షణాల మధ్య ||
అనుసృజన ఆంగ్లం
లోకి.. సి.వి.సురేష్
|| Some Tense Moments Amid… ||
..
1)
The
only scene before me….
Raising
the fists silently…
N’
whispering “salutes’...
Some
dreams
Raised
like waves n’ coming….
Some
agonies …
coming
like a puffed magma…
The
loved ones…
Sharing
their shoulders together ….
building
a new bridge….
Persons…
nothing
related each other
still shed their tears..
some
…
from
some where else
who
attained little courage
nd’
little inspiration there itself..
all
gathered around the
immortal
corpse…
nd’
committing asseveration of morrow.!
..
2)
i
started to stroll along the shore.
Sustaining
the affright within me..
I
started to sing his immortality
In
heil…
Comparing
.the tides with that bevy..
I’m
searching for …
The
goal of foot prints…On the sandy lines…
People
shoal around the sea….
Expressing
themselves in different forms…!!
..
3)
How
the sea will strengthen herself..!
It
will cradle and sooth us…
From
this side to that side…
Like
a cow enabling the calf to stand…!
Exactly
like revolting spark…!
..
4)
While
moving from there…
I
pumped myself some tensed moments….
Into
my veins….!
ఒరిజినల్
పోయెమ్...
బాల సుధాకర్
మౌళి ||
కొన్ని ఉద్విగ్న
క్షణాల మధ్య “
1)
మౌనంగా
పిడికెళ్ళత్తి
జోహార్లు
చెబుతున్న దృశ్యమే కళ్ళముందు –
ఏ స్వప్నాలు
కెరటాల్లా ఎగిసి
వస్తున్నాయో
ఏ దుఖాలు లావాల
ఉబికి వస్తున్నాయో
ఆత్మీయులు భుజం
భుజం కలిపి కొత్త వారదిని నిర్మిస్తున్న వాళ్ళు
ఏ౦ కాకపోయినా
కన్నీళ్లు కార్చిన వాళ్ళు
ఎక్కడ నుంచో
పిడికెడు
స్థైర్యాన్ని పొందినట్టు..
అక్కడి కక్కడే
కాసింత స్పూర్తిని పొందిన వాళ్ళు
అంతా ఒక దగ్గరే,
అమరుని దేహం
చుట్టూ చేరి
రేపటిని
వాగ్దానం చేస్తున్నారు.
2
తీరం వెంబడి నడుస్తున్నాను .
ఒక దిగులును
దిగమింగుకుంటూ.. గొంతెత్తి,
అమరత్వాన్ని
గానం చేస్తున్న
ఒక సామూహాన్ని
అలల ఘోషలో
పోల్చుకు౦టున్నాను..
ఇసుకపర్రల మీద
పాదాల గమ్యాన్ని
వెతుక్కుంటున్నాను
చుట్టూ,
జన సమూహం
సముద్రంతో
తమని తాము
విభిన్న
రూపాల్లో
వ్యక్త౦ చేసుకొంటూ...
3
సముద్రానికి
శక్తి ఎక్కడిను౦చోస్తుందో ..
.ఊయల లూపుతుంది.
లాలిస్తుంది.
అట్నుంచి ఇటు..
ఇట్నుంచి అటూ
తోస్తూ,
ఈనిన దూడని
నిలబెడుతున్న
తల్లి ఆవులా....
అచ్చం
విప్లవాగ్నిలా..
4
వెళ్తూ వెళ్తూ.
కొన్ని ఉద్విగ్న
క్షణాల్ని
రక్తనాళాల్లోకి ఊదుకుంటున్నాను * * *


No comments:
Post a Comment